News
News
వీడియోలు ఆటలు
X

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

శని సంచరిస్తున్న రాశులు (2023-2024): ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Sobhakritu Nama Samvatsara(2023-2024): శ్రీ శుభకృత్ నామ సంవత్సరాన్ని పూర్తిచేసుకుని శోభకృత్ నామసంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా 12 రాశులవారు వారి వారి ఆదాయ, వ్యయాలు - రాజపూజ్యం ,అవమానం ...గ్రహాల అనుకూల ప్రతికూలత గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే శోభకృత్ నామసంవత్సరంలో ఐదు రాశులవారికి శని ఉంటుంది. కొందరికి అష్టమ శని, మరికొందరికి అర్ధాష్టమ శని, ఇంకొందరికి ఏలినాటి శని.  కొన్ని రాశులవారికి గురుబలం బావుండడం వల్ల శనిప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. ఈ ఏడాది శని వల్ల ఇబ్బంది పడే రాశులేంటంటే....

కర్కాటక రాశి

శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో కర్కాటక రాశివారికి అష్టమ శని ఉంది. అయితే గురుడు శుభస్థానంలో సంచరిస్తున్నందున ఆర్థికంగా బావున్నప్పటికీ మానసికంగా కుంగుబాటు తప్పదు...కానీ అంతలోనే మీకు మీరు ధైర్యం చెప్పుకుని ముందుకుసాగుతారు. ప్రతిభకు తగిన ప్రోత్సాహం లభించదు. మీకన్నా చిన్నవారివలన అపవాదులు ఎదుర్గోవాల్సి ఉంటుంది..కొన్నిసార్లు ఔన్నత్యాన్న కోల్పోతారు. తలపెట్టిన పనులు పూర్తిచేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మాటపట్టింపులు పెరుగుతాయి..ప్రతి విషయంలోనూ అడ్డంకులు ఎదురవుతాయి

వృశ్చిక రాశి

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి అర్ధాష్టమ శని ఉంది. అయితే సంపత్తు కారకుడైన గురుడు అనుకూల స్థానంలో ఉన్నందున అంత తీవ్రమైన ఇబ్బందులు ఉండవు. ప్రతి విషయంలో అడ్డంకులు, ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ రానురాను పరిస్థితిలో మంచి మార్పు వస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల  మానసిక బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Also Read:  శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 5 రాశుల వారికి ఆదాయం పెరిగితే , ఈ 3 రాశులవారికి ఖర్చులు పెరుగుతాయి

మకర రాశి

శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మకర రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అంత తీవ్రమైన ప్రభావం ఉండదు. గురుబలం బాగానే ఉండడం వల్ల ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని ఎదుర్కోగలుగుతారు..తొందరగానే ఉపశమనం పొందుతారు. వ్యాపారులు, ఉద్యోగులు కష్టపడితే మాత్రమే ఫలితం పొందుతారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నందున కొన్ని సూతకాలు తప్పవు..ఆప్తబంధువులు మరణం మిమ్మల్ని బాధిస్తుంది. 

కుంభ రాశి

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కుంభ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అనుకున్నపనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంటా-బయటా అవమానాలు తప్పవు, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయలేరు. మానసిక బాధలు ఎదుర్కొంటారు, వివాహితుల జీవితంలో ఇబ్బందులు - చీటికి మాటికీ తగాదాలు - భార్య భర్త మధ్య సరైన అవగాహన ఉండదు. ఆప్త బంధువు మరణం కలచివేస్తుంది. అయితే గురుబలం ఉండడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.

Also Read: హమ్మయ్య ఈ ఉగాదితో ఈ రాశివారికి 'శని' వదిలిపోయింది, ఇక మంచిరోజులు మొదలైనట్టే!

మీన రాశి

శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మీన రాశివారికి సంపదకు కారణమైన గురుడు బలంగానే ఉన్నాడు కానీ ఈ ఏడాది నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. గురుబలం ఉన్నందున ఆదాయానికి లోటుండదు కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల మానసిక బాధలు తప్పవు. ఎలినాటి శని ప్రారంభం అవడం వల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది..ఏదీ కలసిరాక మానసికంగా కుమిలిపోతారు, అలసిపోతారు.గతంలో మీనుంచి సహాయం అందుకున్నవారే ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, ఊహించని కేసులలో చిక్కుకునే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండాలి. సాంఘికంగా, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎంత ఓపికగా ఉందాం అనుకున్నప్పటికీ సహనం కోల్పోతారు. కుటుంబ సభ్యులనుంచి కూడా మీపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు, ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి..ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి.

 

Published at : 23 Mar 2023 06:44 AM (IST) Tags: Ardhastama Shani Astama Shani elinati shani Shani Gochar 2023 saturn transit 2023 Sade Sati Sobhakritu Nama Samvatsara ugadi 2023

సంబంధిత కథనాలు

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి  ఎప్పుడొచ్చింది,  ప్రత్యేకత ఏంటి!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !