Love Horoscope Today 17th December 2022: మీపై మీ భాగస్వామికి ఉన్న అపనమ్మకం తొలగించండి
Love Horoscope Today 17th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Love Horoscope Today 17th December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రోజు మీరు చేసిన వాగ్ధానాలు నిలబెట్టుకోండి. ఆ దిశగా ప్రయత్నాలు చేయకోతే మీ ప్రియమైనవారిని బాధపెట్టినవారు అవుతారు. ప్రేమికులకు శుభదినం
వృషభ రాశి
అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ పెళ్లిళ్లకు అవకాశం ఉంది. మీ మాటలతో అందర్నీ ఆకర్షిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వివాహితులు సంతోషంగా ఉంటారు
మిథున రాశి
మీ బంధాల విషయంలో జాగ్రత్తగా మసులుకోండి. మీ ప్రియమైన వారిపై నమ్మకం,ప్రేమ అత్యంత అవసరం. మీపై మీ భాగస్వామికి ఉన్న అపనమ్మకాన్ని తొలగించేందుకు ప్రయత్నించండి
కర్కాటక రాశి
ఈరోజు మనసులో ఆనందం ఉంటుంది..జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రేమికులు బయటకు జర్నీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ మనసైనవారు కోపంగా ఉంటే మీ మాటలతో ఆ కోపాన్ని పోగొట్టే బాధ్యత మీదే. ప్రేమ వివాహాలకు శుభసమయం
Also Read: ఆ ఒక్క విషయంలో తప్ప 2023 బాగా కలిసొస్తుంది, కన్యారాశి వార్షిక ఫలితాలు
సింహ రాశి
కుటుంబ సభ్యులతో కానీ భార్యతో కానీ భర్తతో కానీ ఓ విషయంలో వాదోపవాదాలు ఉండొచ్చు. ఒకటి కంటే ఎక్కువ ప్రేమ వ్యవహారాలు మీ మధ్య దూరాన్ని పెంచుతాయి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. అవివాహితులకు సంబంధం కుదురుతుంది
కన్యా రాశి
ఈ రోజు మీరు పనిలో పడి ప్రియమైనవారిని దూరం పెడతారు. గతంలో ప్రేమసంబంధం విచ్ఛిన్నమైతే మళ్లీ ఇప్పుడిప్పుడే మళ్లీ దగ్గరవుతారు. బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు
తులా రాశి
ఈ రోజు మీరు మీ ప్రేమికుడిని కలుస్తారు. పార్టీ మూడ్ లో ఉంటారు. భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో విబేధాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు తోబుట్టువులతో చెడిపోయిన సంబంధాలు మెరుగుపడతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశివారి ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. మీ భాగస్వామికి మనసులో మాట చెప్పడం ద్వారా సంతోషంగా, తేలికగా అనిపిస్తుంది. కొత్తగా పెళ్లైన జంట ఒకర్నొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి..లేదంటే మీ బంధం మధ్య సమతుల్యత చెడిపోవచ్చు
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
ధనుస్సు రాశి
మీరు మీ ప్రియమైన వారిని బాధపెడతారు. కోపంతో మాటతూలకుండా ఒకర్నొకరు గౌరవించుకోవడం మంచిది. మీ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేయవచ్చు. అత్తమామల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రేమికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.
మకర రాశి
ప్రేమ జీవితానికి ఈ రోజు అనుకూలంగా లేదు. గతంలో చేసిన కొన్ని తప్పులు ఈ రోజు బయటపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి జీవితంలో ఎదురైన సవాళ్లు మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తాయి
కుంభ రాశి
మీ కుటుంబ సభ్యులను సపోర్ట్ చేస్తూ మీ భాగస్వామితో వివాదం పెట్టుకుంటారు. మీ ప్రియమైన వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సమయంలో మీనుంచి వారికి భరోసా అవసరం. మీ సలహా మరియు సహకారం వారి సమస్యలను తగ్గిస్తుంది.
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మీన రాశి
అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఖర్చులు తగ్గించడం మంచిది. మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించండి