సెప్టెంబరు 6 రాశిఫలాలు, ఈ రాశులవారి ఈ రోజు ఓ గుడ్ న్యూస్ వింటారు
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 06 September 2023
మేష రాశి
ఈ రాశివారు ఈ రోజు భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు పెళ్లి దిశగా తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతారు. వ్యాపారం బాగానేసాగుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభప్రదం. ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. వ్యాపారంలో అధిక ధనలాభం పొందే అవకాశం ఉంది. మీ ఉదార స్వభావానికి అందరూ ఆకర్షితులవుతారు. ఆర్థిక విషయాల్లో కొంత సమస్య రావొచ్చు. కుటుంబంతో కలసి ధార్మిక ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది.
మిథున రాశి
ఈ రాశి ఉద్యోగుల పురోభివృద్ధికి అవకాశం ఉంది. ఓ గుడ్ న్యూస్ వింటారు. పాత అప్పులు తిరిగి చెల్లించగలుగుతారు. జీవిత భాగస్వామికి సన్నిహితుల నుంచి బహుమతి అందుకుంటారు. స్నేహితుల నుంచి ఉత్తమ సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
Also Read: మీ బంధుమిత్రులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
కర్కాటక రాశి
ఈ రాశివారు పని విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. ప్రజలు మీ స్వభావాన్ని విమర్శించవచ్చు. కాబట్టి ప్రవర్తనలో సమతుల్యతను కాపాడుకోండి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. గృహ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి
ఈరోజు మీ ప్రవర్తన అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సంతో సమయాన్ని గడుపుతారు. కొత్త పరిచయాల నుంచి ఆర్థికంగా లాభపడతారు.
Also Read: కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుడి అడుగులు ఎందుకు వేయాలి, ఎలా వేయాలి!
కన్యా రాశి
ఈ రాశివారికి పని ఒత్తిడి పెరుగుతుంది. అదనపు గంటలు పనిచేయాల్సి రావొచ్చు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు శుభప్రదం. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. వైద్య విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటారు.
తులా రాశి
ఈ రాశివారు కుటుంబానికి సమయం ఇవ్వలేరు. మీ సహచరులతో అనవసర పోటీకి దిగొద్దు. ఉన్నతాధికారుల కారణంగా ఈ రాశి ఉద్యోగుల పని దెబ్బతిట్టుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. మీరు కుటుంబ సభ్యుల ప్రవర్తనతో కొంత కలత చెందుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఎక్కువగా నమ్మొద్దు. మీ పనివిధానాన్ని మార్చుకుంటారు. స్పైసీ ఆహారానికి దూరంగా ఉండాలి. మీ అభిప్రాయాలతో ఎవ్వరూ ఏకీభవించరు.
ధనుస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త వ్యక్తులను అతిగా నమ్మొద్దు. కుటుంబ సభ్యులకు సంబంధించిన పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
మకర రాశి
ఉద్యోగులు తమ టార్గెట్లను చేరుకోవడంలో సక్సెస్ అవుతారు కానీ సహోద్యోగులతో సమన్వయ లోపం ఉండొచ్యు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు!
కుంభ రాశి
ఈ రాశివారి మాటలను ఎదుటి వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకుంటారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మీ అభిప్రాయలను బయటకు చెప్పండి. ప్రేమ వివాహాలపై చర్చ జరుగుతుంది. ఆధ్యాత్మిక గ్రంధాల అధ్యయనం వైపు ఆకర్షితులవుతారు. పిల్లలకు సమయం కేటాయిస్తారు. విద్యార్థులు కొత్త కోర్సులలో ప్రవేశిస్తారు.
మీన రాశి
ఈరోజు మీరు కొంత ఆందోళనగా ఉంటారు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయకండి. మనసులో నిరుత్సాహకరమైన ఆలోచనలు ఉండొచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కార్యాలయంలో కొత్త స్నేహితులు ఏర్పడతారు. కొన్ని విషయాల్లో టెన్షన్ పెరుగుతుంది.