Rasi Phalalu Today in Telugu 16th May 2025: సంతోషకరమైన జీవితం, సరిపడా ఆదాయం..ఈ రాశులవారి లైఫ్ బిందాస్!
Rasi Phalalu Today in Telugu : మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీన రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

మే 16 రాశిఫలాలు
మేష రాశి (Aries) - 2025 మే 16
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం లభిస్తుంది . రహస్య మార్గాల ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మంచి ఆహారం తీసుకోండి. ప్రేమ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషం ఉంటుంది.
వృషభ రాశి (Taurus) - 2025 మే 16
వృషభ రాశి వారికి ఈ రోజు హెచ్చుతగ్గులతో కూడిఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. పని ప్రదేశంలో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. పిల్లల వైపు నుంచి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యక్తిగత జీవతంలో ఉండే సమస్యలు పరిష్కరించుకుంటారు
మిథున రాశి (Gemini) - 2025 మే 16
ఈ రోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది..మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమ జీవితం ఉన్నవారికి ఈ రోజు చాలా మంచిది. పని ప్రదేశంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశంసలు పొందుతారు. వ్యాపారం బాగాసాగుతుంది. మానసికంగా , శారీరకంగా బలంగా ఉంటారు. మీ శత్రువులను మీపై ఆధిపత్యం చెలాయించుకోనివ్వకండి.. దీనికి ముందుగా సిద్ధంగా ఉండటం అవసరం.
కర్కాటక రాశి (Cancer) - 2025 మే 16
ఈ రోజు కర్కాటక రాశి వారికి సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తిచేయలేకపోతారు. అందరితో మంచిగా ప్రవర్తించడం అసరం. ప్రతి పనిని విజయవంతం చేయడానికి మీరు ఎక్కువ కష్టపడాలి. ప్రేమ జీవితానికి రోజు బలహీనంగా ఉంది. ఆరోగ్యం కూడా బలహీనంగా ఉండవచ్చు. మీరు పనిచేసే ప్రదేశంలో అందరితో మంచిగా మాట్లాడండి.
సింహ రాశి (Leo) - 2025 మే 16
ఈ రోజు సింహ రాశి వారికి మంచి ఫలితాలుంటాయి. పని ప్రదేశంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీ ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ ప్రేమ భాగస్వామితో సమయం గడపడానికి మంచి అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఎవరైనా పెద్దవారి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఉద్యోగులు పనిపై శ్రద్ధవహించండి. సకాలంలో పనులు పూర్తిచేయండి.
కన్యా రాశి (Virgo) - 2025 మే 16
ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశంలో చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి. మీ ప్రేమభాగస్వామిని తీసుకుని ఎక్కడికైనా వెళ్లేందుకుప్లాన్ చేసుకుంటారు. కుటుంబ జీవితంలో సవాళ్లు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. ఇంట్లో ఏదైనా వివాదం జరగకుండా చూసుకోండి.
తులా రాశి (Libra) - 2025 మే 16
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది..కొత్త వ్యక్తులను కలుస్తారు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. స్నేహితులు బంధువులను కలుస్తారు. మీతో పనిచేసే వారితో మంచి ప్రవర్తన కొనసాగించండి. ప్రేమ విషయంలో రోజు మిశ్రమంగా ఉంటుంది. ప్రేమ భాగస్వామి మానసిక స్థితి కొన్నిసార్లు మంచిగా మరియు కొన్నిసార్లు చెడుగా ఉంటుంది దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు.
వృశ్చిక రాశి (Scorpio) - 2025 మే 16
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. దీనివల్ల మీకు ధైర్యం వస్తుంది , కొత్త పనిని ప్రారంభించాలని అనుకుంటారు. ఏదైనా శుభవార్త వింటారు. దీనివల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. కోపంపై నియంత్రణ ఉంచుకుంటే జీవితంలో సరైన దిశలో ముందుకు సాగుతారు. పని ప్రదేశంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషం లభిస్తుంది. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది
ధనుస్సు రాశి (Sagittarius) - 2025 మే 16
ఈ రోజు ధనుస్సు రాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతూనే ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది. దాంపత్య జీవితంలో పరిస్థితులు మెరుగుపడతాయి . ప్రేమ జీవితంలో ఏదో ఒక కారణం చేత చేదు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు దీనివల్ల మీ ఇద్దరి మధ్య దూరం రావచ్చు.
మకర రాశి (Capricorn) - 2025 మే 16
మకర రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. పనిభారం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మీ ఖర్చులు పెరుగుతాయి. రోజు ముందుకు సాగుతున్న కొద్దీ మీ పరిస్థితి మెరుగుపడటం మొదలవుతుంది. భూమి-స్థిరాస్తి విషయంలో లాభం లభిస్తుంది కానీ డాక్యుమెంట్లు తనిఖీ చేయండి. ఉద్యోగులకు శుభ ఫలితాలుంటాయి.
కుంభ రాశి (Aquarius) - 2025 మే 16
కుంభ రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. పనిలో మంచి అనుభూతి చెందుతారు. అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. రోజువారీ వ్యాపారులకు మంచి ఆదాయం వస్తుంది. వ్యాపారం విషయంలో చేసిన ప్రయాణం విజయాన్ని అందిస్తుంది . కుటుంబ జీవితంలో ఏదో ఒక విషయం వల్ల కొంత సమస్య రావచ్చు. ఎవరితోనైనా గొడవ పడే అవకాశం ఉంది మాట తూలొద్దు.
మీన రాశి (Pisces) - 2025 మే 16
ఈ రోజు మీనరాశివారికి మంచి ఫలితాలుంటాయి. మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. సవాళ్లపై విజయం సాధిస్తారు. ధనం విషయంలో రోజు మంచిది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో అనుకూలత ఉంటుంది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















