అన్వేషించండి

Horoscope Today 20 November 2024: ఈ రాశులవారు అతి విశ్వాసం తగ్గించుకుంటే విజయం సాధిస్తారు!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today November 20, 2024

మేష రాశి

ఈ రోజు మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. వ్యాపారంలో లాభం ఉంటుంది కానీ ఒత్తిడి కూడా పెరుగుతుంది. న్యాయపరమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి. అపరిచితులను ఎక్కువగా నమ్మకూడదు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. మీ గౌరవం  గురించి మీరు చాలా ఆందోళన చెందుతారు 

వృషభ రాశి

ఈ రోజు మీకు కార్యాలయంలో సీనియర్ల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటాయి.  మీ ప్రత్యర్థులు మీ ముందు బలహీనులు అవుతారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై చాలా ఆసక్తిని కనబరుస్తారు.  మతపరమైన చర్చల్లో పాల్గొంటారు.
 
మిథున రాశి

ఈ రోజు మీరు వ్యాపారంలో భాగస్వాములుగా మారుతారు కానీ నష్టంపోయే సూచనలున్నాయి. మీ జీవిత భాగస్వామి సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు అవసరమైన పనులను పొందుతారు. మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆస్తిని  రక్షించుకోండి.

Also Read: కడప దర్గాకి రామ్ చరణ్ - అయ్యప్ప మాలధారులు మసీదు, దర్గాలకు వెళ్లొచ్చా!

కర్కాటక రాశి

మీరు ఈ రోజు వ్యాపారంలో నష్టాన్ని భర్తీ చేస్తారు. ఏదైనా పెద్ద పని చేసేముందు సరైన ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లడం మంచిది. సబార్డినేట్ ఉద్యోగుల పనితీరుతో మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులున్నా అప్పులు చేయవద్దు. 

సింహ రాశి

మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. డబ్బుకు సంబంధించిన విషయాల గురించి ఆందోళన చెందుతారు. తెలియని వ్యక్తులకు రుణాలు ఇవ్వడం మానుకోండి. అతి విశ్వాసం వల్ల మీ పని చెడిపోవచ్చు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఉండవు. 

కన్యా రాశి

ఈ రోజు మంచి రోజు అవుతుంది. దాంపత్య సంబంధాలలో మధురానుభూతి పెరుగుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో గొప్ప విజయాన్ని పొందవచ్చు. కార్యాలయంలో మీ ప్రణాళిక విజయవంతమవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి రోజు చాలా మంచిది. కళలకు సంబంధించిన వ్యక్తులు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు.

తులా రాశి

ఈ రోజు సంపదలో పెరుగుదల ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీ వ్యాపార విధానాలలో మార్పులు తీసుకురావచ్చు. మీ సామాజిక ఆధిపత్యం పెరగవచ్చు. మాట్లాడేటప్పుడు మీ మాటను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు తమ చదువుల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు.

Also Read: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం మరింత వేగంగా!

వృశ్చిక రాశి

ఈ రాశివారికి కార్యాలయంలో పని ఒత్తిడి పెరగవచ్చు కానీ మీరు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. న్యాయపరమైన వివాదాలను పరిష్కరించుకుంటారు. కెరీర్‌కు సంబంధించి మీకు కొత్త అవకాశం లభిస్తుంది. విద్యార్థులు చదువుపై చాలా శ్రద్ధ వహించాలి. అనియంత్రిత ఆహారపు అలవాట్ల కారణంగా, గ్యాస్ మరియు అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి..

ధనస్సు రాశి

మీరు ఈ రోజు వ్యాపారంలో పెద్ద మార్పులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. కీళ్ల నొప్పులకు సంబంధించి కొంత సమస్య ఉంటుంది. అపార్థం కారణంగా సంబంధాలలో వివాదాలు ఉండవచ్చు. భావోద్వేగాల ప్రభావంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఇంటి విషయాలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు 

మకర రాశి

ఈ రోజు వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఆస్తికి సంబంధించి నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. మీ పబ్లిక్ రిలేషన్స్ పరిధి విస్తరిస్తుంది. ఇంటికి అతిథులు వస్తారు.  మీ దినచర్యలో ధ్యానాన్ని  చేర్చుకోండి. 

కుంభ రాశి

ఈ రోజు ఉద్యోగులు పని విషయంలో సోమరితనంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీ కెరీర్ లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. 

మీన రాశి 

ఈ రోజు  యువత తమ వృత్తి గురించి ఆందోళన చెందుతారు. స్నేహితులను కలుస్తారు..తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.  కుటుంబ సభ్యుల వివాహానికి సంబంధించిన చర్చలు ఉండవచ్చు. పొట్టకు సంబంధించిన సమస్యలతో బాధపడాల్సి రావొచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులపట్ల మీ ప్రవర్తన మెరుగ్గా ఉంచుకోవాలి. 

Also Read: ఈ రాశులవారు ఈ వారం కలల ప్రపంచం నుంచి బయటపడితే అన్నీ శుభఫలితాలే!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget