Horoscope Today 22 December 2024: ఈ రాశులవారి కోరికలు నెరవేరుతాయి..అహంకారంతో ఉండకండి!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 22nd December 2024
మేష రాశి
మేష రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయం సాధిస్తారు. ఇతరుల సంక్షేమం , సేవలో నిమగ్నమై ఉంటారు .. కానీ వారినుంచి మీకు మద్దతు లభించదు. ఆరోగ్యం జాగ్రత్త.
వృషభ రాశి
వృషభ రాశి వారు ఎదుటివారి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విలువైన ఆస్తుల కొనుగోలు గురించి ఆలోచిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి పెద్ద మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఆడంబరం , అహంభావ ప్రవర్తనకు దూరంగా ఉండాలి.
మిథున రాశి
ఈ రోజు మిథునరాశి వారి కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీరు కార్యాలయంలో అద్భుతమైన అవకాశాలను పొందవచ్చు. శుభ కార్యాలకు సంబంధించి కుటుంబ చర్చలు జరిగే అవకాశం ఉంది.
Also Read: 2024 డిసెంబర్ 23 to 29 ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారఫలాలు!
కర్కాటక రాశి
కర్కాటక రాశి కుటుంబ జీవితం ఒత్తిడితో కూడుకున్నది అవుతుంది. మీ జీవనశైలిని అదుపులో ఉంచుకోండి. ఇంటి మరమ్మతులకు డబ్బు ఖర్చు చేయవచ్చు. స్పైసీ ఫుడ్ తీసుకోవడం మానుకోండి. దీని కారణంగా మీరు జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు స్నేహితులను కలుసుకోవచ్చు
సింహ రాశి
సింహరాశి వారు ప్రవర్తనను మెరుగుపర్చుకుంటారు. సన్నిహితులతో కలిసి పార్టీల్లో పాల్గొంటారు. మీరు సరైన దిశలో చేసిన పని నుంచి ప్రయోజనం పొందుతారు. క్రీడలపై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు.
కన్యా రాశి
కన్యారాశి వారు వ్యాపారంలో క్షీణతకు అవకాశం ఉంది. సున్నితమైన అంశాలకు సంబంధించి మనస్సు చికాకుగా ఉంటుంది. ఎవర్నీ రెచ్చగొట్టవద్దు. పని చేసేటప్పుడు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు ఆరోగ్యానికి సంబంధించి మీ డాక్టర్ నుంచి సలహా తీసుకోవచ్చు.
Also Read: 2025 కి స్వాగతం పలికే ముందు సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల వారఫలాలు
తులా రాశి
తులారాశి వారికి ఈరోజు శుభదినం. మీ వ్యక్తిత్వంపై ఇతరులపై ముద్ర వేస్తారు. మార్కెటింగ్ సంబంధిత పనుల్లో చాలా ప్రయోజనం ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పే మాటలను పిల్లలు పాటించాలి. వ్యాపారంలో లాభాలొస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో లక్ష్యాలను సాధించగలరు. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ స్నేహితులతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వ్యక్తుల ప్రణాళికలలో కొంత ఆటంకాలు ఉండవచ్చు. క్రమశిక్షణారాహిత్యం వల్ల మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేరు. గత అనుభవాల ద్వారా మీ పని నెరవేరుతుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక ఆరాధనల్లో చురుకుగా ఉంటారు.
మకర రాశి
మకర రాశి వారు ఆలోచించిన తర్వాతే మాట్లాడాలి. మీరు ప్రత్యర్థిని ఎదుర్కోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
Also Read: 2024 ఆఖరివారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల వారఫలాలు!
కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. గృహ వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు ఉండవచ్చు.
మీన రాశి
మీన రాశి వారు కార్యాలయంలో శుభవార్త పొందవచ్చు.మీ ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుంటారు. మీ హక్కులతో పాటు, మీ బాధ్యతల గురించి మీరు ఆందోళన చెందుతారు. చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. మీ భావోద్వేగాలను నియంత్రించండి.
Also Read: కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2025 - శని నుంచి విముక్తి , ఆర్థిక వృద్ధి, మానసిక ఆనందం ఉంటుంది కానీ..!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.





















