By: RAMA | Updated at : 21 Feb 2023 07:14 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
Job And Business Astrology In Telugu: మీ రాశి,నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తే, ఎలాంటి వ్యాపారం చేస్తారో, ఏఏ ఉద్యోగాలు మీకు కలిసొస్తాయో ఇక్కడ తెలుసుకోండి
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదాలు)
సింహ రాశిలో మీది మఖ నక్షత్రం అయితే మీరు న్యాయవాదిగా, వైద్యుడు, సెక్యూరిటీ ఆఫీసరు ప్రభుత్వ శాఖలలోను, షిప్పింగ్, రసాయనాలు, నగలు, గనులు, జర్నలిజం, సి.ఐ.డి., మెరైన్ శాఖలలో ఉద్యోగాలు మీకు కలిసొస్తాయి. ట
పుబ్బ(పూర్వ ఫల్గుణి) నక్షత్రం అయితే వాహనాలు నడపడం, రేడియో, టీవీ, సేల్స్ మెన్, ఎలక్టికల్ షాపు, రవాణాశాఖ విద్యాబోధన ఆటో మొబైల్స్, సినిమాహాళ్ళలో ఉద్యోగాల్లో మీరు సౌకర్యవంతంగా ఉంటారు.
ఉత్తర నక్షత్రం అయితే కలెక్టర్, ఐజీ, ప్రభుత్వ శాఖలు, జ్యోతిష్యం, కాంట్రాక్టులు, పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ షాపులు, భారీస్థాయిలో హోర్డ్ వేర్ షాపులు నిర్వహణ, అందులో ఉద్యోగాలు చేస్తే ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఇనుప సంబంధిత వస్తువుల తయారీ ఫ్యాక్టరీలు కూడా మీకు కలిసొస్తాయి.
Also Read: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!
ఉత్తర ఫల్గుణి: కన్యారాశికి చెందిన ఈ నక్షత్రం వారు జ్యోతిష్య పండితులుగా, సాముద్రికం చెప్పేవారుగా, రసాయనాలు తయారుచేయడం, లెక్చరర్లుగా, ప్రభుత్వ రాయబారిగా బాగా సక్సెస్ అవుతారు
హస్త నక్షత్రం: ఈ నక్షత్రం వారు న్యాయవాది, కళాకారులుగా, బట్టలషాపు, పొగాకు సంస్థలు, లాండ్రీ, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, షిప్పింగ్, నేవీ, చెరువుల వ్యాపారాల్లో రాణిస్తారు.
చిత్త : ఈ నక్షత్రం వారు సేల్స్ టాక్స్ డిపార్టుమెంట్, అకౌంటెంట్, న్యాయసంబంధిత సంస్థల్లో ఉద్యోగాలు చేస్తారు. గుమస్తా శాఖలు, ఇంజినీరింగ్ , అకౌంటెంట్, నగ చిత్త : ల షాపుల నిర్వహిస్తారు.
తులారాశిలో మీది చిత్త నక్షత్రం 3,4 పాదాలు అయితే మీరు ఆటోమొబైల్ స్పేర్పార్ట్స్, టైర్ రీట్రేడింగ్, ఎలక్ట్రికల్ వస్తువులు, నగలవర్తకం, న్యాయస్థానంలో విధుల నిర్వహణ, రక్షణ శాఖలు, ఇంజనీరింగ్, సాంస్కృతిక సంస్థల్లో విధులు నిర్వర్తిస్తారు.
స్వాతి నక్షత్రం అయితే హాస్టల్స్, వైద్య రంగం, ట్రాన్స్పోర్టు ఏజెన్సీ, ఎక్స్-రే పరికరాలు, అలంకరణ సామాగ్రి, స్త్రీల వస్తువులు - ఎగ్జిబిషన్లు నిర్వహణ, వాహనావు నడపడం, రాజకీయ రంగంలో రాణిస్తారు .
విశాఖ నక్షత్రం వారు ట్రావెల్ ఏజెన్సీ, రియల్ ఎస్టేట్, నేవీ, రెవెన్యూ, బ్యాంకులు, ఫైనాన్స్ బట్టల మిల్లులు, చిట్ ఫండ్స్, పిండిమిల్లుల వ్యాపారాలు విశాఖ నక్షత్రం వారికి బాగా కలిస్తాయి.
Also Read: ఫిబ్రవరి 20 నుంచి 26 వారఫలాలు, ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాలు తులారాశిలోకి వస్తే నాలుగో పాదం వృశ్చిక రాశికి చెందుతుంది. ఈ పాదానికి చెందినవారు ఎస్టేటు, షేర్ మార్కెట్, రసాయనాలు, మందలు తయారుచేయడం, భూస్వామి, ఇన్సురెన్స్ అధికారి, రక్షణ శాఖలు మీకు కలిసొస్తాయి.
అనూరాధ నక్షత్ర జాతకులకు బట్టల మిల్లు, పెట్రోలు-డీజిల్ విక్రయం, ఎరువులు, ఇనుము, బ్రాందీ షాపులు, ఇంజినీరింగ్ వ్యవహారాలకు సంబంధించిన వాటిలో జీవనోపాధి పొందుతారు.
జ్యేష్ఠ నక్షత్రం వారు ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రికల్ యాడ్స్ , వైద్యం, కంప్యూటర్స్, టీవీలు అమ్మడం, బట్టల మిల్లులకు పరికరాలు సరఫరా చేయడంలో జీవనోపాధి పొందుతారు
Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!
Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!
Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!
మార్చి 23 రాశిఫలాలు, ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది
Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !
High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్