Love Horoscope Today 7th December 2022: ఈ రాశివారికి కొత్త స్నేహం సంతోషాన్నిస్తుంది
Love Horoscope Today 7th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Love Horoscope Today 7tr December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
జీవిత భాగస్వామితో సంతోష క్షణాలుంటాయి. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమికులు పార్టీలకు హాజరవుతారు. డేటింగ్ కి వెళ్లే ఆలచనలో ఉంటారు
వృషభ రాశి
మీరు చాలా తెలివైన వారు...కానీ చిన్న చిన్న విషయాలను డీల్ చేయడంలో తడబడతారు. ఫలితంగా ప్రేమికులతో వివాదం ఉండొచ్చు. జీవిత భాగస్వామితో మర్యాదపూర్వకంగా ఉండడం మంచిది
మిధున రాశి
పాత స్నేహితుడితో సన్నిహితంగా మెలుగుతారు. ప్రేమ భాగస్వామి, జీవిత భాగస్వామితో వివాదం ఉండొచ్చు. అవివాహితులకు సంబంధం కుదురుతుంది.
Also Read: విసిరిన చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడితే చాలు పెళ్లైపోతుంది, క్రిస్మస్ రోజు వింత సంప్రదాయాలివే!
కర్కాటక రాశి
అనవసరమైన అపార్థాలను నివారించడానికి. మీ ప్రియమైనవారికి మీ మనస్సును వ్యక్తీకరించండి. మీ మనసైన వారితో మాట్లాడిన మాటలు మీలో సంతోషాన్ని నింపుతాయి
సింహ రాశి
సింగిల్ గా ఉండేవారు భాగస్వామికోసం అన్వేషిస్తారు. మీరు మీ ప్రేమ భాగస్వామితో ఏదైనా ప్రత్యేకమైన విషయం గురించి చర్చిస్తారు. మీ జీవిత భాగస్వామిపై మీకు కోపం రావొచ్చు. ప్రేమ వివాహం జరుగుతుంది.
కన్యా రాశి
స్నేహం, బంధంలో సంతోషం ఉంటుంది. జీవితంలో నిరాశగా ఉన్నవారికి కొత్త స్నేహం ఊపిరిపోస్తుంది. మీ శృంగార ఆలోచనలు మీ ప్రేమికులకు నచ్చవు. ప్రేమ సంబంధాలు కొనసాగించాలంటే కొన్నింటికి కట్టుబడి ఉండాలి
తులా రాశి
ఈ రోజు మీరు మీ ప్రేమ భాగస్వామికి మంచి బహుమతిని ఇవ్వవచ్చు. వైవాహిక జీవితంలో ఏదో ఒక విషయం గురించి ఆందోళన ఉంటుంది. అవివాహిత వ్యక్తులకు ప్రేమ భాగస్వామి కోసం అన్వేషణ పూర్తవుతుంది. వైవాహిక జీవితంలో ఇంటి పనుల విషయంపై వాదన పెరుగుతుంది
వృశ్చిక రాశి
భార్యాభర్తల మధ్య మంచి అవగాహన వివాహాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ప్రేమికుడితో విషయాలను షేర్ చేసుకోవడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. మీ భాగస్వామిపై ఒత్తిడి చేయడం వల్ల మరింత దూరమైపోతారు
Also Read: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది
ధనుస్సు రాశి
మీరు కొత్త భాగస్వామి కోసం అన్వేషణను పూర్తి చేయవచ్చు. మీరు మీ ప్రేయసి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా జీవిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రేమికుల విషయంలో అతి నిర్ణయం హానికరం
మకర రాశి
మీ సంబంధంలో లోపాలు స్పష్టంగా బయటపడతాయి. సమస్యల నుంచి బయటపడటానికి విశ్వాసం ఒక్కటే మార్గం. వైవాహిక జీవితం దృష్ట్యా ఇది క్లిష్టమైన సమయం.
కుంభ రాశి
ఓ శుభకార్యానికి హాజరవుతారు..ఈ సందర్భంగా ప్రేమలో పడే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఏదో ఒక విషయం గురించి చర్చ జరగవచ్చు. ప్రేమ భాగస్వామితో ఆకస్మిక వివాదం ఉండవచ్చు.
మీన రాశి
కొత్త ప్రేమ సంబంధాన్ని సృష్టించుకునే సమయం ఆసన్నమైంది. వివాహాన్ని ప్లాన్ చేయడానికి ఇది ఉత్తమ సమయం. మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, వాటిని నియంత్రించండి. మీ సామర్థ్యంతో మీ ప్రేమికుడిని ఆకట్టుకోండి, ఈ రోజు బాగుంటుంది.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి