Horoscope Today:ఈ రోజు ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, వీళ్లు మాత్రం మాటలు అదుపులో ఉంచుకోవాలి...ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం...
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 సెప్టెంబరు 27 సోమవారం రాశిఫలాలు
మేషం: మీ కుటుంబంలో మతపరమైన కార్యక్రమం జరగొచ్చు. ఎవరితోనూ వివాదం వద్దు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబంతో సమయాన్ని గడపడం శుభ ఫలితాలను ఇస్తుంది. లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండండి. అదృష్టం కలిసొస్తుంది. శుభవార్త వింటారు.
వృషభం: కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహించగలుగుతారు. సుదీర్ఘకాలం తర్వాత పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కలిసే అవకాశం మీకు లభిస్తుంది. యువత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. ఆఫీసులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావొచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
మిధునం: జీవిత భాగస్వామికి ఆరోగ్యం సమస్యలుంటాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ మనస్సు తప్పుడు చర్యల వైపు తిరుగుతుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. చేపట్టిన పని పూర్తిచేయలేరు. ప్రయాణాన్ని వాయిదా వేయండి. విద్యార్థులు విజయం సాధిస్తారు. శత్రువులు మీకు హాని కలిగించవచ్చు. టెన్షన్ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మాటలు తగ్గించండి.
కర్కాటకం: మతపరమైన పనుల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారస్తులకు శుభసమయం. ప్రస్తుతానికి పెట్టుబడి వాయిదా వేయండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బాధలు తొలగిపోతాయి. యువత తమ కెరీర్‌లో ముందుకు సాగడానికి అవకాశాలు వస్తాయి. చట్టపరమైన అడ్డంకి తొలగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
సింహం: మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. చట్టపరమైన విషయాలు ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంటాయి. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శరీర నొప్పితో బాధపడే అవకాశం ఉంది. కొత్త ఖర్చుల కారణంగా మీ బడ్జెట్ కాస్త అటుఇటగా మారుతుంది. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. వ్యాపారం బాగా జరుగుతుంది. ఒత్తిడి తీసుకోకుండా ఉండండి.
కన్య: ఇంట్లో ఉన్న ఒక వృద్ధుడి ఆరోగ్యంపై జాగ్రత్త. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. యువత ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది, మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. తెలియని వ్యక్తి మాటల మాయలో చిక్కుకోకండి. ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త.
తుల: శుభవార్త వింటారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు వేయొచ్చు. సామాజిక సేవలో పాల్గొంటారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. కార్యాలయ వాతావరణం బాగుంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతుంది. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. భార్యాభర్తల మధ్య సామరస్యం ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. లావాదేవీ పత్రాలను జాగ్రత్తగా చదవి సంతకం చేయండి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఉండొచ్చు.
వృశ్చికం: కొత్త ఉద్యోగంలో చేరే విషయంపై ఈరోజు ఆలోచించడం మంచింది. వృద్ధుల ఆరోగ్యం క్షీణిస్తుంది. యువతకు కెరీర్ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. అప్పిచ్చిన మొత్తం చేతికందే పరిస్థితులు కనిపించడం లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి శుభవార్త ఉంటుంది.
ధనుస్సు: సామాజిక బాధ్యత పెరుగుతుంది. మాటని అదుపులో ఉంచుకోకుంటే వివాదాలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయండి. ఈ రోజు తొందరగా అలసిపోతారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. యువత వృత్తికి సంబంధించి చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అందరి ముందు ప్రైవేట్ చర్చ చేయవద్దు. వ్యాపారం బాగా జరుగుతుంది. భూమి లేదా బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు శుభసమయం.
మకరం: ఆకస్మిక సమస్యలకు భయపడవద్దు. బంధువులను కలుస్తారు. చాలా పనుల్లో విజయం సాధిస్తారు. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వేసుకున్న ప్రణాళికలు ప్రారంభించేందుకు మంచిరోజిది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. యువత విజయం సాధిస్తుంది. కుటుంబ పెద్దలు ఆశీస్సులు పొందుతారు. మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టం కలిసొస్తుంది.
కుంభం: ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. మనస్సులో ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. ఏ పని విషయంలోనూ అలసత్వం వహించవద్దు. ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు వెతుక్కోండి. స్నేహితుల నుంచి అన్ని రకాల సహాయం పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది.
మీనం: శత్రువుల నుంచి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడిలు పెద్దగా కలసిరావు. మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేసే వ్యక్తిని మీరు కలిసే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ సమయంలో, మీ మరియు ఏ కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో క్షీణత ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
Also read: నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్.. భారత్ బంద్ వేళ కీలక నిర్ణయం
Also Read: తీరాన్ని తాకిన గులాబ్ తుపాను... భారీగా ఈదురుగాలులు
Also Read: రిలీజ్ డేట్ పై 'కేజీఎఫ్' టీమ్ మరోసారి క్లారిటీ.. పక్కకు తప్పుకున్న ఆమిర్ ఖాన్..