Horoscope Today: ఈ రాశులవారికి ఈ రోజు ధనలాభం…ఈ రాశులవారు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
ఆగస్టు 5, 2021 రాశిఫలాలు
మేషం
మేషరాశి వారు ఈరోజు శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఖర్చుల విషయంలో ఆందోళన ఉంటుంది. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. మీ ఆలోచనలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయొద్దు.
వృషభం
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి. కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. స్నేహితులు, బంధువులను కలుస్తారు.
మిథునం
మిథునరాశివారికి వ్యాపారం బాగానే ఉంటుంది. ఆర్థిక పురోగతికి అవకాశాలుంటాయి. నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు మంచిది. మీరు కొన్ని ముఖ్యమైన ప్రణాళికలో భాగం కావచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పొద్దు.
కర్కాటక రాశి
కర్కాటకరాశివారికి ఈ రోజు ఆర్థికంగా బావుంటుంది. పని పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మీరు కొత్త పనిలో పెట్టుబడి పెట్టొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఏదో విషయంలో ఇంట్లో భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.
సింహం
ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. స్నేహితుల నుంచి సహాయం తీసుకోండి. యువతకు కెరీర్ సంబంధిత సమాచారం లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. అత్తింటివైపునుంచి శుభవార్తలు వింటారు.
కన్య
ఈరోజు మీ సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. కొత్త పని నుంచి ప్రయోజనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో ఎవరితోనైనా వివాదాలు ఉండవచ్చు. అనారోగ్య సూచనలున్నాయి...జాగ్రత్త. చికిత్సకు ఎక్కువ ఖర్చవుతుంది. చర్చలు జరుపుతున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.
తులారాశి
తులారాశివారు ఈ రోజు బంధువుల నుంచి దుర్వార్త వింటారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
వృశ్చికరాశి
యూత్ కి కలిసొచ్చే రోజిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. రోజంతా సంతోషంగా గడుస్తుంది. గొడవలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బావుంటుంది.
ధనుస్సు
ఈ రోజు మీరు మీ భావోద్వేగాలను నియంత్రించగలుగుతారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఓ శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. మీ దినచర్యను మార్చేందుకు ప్రయత్నించండి. కీళ్ల నొప్పుల నుంచి బయటపడతారు. తల్లిదండ్రులకు సేవ చేయండి.
మకరం
మకరరాశివారికి ఈ రోజు కొత్త కొత్తగా ఉంటుంది.ఓ శుభవార్త వింటారు. చేసే పని విషయంలో సంతృప్తి చెందుతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. పాత మిత్రులను కలుస్తారు. ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది.
కుంభం
ఈరోజు ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి. మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి వద్ద ఏవిషయాన్ని దాచొద్దు. ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి.
మీనం
ఈ రోజు మీరు మీ వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పొద్దు. చెప్పినట్టైతే వారినుంచి హాని తప్పదు. ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సమయానికి పని పూర్తవుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.