Image Credit: Pixabay
Mars-Venus Conjunction in Gemini: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారంతో పాటు వాటి కలయికకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి కూడా అన్ని రాశులపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశులవారికి మంచిచేస్తే మరికొన్ని రాశులవారికి వ్యతిరేక ఫలితాలనిస్తాయి. ఇప్పటికే కుజుడు మిథున రాశిలో సంచరిస్తుండగా మే 2 న శుక్రుడు కూడా అదే రాశిలో ప్రవేశించారు. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలున్నాయి.
మేష రాశి మూడవ ఇంట్లో శుక్రుడు, కుజుడు సంచరిస్తున్నారు. ఈ ప్రభావంతో వీరు ఆహ్లాదకర సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఇదే కాకుండా మీరు మీ జీవితంలో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
వృషభ రాశి వారికి రెండో స్థానంలో సంచరిస్తున్నారు కుజుడు- శుక్రుడు. వీరి కలయిన ప్రభావం వృషభ రాశివారికి అనుకూల ఫలితాలనిస్తోంది. శుక్ర-కుజ సంయోగ ప్రభావం వల్ల మీ జీవితంలో సంపద, సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి. మీరు వృత్తి జీవితంలో ప్రయోజనాలను పొందుతారు. కార్యాలయంలో మీ సీనియర్ల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఇదే కాకుండా మీ కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
కన్యారాశి వారికి కూడా శుక్రుడు-కుజుడి సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అనుకున్న చోటుకి బదిలీ అవుతారు..ప్రైవేటు ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. పెళ్లికానివారికి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలు బాగాసాగుతాయి...అనుకోని లాభాలు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
Also Read: వృషభంలోకి సూర్యుడు, ఈ రాశులవారి జీవితాల్లో వెలుగొస్తుంది
మేష రాశి, వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు అగ్ని స్వభావి. కుజుడు శుభస్థితిలో ఉండటం వల్ల జాతకుడు శక్తిమంతుడు, ధైర్యవంతుడు, నిర్భయుడు అవుతాడు. అదే సమయంలో చెడు స్థితిలో ఉంటే వివాహానికి ఆటంకాలు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మరోవైపు శుక్రుడు వైవాహిక జీవితంలో ఆనందాన్ని అందిస్తాడు. ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాయి. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మే 2వ తేదీన వృషభరాశిని విడిచిపెట్టి మిథున రాశిలోకి ప్రవేశించాడు. అదే రాశిలో మే 30 వరకు ఉండనున్నాడు. దీని తర్వాత శుక్రుడు చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలో సంచరించనున్నాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం పండితుల నుంచి, జ్యోతిష్య శాస్త్ర పుస్తకాలనుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!
June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే
జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!
కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?
Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా