అన్వేషించండి

Horoscope Today February 21, 2024: ఈ రాశులవారు కార్యాలయ ఒత్తిడిని ఇంటికి మోసుకురావొద్దు - ఫిబ్రవరి 21 రాశిఫలాలు

Horoscope 21 February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today - Astrological prediction for February 21, 2024

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీ వ్యాపార స్థితి బలపడుతుంది. ప్రారంభించిన పనిలో సక్సెస్ అవుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిరోజు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తారు. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు లక్ష్య సాధనపై దృష్టి సారించాలి. మీ కృషి అంకితభావంతో విజయం సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజు ఊహించని ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. 

మిథున రాశి (Gemini Horoscope Today) 

మిథున రాశివారికి ఈ రోజు  సంతోషకరమైన రోజు. మీరు పనిలో విజయం పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు పొందుతారు. మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. మీ లక్ష్యసాధన దిశగా అడుగేయండి. వ్యాపారులు భారీ లావాదేవీలు జరిపేందుకు ఈ రోజు మంచిది కాదు.

Also Read: అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం - భక్తజన వనసంబురం మేడారం గురించి ఈ విషయాలు తెలుసా!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీకు కొంత సవాలుగా ఉండవచ్చు. మీరు మీ ఆలోచనలు, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది లేదంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. కార్యాలయంలో  పనులను కష్టపడి  అంకితభావంతో నిర్వహించండి. దీనివల్ల ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి. కుటుంబం, ప్రియమైన వారితో గడిపేందుకు సమయం కేటాయించండి.  అనవసర చర్చలకు దూరంగా ఉండండి. ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి. 

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీకు విజయవంతమైన రోజు. మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రణాళికలు వేసుకునే సమయం.మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.  కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు మీకు సాధారణమైన రోజు కావచ్చు.  వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. ఆరోగ్యం జాగ్రత్త. ఈ రోజు చేపట్టే పనుల్లో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఒంటరి వ్యక్తులు ఈరోజు ప్రత్యేకంగా ఎవరినైనా కలవవచ్చు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాలి. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు.  

Also Read: ఈ ఏకాదశి నుంచి ఈ 5 రాశులవారికి అదృష్టం మొదలవుతుంది

తులా రాశి (Libra Horoscope Today) 

తులారాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాయామం చేయడంపై దృష్టి సారించాలి.  వ్యాపార విషయాలలో జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేముందు ఆలోచించాలి. ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి..ఈరోజు పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలను నిర్వహించవద్దు. ఆఫీసు ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

వృశ్చిక రాశి వారు ఈ రోజు  వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలి. మీ సంబంధాలను బలోపేతం చేయడానికి మీరు సమయాన్ని వెచ్చించాలి. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి . కొత్త బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండండి. విద్యా పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.  ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ధనుస్సు రాశి వారు ఈ రోజు వారు చేయాల్సిన పనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. కష్టపడితేనే మంచి ఫలితం సాధిస్తారు.మీ లక్ష్యాలను సాధించడానికి మీరు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి.   మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  వివాహ నిశ్చయానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Also Read: నిరాడంబరంగా ఉండే సమ్మక్క సారలమ్మ ల గద్దెలు కాలక్రమేణా ఇలా మారాయ్!

మకర రాశి (Capricorn Horoscope Today) 
 
 మకరరాశి వారు ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.   నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది  కానీ అధిక ఖర్చులు నియంత్రించాలి. డబ్బు విషయంలో సోదరుడు లేదా సోదరితో విభేదాలు ఉండవచ్చు. అప్పులు చెల్లించగలుగుతారు. కుటుంబం , స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. పెట్టుబడులు కలిసొస్తాయి.  

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

కుంభ రాశి వారు ఈ రోజు వారి వ్యాపార విషయాలపై దృష్టి పెట్టాలి.  కొత్త ప్రణాళికలను అమలు చేసేందుకు కాస్త సమయం తీసుకోండి.  ఆర్థిక స్థిరత్వం పొందుతారు. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నించండి.

మీన రాశి (Pisces Horoscope Today) 

మీన రాశి వారు ఈ రోజు వారి సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సమయం ఇవ్వాలి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది.  కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాలలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kurnool Drone City: కర్నూలు డ్రోన్ హబ్: దేశ భవిష్యత్తును మార్చే 40,000 ఉద్యోగాలు!
2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్ గా భారత్ ను నిలిపే కర్నూలు డ్రోన్ సిటీ
IRCTC Website Crashes: దీపావళి ఎఫెక్ట్.. IRCTC వెబ్‌సైట్, యాప్ క్రాష్.. నిలిచిపోయిన రైలు టిక్కెట్ల బుకింగ్స్
దీపావళి ఎఫెక్ట్.. IRCTC వెబ్‌సైట్, యాప్ క్రాష్.. నిలిచిపోయిన రైలు టిక్కెట్ల బుకింగ్స్
Visakhapatnam News: విశాఖలో రహేజా పెట్టుబడులు, ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న నిర్మాణ సంస్థ
విశాఖలో రహేజా పెట్టుబడులు, ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న నిర్మాణ సంస్థ
Young India Residential schools: తెలంగాణలో రూ.15,600 కోట్లతో 78 యంగ్‌ ఇండియా గురుకులాలు- కేబినెట్ ఆమోదం
తెలంగాణలో రూ.15,600 కోట్లతో 78 యంగ్‌ ఇండియా గురుకులాలు- కేబినెట్ ఆమోదం
Advertisement

వీడియోలు

Virat Kohli Tweet | India vs Australia | విరాట్ కోహ్లీ సంచలన ట్వీట్
India vs Australia ODI | Virat Records | ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ సచిన్‌ను అధిగమిస్తాడా ?
Priyank Kharge vs Nara Lokesh on Google | పెట్టుబడులపై పెద్దయుద్ధం..వైజాగ్ vs బెంగుళూరు | ABP Desam
Haryana IPS officer Puran Kumar Mystery | ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ కేసులో ట్విస్ట్ | ABP Desam
కాంట్రాక్ట్‌పై సైన్ చేయని కోహ్లీ.. ఆర్సీబీని వదిలేస్తున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Drone City: కర్నూలు డ్రోన్ హబ్: దేశ భవిష్యత్తును మార్చే 40,000 ఉద్యోగాలు!
2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్ గా భారత్ ను నిలిపే కర్నూలు డ్రోన్ సిటీ
IRCTC Website Crashes: దీపావళి ఎఫెక్ట్.. IRCTC వెబ్‌సైట్, యాప్ క్రాష్.. నిలిచిపోయిన రైలు టిక్కెట్ల బుకింగ్స్
దీపావళి ఎఫెక్ట్.. IRCTC వెబ్‌సైట్, యాప్ క్రాష్.. నిలిచిపోయిన రైలు టిక్కెట్ల బుకింగ్స్
Visakhapatnam News: విశాఖలో రహేజా పెట్టుబడులు, ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న నిర్మాణ సంస్థ
విశాఖలో రహేజా పెట్టుబడులు, ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న నిర్మాణ సంస్థ
Young India Residential schools: తెలంగాణలో రూ.15,600 కోట్లతో 78 యంగ్‌ ఇండియా గురుకులాలు- కేబినెట్ ఆమోదం
తెలంగాణలో రూ.15,600 కోట్లతో 78 యంగ్‌ ఇండియా గురుకులాలు- కేబినెట్ ఆమోదం
Telusu Kada Twitter Review - తెలుసు కదా ట్విట్టర్ రివ్యూ: ఊహించుకుంటేనే భయంగా ఉంది... సోషల్ మీడియాలో స్టార్ బాయ్ సిద్ధూ సినిమా టాకేంటి?
తెలుసు కదా ట్విట్టర్ రివ్యూ: ఊహించుకుంటేనే భయంగా ఉంది... సోషల్ మీడియాలో స్టార్ బాయ్ సిద్ధూ సినిమా టాకేంటి?
FUNKY Release Date: విశ్వక్ సేన్ 'ఫంకీ' Vs రోషన్ 'ఛాంపియన్' - అడివి శేష్ 'డెకాయిట్' పరిస్థితి ఏంటి?
విశ్వక్ సేన్ 'ఫంకీ' Vs రోషన్ 'ఛాంపియన్' - అడివి శేష్ 'డెకాయిట్' పరిస్థితి ఏంటి?
Viral News: భార్యపై కోపం అత్తారింటికి నిప్పు పెట్టిన భర్త... ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
భార్యపై కోపం అత్తారింటికి నిప్పు పెట్టిన భర్త... ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
New Hyundai Venue 2025 or Creta: న్యూ హ్యూందాయ్‌ వెన్యూ లేదా క్రెటా? ఫీచర్లలో ఏది బెస్ట్‌ SUV? లాంచింగ్ కంటే ముందు ప్రతిదీ తెలుసుకోండి!
న్యూ హ్యూందాయ్‌ వెన్యూ లేదా క్రెటా? ఫీచర్లలో ఏది బెస్ట్‌ SUV? లాంచింగ్ కంటే ముందు ప్రతిదీ తెలుసుకోండి!
Embed widget