అన్వేషించండి

Horoscope Today 10 December 2024: ఏదో జరగబోతోంది అనే ఆలోచన ఈ రాశులవారిని వెంటాడుతుంది!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 10th  December 2024

మేష రాశి

మేష రాశి వారు ఈ రోజు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు.  పరస్పర ఆలోచనల మార్పిడితో మనసు ఆనందంగా ఉంటుంది. ఓర్పు , సంయమనంతో పని చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చేపట్టిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు 

వృషభ రాశి

వృషభ రాశి వారు ఈ రోజు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. కార్యాలయంలో ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. సరైన సమయంలో ప్రణాళికలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు. 

మిథున రాశి

నూతన ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ నిరీక్షణ ఫలిస్తుంది. సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి. చార్టర్డ్ అకౌంటెంట్లకు ఈరోజు ప్రత్యేకంగా అనుకూలమైన రోజు. పాత స్నేహితులు మీకు ఉపయోగపడగలరు. జీతాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. ఆత్మవిశ్వాసమే అతిపెద్ద బలం.

Also Read: డిసెంబరు 09 to 15 వారఫలాలు: ఆదాయం, ఆనందం, గౌరవం..ఈ రాశులవారికి ఈ వారం బాగా కలిసొస్తుంది

కర్కాటక రాశి

ఈ రాశి వారికి వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆదాయంతో పాటు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మీ సామర్థ్యాలను సమర్థంగా వినియోగిస్తారు. అతిథులను ఆహ్వానిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

సింహ రాశి

ఈ రాశివారు తమ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలను స్థిరంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామి   ప్రవర్తన వల్ల మీరు బాధపడవచ్చు. వ్యాయామం ,  ధ్యానంపై దృష్టి సారించండి.  మీ బలహీనతలు అందరి ముందు బయటపడతాయి. 

కన్యా రాశి

ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలోని అయోమయాన్ని తొలగించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక సంస్థలలో దానధర్మాలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇంటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

తులా రాశి

మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీ తెలివితేటలు ప్రతిచోటా ప్రశంసలు అందుకుంటాయి. కుటుంబ బాధ్యతల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి. వ్యవసాయ సంబంధిత పరిశ్రమల నుంచి లాభపడతారు.

వృశ్చిక రాశి

మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయాన్ని కొనసాగించండి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ముందుకు సాగడానికి స్ఫూర్తినిస్తారు. వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులు మెరుగైన ఫలితాలను పొందుతారు. మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడం గురించి ఆలోచిస్తారు. 

ధనుస్సు రాశి 

మీ అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దొద్దు. సోమరితనం కారణంగా కొన్ని పనులను వాయిదా వేస్తారు. మీ పనితీరును  వ్యతిరేకించేవారి సంఖ్య పెరుగుతుంది. మీ దినచర్యలో కొంత గందరగోళం ఉంటుంది. పిల్లల పురోభివృద్ధితో మనసు ఆనందంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో మంచి సమాచారాన్ని పొందుతారు 

Also Read: ఈ రాశులవారికి ఈ వారం నిరాశగా ఆరంభమై ఉత్సాహంగా పూర్తవుతుంది!

మకర రాశి 

ఈ రాశివారు లక్ష్యాలు సాధించడానికి కృషి చేస్తారు. వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. పెద్దల నుంచి మంచి సలహాలు పొందుతారు. అధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు.

కుంభ రాశి

మీ భావోద్వేగాలను నియంత్రించండి. మీ మనసులో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందనే భయం ఉంటుంది. ఆలోచనాత్మకంగా మాత్రమే పెట్టుబడి పెట్టండి లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించండి. అనారోగ్య సమస్యను తేలిగ్గా తీసుకోవద్దు.

మీన రాశి

మీ జీవిత భాగస్వామి సలహాను పరిగణలోకి తీసుకోండి. ఆర్థికపరిస్థితి మీరు ఊహించనంతగా మారుతుంది. ప్రారంభించిన పనులు నిజాయితీగా పూర్తిచేస్తారు. వ్యాపార విస్తరణకు కొత్త ప్రణాళికలు వేస్తారు. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రయోజనం పొందుతారు.

Also Read: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Embed widget