News
News
X

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు దూకుడు తగ్గించుకుంటే మంచిది,సెప్టెంబర్‌ 29 న్యూమరాలజీ

Numerology prediction September 29th : సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈరోజు( సెప్టెంబరు 29) ఎవరెవరికి కలిసొస్తుంది? న్యూమరాలజీ నిపుణులు ఏం చెప్పారో..ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

FOLLOW US: 
 

Numerology prediction September 29th : న్యూమరాలజీ ప్రకారం సెప్టెంబరు 29 గురువారం ఫలితాలు తెలుసుకుందాం...

నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19,28)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు స్నేహితుల నుంచి శుభవార్త వింటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో, కార్యాలయంలో స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నించండి. మాటతూలకుండా మాట్లాడాలి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఈ తేదీల్లో పుట్టినవారికి ఇదే మంచి సమయం. మీ లక్కీ నంబర్ 6

నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20, 29)
ఈ తేదీల్లో పుట్టినవారు రహస్యాన్ని రహస్యంగా ఉంచేందుకు ట్రై చేయండి. ఒంటరిగా కొంత సమయం గడపడంవల్ల ప్రశాంతంతను పొందుతారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రావొచ్చు. ఎప్పటినుంచో వేసకున్న ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. మీ ఆనందం కోసం మీ మనసుకి నచ్చిన పని చేయండి. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీ లక్కీ నంబర్ 2 

నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
మీరు ఈ రోజు చేసే ప్రతి పనిలో మంచి ఫలితాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. నిజాయితీగా వ్యవహరిస్తారు. ఓ ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. మొండితనం, అహం విడిచిపెట్టండి. స్నేహితులతో సంతోషంగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఆర్థిక రంగానికి చెందిన వ్యక్తులు, శాస్త్రవేత్తలు, రాజకీయవేత్త, రచయితలు, చిత్రకారులుకు గుడ్ డే... మీ లక్కీ నంబర్  3, 9

News Reels

నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22,31)
మీరు భూమికి సంబంధించిన పనులలో ప్రయోజనం పొందుతారు. కార్యాలయంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు  ఈ రోజు శుభప్రదం. మీరు పాత స్నేహితుడిని కలుస్తారు. కొన్నిరోజులుగా సాగుతున్న గందరగోళం నుంచి ఉపశమనం పొందుతారు. భవిష్యత్తు ప్రణాళికలు అమలుచేసేందుకు మంచి రోజు. మీ లక్కీ నంబర్‌ 6

Also Read: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14,23)
ఈ రోజు మీరు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు మంచి రోజు. మీ శ్రమకు తగిన ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు. భావోద్వేగాలు నియంత్రణంలో ఉంచుకోవడం మంచిది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ లక్కీ నంబర్‌ 5

నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ రోజు మీ మనసులో మాట చెప్పడానికి అనుకూలమైన రోజు. కుటుంబంతో కలిసి సంతోషంగా సమయం గడుపుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ మనస్సులో సానుకూల ఆలోచనలు తెచ్చుకోండి. ప్రేమ జంటల మధ్య పరస్పర విశ్వాసం  ఉండాలి. సన్నిహితులు, స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. సౌందర్య సాధనాలు, లగ్జరీ వస్తువులు, వాహనాలు, ఇల్లు, యంత్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి మంచి రోజు. మీ లక్కీ నంబర్‌ 6

నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఎప్పటినుంచో చేతికి రావాల్సిన డబ్బు అందుతుంది. కొన్ని వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. డబ్బు, భూములకు సంబంధించిన విషయాలలో పెద్దల సలహాను పాటించడం అవసరం. న్యాయవాదులు, ఐటీ నిపుణులకు అనుకూలమైన రోజు. మీ లక్కీ నంబర్‌ 7

Also Read: ఈ రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17, 26)
ఆస్తికి సంబంధించిన లావాదేవీలు జరిపేందుకు ఈ రోజు మంచిరోజు. ఆందోళనలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. మీ లక్కీ నంబర్ 6

నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18, 27)
ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. అప్పులు తీర్చగలుగుతారు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీంలో పనిచేసేటప్పుడు మీ అహాన్ని పక్కన పెట్టడం మంచిది. స్థల మార్పడి, కొత్త ఉద్యోగం, కొత్త సంబంధాలలో కలవడం నేర్చుకోవాలి. స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. మీ లక్కీ నంబర్ 9

Published at : 29 Sep 2022 07:32 AM (IST) Tags: horoscope rashifal Numerology Prediction September 29 ank jyotish rashifal September 29 Numerology Prediction 29 September 2022

సంబంధిత కథనాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Love Horoscope Today 2nd December 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Love Horoscope Today 2nd December 2022:  ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Horoscope Today 2nd December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd  December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

Nirai Mata Temple:ఏడాదికి 5 గంటలు మాత్రమే తెరిచే ఆలయం, మహిళలకు ప్రవేశం లేదు ప్రసాదం కూడా తినకూడదు

Nirai Mata Temple:ఏడాదికి 5 గంటలు మాత్రమే తెరిచే ఆలయం, మహిళలకు ప్రవేశం లేదు ప్రసాదం కూడా తినకూడదు

టాప్ స్టోరీస్

Amararaja Telangana : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Amararaja Telangana :  తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క