News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

Rasi Phalalu Today June 5th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Horoscope Today 5th June 2023: జూన్ 5 సోమవారం మీ రాశిఫలితాలు

మేషరాశి

 ఈరోజు ఎక్కువ లాభాలను ఆశించకూడదు. ప్రతికూల స్వభావం గల కొందరు వ్యక్తులు మీ లక్ష్యాలను  పక్కదారి పట్టిస్తారు. మీ  శక్తిని ,అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల మీరు అవమానాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. మితాహారం, ప్రణాళిక బద్దమైన  దినచర్య లాంటి నియమాలను కచ్చితంగా పాటించండి. 

వృషభ రాశి

శుభవార్త అందుకుంటారు. క్లిష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. మీకు సమాజంలో ఆదరణ లభిస్తుంది. మీరు కార్యాలయంలో గుత్తాధిపత్యాన్ని పొందుతారు. విలువైన సమయాన్ని మీ భాగస్వామి తో గడుపుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటానికి అనుకూలమైన సమయం.

మిధునరాశి

ఆర్థిక ప్రణాళికలు రూపొందించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు సామాజిక నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఇంట్లోని వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు .  పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ బాధ్యతల పట్ల చాలా విధేయతతో ఉంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

Also Read: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

కర్కాటక రాశి

ఈ రాశి ఉద్యోగస్తులకు తీవ్ర ఒత్తిడి. ఆరోగ్యం బాగుంటుంది.మీలో దాగి ఉన్న అంతర్గత శక్తి , ఉత్సాహం మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. ముఖస్తుతి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయవచ్చు. అందుకే పరాయి వ్యక్తులు చెప్పేవాటిని పెద్దగా పట్టించుకోకండి.

సింహ రాశి

ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ మనస్సులో నిరాశ భావన పెరగనివ్వవద్దు. ఇతరుల తప్పులను చూపిస్తూ సమయాన్ని వృథా చేయకండి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా పని చేయాలి. అతి విశ్వాసం వల్ల నష్టపోతారు. ప్రేమికులకు మంచి సమయం. వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. 

కన్యా రాశి

అత్యంత ఆప్తుడైన స్నేహితుడ్ని కలుస్తారు.  వ్యాపారంలో పెద్ద ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పరస్పర ప్రేమ,సామరస్యం ఉంటుంది. ప్రభుత్వోద్యోగంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవిని పొందవచ్చు. ఇతరుల సలహా కంటే మీ ప్రణాళికలకు ప్రాధాన్యత ఇవ్వండి

Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది

తులా రాశి

ఆఫీస్ పనుల్లో ఏకాగ్రత వహించండి. సోదరులతో అన్యోన్యంగా గడుపుతారు. పిల్లలు తల్లిదండ్రుల ఆదేశాలను పాటిస్తారు. వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నూతన దంపతులు అన్యోన్యంగా గడుపుతారు.ప్రయాణాలకు అనుకూలమైన సమయం.

వృశ్చిక రాశి

ఈ రాశివారి ఇంట్లో ఆహ్లాద వాతావరణం నెలకొంటుంది.  వ్యక్తిగత పనుల విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోకండి. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు మంచి సమయం. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. పిల్లల పట్ల మీకు శ్రద్ద, ప్రేమ పెరుగుతాయి. 

ధనుస్సు రాశి

ప్రయాణంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలకు లోనుకావొద్దు. కొన్ని విషయాల్లో తెలివిగా వ్యవహరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. చర్చల్లో మాటను అదుపు లో ఉంచుకోండి.  వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త .ప్రియమైన స్నేహితులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.  

మకర రాశి

ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు అందుతాయి. అదృష్టం మీ వెంటే ఉటుంది. మీ పురోగతిని చూసి కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మీ పెద్దల మాటలు శ్రద్ధగా వినండి. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలొస్తాయి.

కుంభ రాశి

కుటుంబ సభ్యులతో ఏకాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగస్తులు ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆందోళన చెందుతారు. వ్యాపారుల నూతన పెట్టుబడికి అనుకూలమైన సమయం. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. ఇంట్లో క్రమశిక్షణ పాటించేందుకు ప్రయత్నిస్తారు.

మీన రాశి

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  మీరు చేసే పనులు వలన  ప్రశంసలు లభిస్తాయి . ఎప్పుడో పోగొట్టుకున్న వస్తువులు ఇప్పుడు దొరికే అవకాశం ఉంది.  ఆఫీసులో పని ఒత్తిడి  కారణంగా మీరు ఎక్కువ  అలసిపోతారు

Published at : 05 Jun 2023 04:16 AM (IST) Tags: Astrology Horoscope Today Aaj Ka Rashifal Check Astrological prediction Scorpio daily Horoscope Aries daily Horoscope Gemini daily Horoscope horoscope June 5th 2023

ఇవి కూడా చూడండి

Vastu Tips In Telugu: ఇంట్లో డబ్బు ఉంచేటప్పుడు ఈ త‌ప్పులు చేస్తే వాస్తు దోషాలు త‌ప్ప‌వు!

Vastu Tips In Telugu: ఇంట్లో డబ్బు ఉంచేటప్పుడు ఈ త‌ప్పులు చేస్తే వాస్తు దోషాలు త‌ప్ప‌వు!

Stories Behind the Bathukamma: ప్రకృతి పండుగ బతుకమ్మ ఎలా ప్రారంభమైంది, ప్రచారంలో ఉన్న కథలేంటి!

Stories Behind the Bathukamma: ప్రకృతి పండుగ బతుకమ్మ ఎలా ప్రారంభమైంది, ప్రచారంలో ఉన్న కథలేంటి!

Mahalaya Pitru Paksha 2023:ఈ 15 రోజులు ఈ 4 జంతువులు, పక్షులకు ఆహారం అందిస్తే మీ వంశం వృద్ధి చెందుతుంది!

Mahalaya Pitru Paksha 2023:ఈ 15 రోజులు ఈ 4 జంతువులు, పక్షులకు ఆహారం అందిస్తే  మీ వంశం వృద్ధి చెందుతుంది!

Ancestors In Dream: పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే అది దేనికి సంకేతం!

Ancestors In Dream:  పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే  అది దేనికి సంకేతం!

Dussehra 2023: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!

Dussehra 2023: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!

టాప్ స్టోరీస్

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన  రౌస్ అవెన్యూ కోర్ట్ !

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌