Tesla India Entry: నేడు భారత్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న టెస్లా.. ముంబైలో షోరూం ప్రారంభం.. కారు ధర ఎంతంటే…!
Tesla in India: It is official now. అంతర్జాతీయఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇండియాలో అడుగుపెడుతోంది. నేడు ముంబైలోటెస్లా అధికారిక షోరూం ప్రారంభమవుతోంది. మరి ఎలన్‌మస్క్ ఓపెనింగ్‌కు వస్తున్నారా..?

Tesla India Launch: ఎన్నోఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా నేటి (July 15) నుంచి అధికారికంగా భారత మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా తొలి షోరూమ్‌ను ప్రారంభించనుంది. Tesla ఇండియా మార్కెట్‌లో ఎప్పుడు వస్తుందా దేశంలోని ఆటోమొబైల్ ఔత్సాహికులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఎమర్జింగ్ మార్కెట్ అయిన భారత్‌కు సంబంధించి టెస్లా ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
షాంఘై నుంచి దిగిన టెస్లా కార్లు
భారత్‌లో షోరూం ఓపెన్ చేస్తున్న విషయం టెస్లా చాన్నాళ్ల క్రితమే ప్రకటించింది. అసలు షోరూం కాదు. ఏకంగా ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయడానికే మొదట ప్రయత్నాలు జరిగాయి కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. అయితే ముంబైలో షోరూం ఏర్పాటు చేస్తున్నట్లు టెస్లా కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. కొన్ని నెలలుగా కార్లకు సంబధించిన విడిభాగాలు, చార్జర్లతో పాటు.. Tesla లో బాగా ఫేమస్ అయినటువంటి ఆరు TESLA Y మోడల్ కార్లు దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. రేపు బాంద్రాకుర్లా లోని టెస్లా షోరూంలో ఈ ఆరు కార్లు డిస్ ప్లే చేయనున్నారు. దీనికి సమీపంలోనే కార్ సర్వీసు సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు Tesla తెలిపింది.
Tesla India: పదేళ్ల ప్రయాణం
2016 నుంచే టెస్లా భారత మార్కెట్‌లోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. అప్పట్లో కొంతమంది వినియోగదారులు మోడల్ 3 కోసం బుకింగ్ కూడా చేశారు. కానీ ఆ బుకింగ్స్‌ను కంపెనీ తిరిగి రద్దు చేసింది. అనేక చర్చలు, ప్రభుత్వంతో సాగిన సంప్రదింపుల అనంతరం ఇప్పుడు కంపెనీ భారత మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. భారత్‌లో ఉన్న అత్యధిక ఇంపోర్ట్ డ్యూటీల వల్లనే ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి వెనుకంజ వేసినట్లు టెస్లా ప్రకటించింది. భారత్‌లో దాదాపు 7౦శాతం వరకూ ఇంపోర్ట్ టాక్స్‌లు ఉన్నాయి. వీటిని తగ్గించాలని ఎప్పటి నుంచో మస్క్ డిమాండ్ చేస్తున్నారు. యుఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా భారత్‌లో పన్నులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనేక సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు అధికారికంగా ఇండియాలోకి ఎంటర్ అయింది. కార్లు తయారు చేయనప్పటికీ.. అధికారిక షోరూం ద్వారానే టెస్లా ఇక్కడ విక్రయాలు చేపట్టనుంది. మొదటి దశలో టెస్లా భారతదేశంలో కార్లను తయారు చేయదు. బదులుగా, పూర్తిగా తయారైన కార్లను విదేశాల నుంచి దిగుమతి చేస్తుంది. తొలి ఉత్పత్తిగా టెస్లా అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ మోడల్ Yను తీసుకురానుంది. దీని తర్వాత మోడల్ 3 కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 6మోడళ్లను ముంబైలో టెస్ట్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతానికి ముంబైలో షూరూం ప్రారంభమైన తర్వాత.. ఢిల్లీ, బెంగళూరుల్లో కూడా టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌లు ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఇప్పటికే కొన్ని షూరూం ఓనర్ల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి.

టెస్లా కారు ధర- ఫీచర్లు
ఇండియాలో దిగుమతి కార్లపై అధిక ట్యాక్స్‌లు ఉండటంతో టెస్లా కార్ల ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మోడల్ Y SUV ధర సుమారు రూ.60–70 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. టెస్లా బ్రాండ్‌కు ఉన్న ఫాలోయింగ్, ఆధునిక సాంకేతికత, పనితీరు కారణంగా లగ్జరీ కార్ల కొనుగోలుదారులు టెస్లా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మోడల్ Yలో 500 కి.మీ.కి పైగా రేంజ్, అధునాతన ఇంటీరియర్, పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉంటాయి. టెస్లా ఆటోపైలట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు కూడా అందుబాటులో ఉంటాయి.
Tesla భారత్‌కు ఎందుకొస్తోంది. ఇక్కడి మార్కెట్‌పై ప్రభావం
భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ల మార్కెట్. టెస్లా ప్రవేశంతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో భారీగానే మార్పులు వస్తాయి. దేశీయంగా ఇప్పటికే టాటా, మహీంద్రా, BYD, కియా వంటి కంపెనీలు ఈవీ మార్కెట్‌లో పోటీ ఇస్తున్నాయి. టెస్లా రాకతో పోటీ మరింత తీవ్రంగా మారుతుంది. అంతర్జాతీయంగా ఎదురువతున్న పోటీని తట్టుకోవడానికి మార్కెట్‌లో నిలబడటానికి టెస్లాకు ఇప్పుడు పెద్ద మార్కెట్ అవసరం. ఎందుకంటే Tesla కు ఇప్పుడు పెద్ద పోటీ చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD నుంచి ఎదురవుతుంది. ఈ కార్లు తక్కువ ధరకే అందుబాటులోకి రావడం.. టెస్లాకు దీటుగా ఫీచర్లు ఉండటంతో చైనాలో ఇప్పటికే టెస్లా మార్కెట్‌ను కోల్పోయింది. BYD షేర్ ధర 150 శాతం పెరిగితే.. టెస్లా 15శాతం పడిపోయింది. తిరిగి మార్కెట్‌లో నిలబడాలంటే.. ఇప్పుడు టెస్లాకు పెద్ద మార్కెట్ కావాలి. ఇండియాలో టెస్లాకు బాగా క్రేజ్ ఉంది. దానిని ఉపయోగించుకోవడానికి ఇక్కడకు వస్తోంది.
ఎలన్ మస్క్ వస్తున్నారా.?
ముంబైకి ఎలన్‌మస్క్ వచ్చే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఆయన స్వయంగా హాజరవుతారా… లేదా వీడియో సందేశం ఇస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి విడతలో ఎన్నికార్లు వస్తాయో కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది




















