Today Rasi Phalalu : ఆదాయంలో ఊహించని పెరుగుదల.. ఆ రాశివారికి ప్రయాణాలు కూడా లాభాలనే తెచ్చిపెడతాయి
Today Horoscope in Telugu (14/04/2024) : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? మార్చి 28వ తేదీన కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం.
Daily Horoscope for April 14th 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి
మేష రాశివారికి ఈరోజు బాగుంది. శుభవార్త వింటారు. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. ఆర్థికంగా లాభముంటుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతాయి. ఉదయాన్నే సూర్యునికి పూజ చేసి నీరు సమర్పిస్తే మంచిది.
వృషభ రాశి
ఈరోజు వృషభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారం మోస్తరుగా ఉంటుంది. ఊహించని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మిథున రాశి
ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కూడా చక్కదిద్దుకుంటాయి. వ్యాపారం చాలా బాగా ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా వస్తువులు అందుబాటులో ఉంటాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారు ఈరోజు కాస్త అలెర్ట్‌గా ఉంటే మంచిది. చిరాకు తగ్గించుకోండి. కుటుంబంతో సఖ్యతగా ఉండండి. వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆకుపచ్చని వస్తువులు దానం చేస్తే మంచిది.
సింహ రాశి
ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. శుభవార్త వింటారు. ప్రయాణాలు చేస్తే మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభుత్వ వ్యవస్థల నుంచి ప్రయోజనాలు అందుతాయి. కుటుంబలో పరిస్థితులు మెరుగవుతాయి.
కన్య రాశి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారం బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. డబ్బు విషయాల్లో కాస్త అలెర్ట్‌గా ఉండండి. శనిదేవునికి పూజలు చేస్తే మంచిది.
తుల రాశి
ప్రమాదాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. పిల్లలు, భాగస్వామితో సయమాన్ని వెచ్చించండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ సమస్యలు కూడా రావొచ్చు.
వృశ్చిక రాశి
పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ పరిస్థితుల్లో కాస్త మెరుగుదల ఉంటుంది.
ధనస్సు రాశి
జీవిత భాగస్వామితో ఇబ్బందులు దూరమవుతాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మునుపటి కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది.
మకరం
శత్రువుల నుంచి హాని ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కానీ పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. కుటుంబ, వ్యాపార సమస్యలు దూరమవుతాయి. ఆర్థికంగా కూడా లాభాలు ఉంటాయి.
కుంభ రాశి
మీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారం బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల కూడా అలెర్ట్‌గా ఉండండి. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మీన రాశి
సంపదలో పెరుగుదల ఉంటుంది. కానీ ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఆరోగ్య పరిస్థితులు కూడా ఇబ్బంది పెడతాయి. ఇంటి వ్యవహారాల్లో ఆచీతూచీ వ్యవహరిస్తే మంచిది. వ్యాపారం బాగానే ఉంటుంది.
Note: ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.