Human Survival Limits: ఆహారం లేదా నీరు లేకుండా మనిషి ఎన్ని రోజులు జీవించగలడు? దీని గురించి సైన్స్ ఏం చెబుతోంది, పురాణాల్లో ఏముంది?
Human Body Limits: ఆహారం లేదా నీరు లేకుండా మనిషి ఎన్ని రోజులు జీవించగలడు? మానవ శరీరం సామర్థ్యం ఎంత? దీనిగురించి సైన్స్ ఏం చెబుతోంది?

Survival Secrets: మానవ శరీరం అసాధారణంగా స్థితిస్థాపకంగా ఉంటుంది, కానీ దీనికి కొన్ని జీవసంబంధమైన పరిమితులు కూడా ఉన్నాయి. ఆహారం, నీరు లేకుండా మనుగడ అనేది మెదడు, గుండె , మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలను రక్షించే శరీర సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆహారం నీరు లేకుండా మనిషి ఎంతకాలం జీవించగలడు?
నీరు లేకపోతే అవయవ పనితీరును దెబ్బతింటుంది
శరీరంలో రక్త ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ , వ్యర్థాల తొలగింపుకు నీరు చాలా అవసరం. ఎందుకంటే మానవ శరీరంలో దాదాపు 60% నుంచి 70% నీటితో కూడి ఉంటుంది. అందువల్ల, నిర్జలీకరణం త్వరగా అవయవ పనితీరును దెబ్బతీస్తుంది. ఒక వ్యక్తి నీరు లేకుండా మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే జీవించగలడు. కొన్ని సందర్భాల్లో, మనుగడ ఒక వారం వరకు ఉండవచ్చు, కానీ తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం, అవయవ వైఫల్యం సాధారణంగా చాలా ముందుగానే సంభవిస్తాయి.
శరీర ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరుగుతుంది
నీరు లేకుండా రక్తం చిక్కగా మారుతుంది. మూత్రపిండాలు విష పదార్థాలను వడకట్టడం ఆపివేస్తాయి, శరీర ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరుగుతుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినడం వల్ల మెదడు కూడా ప్రభావితమవుతుంది. ఆకలితో మరణించడం కంటే డీహైడ్రేషన్ వల్ల మరణం అత్యంత వేగంగా , బాధాకరంగా ఉంటుంది. అందుకే నీటిని ఎప్పుడూ మనుగడకు అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తారు.
శరీరం గణనీయంగా బలహీనపడుతుంది
ఒక వ్యక్తి నీరు తాగడం కొనసాగిస్తే శరీరం మనుగడ స్థితికి వెళుతుంది. నిల్వ చేసిన కొవ్వును మొదట శక్తి ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఆరోగ్యకరమైన వయోజనుడు ఆహారం లేకుండా 3 నుంచి 8 వారాల వరకు జీవించగలడు. వైద్య కేసులు మనుగడ 70 రోజుల వరకు పొడిగించవచ్చని సూచిస్తున్నాయి. అయితే, అలాంటి సందర్భాలలో శరీరం గణనీయంగా బలహీనపడుతుంది.
అవయవ పనితీరు మందగిస్తుంది
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు సాధారణంగా ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవిస్తారు. ఎందుకంటే కొవ్వు శక్తి నిల్వగా పనిచేస్తుంది. ఆకలి పెరిగేకొద్దీ, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది, కండర ద్రవ్యరాశి తగ్గుతుంది అవయవ పనితీరు మందగిస్తుంది. చివరికి, గుండె , మెదడు పనిచేయడానికి తగినంత శక్తి లభించదు.
మానవ ఓర్పును అర్థం చేసుకోవడానికి, 3 అనే నియమాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆక్సిజన్ లేకుండా 3 నిమిషాలు, నీరు లేకుండా 3 రోజులు, ఆహారం లేకుండా 3 వారాలు.
అధిక వేడి నిర్జలీకరణాన్ని పెంచుతుంది. చల్లని వాతావరణాలు శక్తి వ్యయాన్ని పెంచుతాయి. శారీరక శ్రమ నీరు , శక్తి నిల్వలను మరింత త్వరగా క్షీణింపజేస్తుంది, మనుగడ సమయాన్ని తగ్గిస్తుంది.
దీని గురించి పురాణాల్లో ఏముంది?
పురాణాలు, ఇతిహాసాలు, యోగ గ్రంథాల్లో రుషులు, మునులు, యోగులు చాలాకాలం ఉపవాసం ఉంటారని చదువుకున్నాం. ఇవి భక్తి, ఆధ్యాత్మిక ద్వారా జీవించారని సూచిస్తాయి. శాస్త్రీయంగా సాధ్యంకాని చాలా విషయాలు దైవికంగా సాధ్యం అవుతాయని చెబుతున్నాయ్ పురాణ గ్రంథాలు.
వాల్మీకి రామాయణంలో మాడకర్ణి ముని 10 వేల సంవత్సరాలు గాలి పీల్చి జీవింంచాడని, ఆహారం తీసుకోకుండా తపస్సు చేశాడని ఉంది
మరికొందరు రుషులు కిరణాల ద్వారా జీవించారనే వర్ణనలు ఉన్నాయి.
ప్రహ్లాద్ జానీ అనే యోగి 1940 నుంచి 70 ఏళ్లపాటూ ఆహారం , నీరు తీసుకోకుండా జీవించానని చెప్పారు. 2000 లో డాక్టర్లు దాదాపు రెండు వారాల పాటూ ఆయన్ని అబ్జర్వ్ చేసి ఏమీ తీసుకోలేదని, తను చెప్పింది నిజమే అని నివేదించారు. అతడు దేవి అనుగ్రహంతో ప్లానెట్స్ ద్వారా నీటి బిందువులు వస్తాయని చెప్పాడు.
ఇంకా పురాణాల్లో ఇలాంటి కథలు తపస్సు శక్తి, దైవిక అనుగ్రహం, సాధన ద్వారా సాధారణ మానవ పరిమితులను అధిగమించవచ్చనే సందేశం ఇస్తాయి. కానీ శాస్త్రీయంగా ఇది సాధారణ మనుషులకు సాధ్యం కాదు
























