Horoscope Today: ఈ నాలుగు రాశుల వారు ప్రయోజనం పొందుతారు, వారి ఒత్తిడి దూరమవుతుంది..ఏ రాశుల వారికి ఎలా ఉందంటే..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
ఆర్థిక పురోగతి కోసం ఓ ప్రణాళిక రూపొందిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇంటి పెద్దల ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది.
వృషభం
మీ ప్రవర్తనను అందరూ అభినందిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితులను కలుస్తారు. కార్యాలయంలో కొత్త అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కలిసొచ్చే సమయం. వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుంది. అనవసర ప్రసంగాలు వద్దు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఈ రోజు బంధువుల నుంచి ఓ దుర్వార్త వినే అవకాశం ఉంది.
మిథునం
మీరు శుభవార్త వింటారు. కొన్ని విషయాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఈ రోజు దూర ప్రయాణాలు చేయవద్దు. పాత స్నేహితులను కలుస్తారు. పెద్దలతో మాట్లాడిన తర్వాత మీకు మనశ్శాంతి లభిస్తుంది. దేవుడిని ఆరాధిస్తారు. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.
కర్కాటకం
ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉంటుంది. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. బంధువులను కలుస్తారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. ఆఫీసులో ఎవరితోనైనా మనస్పర్థలు రావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒత్తిడి తీసుకోకండి.
సింహం
కొత్తగా చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు శుభసమయం. ఉద్యోగులు.. సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులను కలుస్తారు.
కన్య
పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. వివాదాల్లో తలదూర్చొద్దు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి నడకకు వెళ్లవచ్చు.
తుల
పెట్టిన పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారం మందగించే అవకాశాలు ఉన్నాయి. పిల్లల వైపు నుంచి శుభవార్త అందుకునే సంకేతాలున్నాయి. యువతకు మంచి రోజు . విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మాట్లాడేటప్పుడు ఆలోచించండి. వివాదాలకు దూరంగా ఉండండి. అవసరమైన సమాచారాన్ని పొందుతారు.
వృశ్చికం
ఈ రోజు మీకు మంచి రోజు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఓ పనిపై ప్రయాణం చేయాల్సిరావొచ్చు. మీ ప్రవర్తన ద్వారా ప్రశంసలు అందుకుంటారు. సామాజిక జీవితం బలంగా ఉంటుంది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొత్త ఆదాయ అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయవచ్చు.
ధనుస్సు
ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. పోటీ పరీక్షలు రాసిన వారు అనుకూల ఫలితాలు పొందుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
మకరం
కార్యాలయంలో కొత్త సమాచారం అందుతుంది. కొత్త పథకాన్ని ప్రారంభించే ముందు, అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలను తీసుకోండి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. బాధ్యత నెరవేర్చలేనప్పుడు నిరుత్సాహపడకండి.
కుంభం
సామాజిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. కొత్త పనులు ప్రారంభించవద్దు. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి. వ్యసనాల జోలికి పోవద్దు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు పొందుతారు. వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ఆలోచనలు వస్తాయి. దైవభక్తి పెరుగుతుంద. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి..ప్రమాద సూచనలున్నాయి. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీనం
నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం, ఉద్యోగస్తులకు మరో ఆఫర్ పొందే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వివాదం జరగొచ్చు. పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. విద్యార్థులకు అనూకల సమయం. స్నేహితులను కలుస్తారు. ఒత్తిడి దూరమవుతుంది.
Also Read:విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి