అన్వేషించండి

Mangal Gochar 2022: అక్టోబరు 16 న మిథునంలోకి కుజుడు, ఈ రాశులవారికి నెలరోజుల పాటు కష్టాలు తప్పవు!

Mangal Gochar 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Mars Transit in Gemini  16 October 2022: గ్రహాలు ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాయి. కొన్ని సార్లు అదే రాశిలో వక్రం లేదా తిరోగమనం చెందుతాయి. అయితే ఏ గ్రహం రాశిమారినా ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొందరికి ప్రతికూల ఫలితాలుంటాయి. ప్రతికూల ఫలితాలు కూడా కొందరికి ఆరోగ్యంపై మరికొందరికి ఉద్యోగంపై ఇంకొందరికి సంసార బంధాలపై ఉంటాయి. అయితే అక్టోబరు 16న కుజుడు వృషభ రాశినుంచి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబరు 30 అదే రాశిలో తిరోగమనం చెంది మళ్లీ నవంబరు 13న వృషభంలోకి వక్రంగా ప్రయాణించనున్నాడు. ఈ సంచారం రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది...ఆ రాశులేంటో చూద్దాం..

వృషభ రాశి
కుజుడి సంచారం వృషభరాశివారికి కూడా ప్రతికూల ప్రభావాలనే ఇవ్వనుంది. ఈ నెల రోజుల పాటూ ఏ పని తలపెట్టినా సరిగా పూర్తిచేయలేరు. కుటుంబంలో వివాదాలుంటాయి. దూరప్రాంతం ప్రయాణం చేయాలి అనుకున్నవారు మాత్రం వెళ్లగలుగుతారు. ప్రేమికులకు ఇబ్బందులు తప్పవు. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది. 

Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు, బాణసంచా ఎందుకు కాలుస్తారు!

మిథునరాశి
ఇదే రాశిలో కుజుడు సంచరిస్తున్నందున వీరికి అనారోగ్య సమస్యలు తప్పవు. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చిన్న సమస్యని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. నూతన పనులు ఆరంభించవద్దు, నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు. కోపం పెరుగుతుంది...వైవాహిక జీవితంలో సామరస్యం లోపిస్తుంది. ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్టైతే ఇది సరైన సమయం కాదు.

కర్కాటక రాశి
మిథునంలో కుజుడి సంచారం కర్కాటక రాశివారికి కూడా పెద్దగా కలసిరాదు. ఖర్చులు పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు తప్పవు. ఇంటి నిర్మాణం లేదా మరమ్మత్తు కోసం అదనపు ఖర్చు చేస్తారు. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. సరిపడా నిద్రలేక ఇబ్బంది పడతారు. 

తులా రాశి
కుజుడి సంచారం మీకు ఆరోగ్యం, ఆర్థిక సమస్యలుంటాయి. ఉద్యోగులకు, కార్మికులకు అకాస్మాత్తుగా బదిలీలు ఉండొచ్చు. ఉద్యోగం మారాలి అనే ఆలోచన అంత మంచిది కాదు. సోదరులు, సోదరీమణులతో చిన్న చిన్న చికాకులుంటాయి. ప్రతికూల ఆలోచనలు మీ మనసుపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అహంకారం కారణంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులుంటాయి. న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. 

వృశ్చిక రాశి
మిథునంలో కుజుడి సంచారం వృశ్చిక రాశివారికి చిన్న చిన్న అడ్డంకులు తప్పవు. డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి పెద్దగా సహకారం ఉండదు. వాహనం జాగ్రత్తగా నడపాలి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి. మీలో టెన్షన్ చికాకు పెరుగుతుంది. 

Also Read: దీపావళికి పెట్టే దీపాల్లో శనిదోషం తొలగించుకునేందుకు పెట్టేదీపం వేరే!

మీనరాశి
మీన రాశి వారికి ఆస్తులు తీసుకునేందుకు సమయం సరిపోదు. మీరు ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది. ఇది వారికి అననుకూల సమయం. సుఖాలు తగ్గడంతో ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget