Love Horoscope Today 6th January 2023: ఈ రాశివారు వివాహ బంధంలో మాధుర్యం చెడకుండా చూసుకోండి
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 6th January 2023 : ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రాశికి చెందిన వివాహితులు, ప్రేమికులకు మంచి రోజు. పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు కుటుంబం సభ్యులతో ప్రస్తావిస్తారు. ఖర్చులు పెరగడం వల్ల కుటుంబంలో కొంత ఇబ్బంది ఉంటుంది..ఆ విషయంలో ఇద్దరి మధ్యా వివాదం రేగకుండా చూసుకోవాలి
వృషభ రాశి
ఈ రోజు అనవసర వాదనలకు దిగకండి. మీ బంధంలో మాధుర్యం చెడకుండా జాగ్రత్తపడండి. జీవితం కొంత స్తబ్ధుగా ఉంటుంది. ప్రేమ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వివాహం దిశగా అడుగేసేందుకు మీరు చొరవ తీసుకోవడం మంచిది.
మిథున రాశి
ఈరోజు మీ ప్రియమైన స్నేహితుని నుంచి సహాయం అందుతుంది. ప్రేమికులకు సమయం దొరుకుతుంది. అయితే ఈ విషయంలో సీరియస్ గా ఉండండి..పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి.
Also Read: ఆ ఒక్క విషయంలో తప్ప 2023 బాగా కలిసొస్తుంది, కన్యారాశి వార్షిక ఫలితాలు
కర్కాటక రాశి
ప్రేమికులను ఈ రాశివారు మనస్పూర్తిగా నమ్ముతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. అవివాహితుల నిరీక్షణ ఫలిస్తుంది. ప్రేమికులు బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.
సింహ రాశి
ఈ రాశివారి ప్రేమబంధం అయినా, వైవాహిక బంధం అయినా బలంగా ఉంటుంది. అయితే ఇంట్లోవారి కారణంగా చిన్న చిన్న విభేదాలు రావొచ్చు. మీ మాటతీరు మీ ప్రియమైన వారిని ఆకట్టుకుంటుంది. పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యే దిశగా ప్రయత్నాలు చేయడం మంచిది.
కన్యా రాశి
ఈ రాశి వివాహితుల మధ్య బంధం బలంగానే ఉంటుంది కానీ..నిరంతరం ఆంక్షల కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. వారిని స్వేచ్ఛగా ఉండనీయండి. వారి మనసులో మాటని చెప్పే అవకాశం ఇవ్వండి. ప్రేమికులు కూడా ఆంక్షలు విధించవద్దు
తులా రాశి
మీ మనసులో మాటని మనసైనవారికి తెలియజేసేందుకు ఈ రోజు మంచిరోజు. వివాహ బంధం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. భార్య-భర్త మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త.
Also Read: సింహ రాశివారికి 2023లో ఆ మూడు నెలలు మినహా ఏడాదంతా అద్భుతమే!
వృశ్చిక రాశి
ప్రేమికులకు అనుకూలమైన రోజు. వివాహేతర సంబంధాల వల్ల మీ జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. కొత్త భాగస్వామిని పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీ భాగస్వామి మీ కారణంగా సంతోషంగా ఉంటారు
ధనుస్సు రాశి
ఈ రోజు మీ బాధ్యత పెరుగుతుంది. ప్రేమను పొందడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాలి. వివాహ బంధం బావుంటుంది. అనవసర విషయాలను మీ జీవితంలోకి రానివ్వవద్దు. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. తల్లి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన చెందుతారు
మకర రాశి
మీరు కోరుకున్న భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించే అవకాశం వస్తుంది. భార్య-భర్త మధ్య పాత గొడవలు సమసిపోతాయి. ప్రేమికులు మాత్రం ఎలాంటి కారణం లేకుండా విడిపోయే అవకాశం ఉంది. మీరు త్వరగా భావోద్వేగానికి గురవుతారు.
కుంభ రాశి
ఈ రోజు మీరు కోరుకున్న విధంగా ఉంటారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. మీ ప్రతిభ మీరు ప్రేమించిన వారి ఆనందానికి కారణం అవుతుంది. ఈ రోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది.
మీన రాశి
జీవిత భాగస్వామితో మధురంగా మాట్లాడండి. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడడం తగ్గించుకోండి. మీ ప్రవర్తనలో చిన్న చిన్ మార్పుల వల్ల దూరమైన బందం కూడా దగ్గరవుతుంది.