అన్వేషించండి

Horoscope Today : ఈ రాశుల వారు అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి... ఆ రాశుల ఉద్యోగులు శుభవార్తలు వింటారు

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

2021 సెప్టెంబరు 14 మంగళవారం రాశిఫలాలు

మేషం

ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. అనవసర చర్చలు వద్దు. ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. అప్పిచ్చిన మొత్తం వసూలు చేసుకోవడం చాలా కష్టం. కొత్తగా పెట్టుబడులు పెట్టొద్దు.

వృషభం

ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. అపరిచితులను నమ్మవద్దు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చేపట్టిన పనుల్లో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సూచనలున్నాయి. తండ్రికి సంబంధించిన విషయాల్లో వివాదం పెరిగే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కోపాన్ని నియంత్రించుకోండి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి.

మిథునం

ఈ రోజు అద్భుతమైన రోజు అవుతుంది. అవసరమైన వారికి సహాయం చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులను కలుస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూల సమయం. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.

కర్కాటక రాశి

గౌరవం పెరుగుతుంది. పనికి తగిన ప్రతిఫలం అందుకుంటారు.  స్నేహితులతో సమయం గడుపుతారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పెద్దగా పరిచయం లేని వ్యక్తి మాటలను నమ్మవద్దు. మీరు వాహనం లేదా భూమిని కొనుగోలు చేయవచ్చు. కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం

ఈరోజంతా చికాకుగా ఉంటారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. స్నేహితుడితో వివాదం కారణంగా టెన్షన్‌లో ఉంటారు.  అనవసర మాటలు కట్టిపెట్టండి. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. అప్పులు చెల్లించగలుగుతారు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు తొందరపడకండి. వ్యాపారం బాగానే సాగుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్త ఉంటుంది.

కన్య

ఈరోజు మీకు బాగా కలిసొస్తుంది. చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలుస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో కొత్త అవకాశాలు ఉంటాయి. నగదు దుర్వినియోగానికి దూరంగా ఉండండి. రిస్క్ తీసుకోకండి. జీవిత భాగస్వామితో కొంత సమస్యకు సంబంధించి వాదనకు అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించండి. ఏ వివాదంలోనూ తలదూర్చకండి.

తులారాశి

అప్పులు తీరుస్తారు. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం క్షీణిస్తున్నందున, చికిత్సకు చాలా ఖర్చు కావచ్చు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. యువతకు కెరీర్ సంబంధిత సమాచారం తెలుసుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది.

వృశ్చికరాశి

మీ ప్రత్యర్థుల చర్యల వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలను  నిర్వర్తిస్తారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారం బాగా జరుగుతుంది. అందరితో ప్రశంసలు అందుకుంటారు. భావోద్వేగాలను నియంత్రించాలి.

ధనుస్సు

వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ఒక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు.

మకరం

ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా వివాదం కారణంగా బాధపడొచ్చు. పిల్లల వైపు నుంచి మంచి సమాచారం పొందే అవకాశం ఉంది. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు.

కుంభం

కొన్ని సందర్భాల్లో కార్యాలయంలో ఇబ్బందులు ఉండొచ్చు. సహోద్యోగులతో విభేదాల కారణంగా ఆందోళన చెందుతారు. వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించండి. కుటుంబ బాధ్యత పెరుగుతుంది. న్యాయపరమైన విషయాలు నెమ్మదిగా సాగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రణాళికను రూపొందించవచ్చు.

మీనం

ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో విభేదాలుంటాయి. మీ ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పని లాభాన్నిస్తుంది. రుణం ఇచ్చేటప్పుడు పూర్తి సమాచారాన్ని తీసుకోండి. వ్యాపారం ముందుకు సాగుతుంది. మాట మీద సంయమనం పాటించడం చాలా ముఖ్యం. సంఘర్షణను నివారించడానికి ప్రయత్నించండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget