Horoscope Today : ఈరాశి ప్రేమికులకు అనుకూలమైన రోజు…ఆ రాశుల వాళ్లు రిస్క్ తీసుకోకండి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
ఇంట్లో కన్నా బయట సంతోషంగా ఉంటారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి వేసిన ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. కార్యాలయంలో మార్పులు తక్షణ ప్రయోజనాలు ఇవ్వవు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.రిస్క్ తీసుకోవద్దు. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి.
వృషభం
ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందడానికి చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. పనిభారం పెరుగుతుంది. బాగా అలసిపోతారు. ప్రయామాలు, పెట్టుబడులకు అనుకూల సమయం. ఎన్నాళ్లనుంచో ఉన్న చింతలు తొలగిపోతాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి.
మిథునం
మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. బిజీగా ఉంటారు ఇతరులతో గొడవలు పడకండి. ఆరోగ్యం క్షీణించవచ్చు. పని సులభం అవుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆనందంగా ఉంటారు.
Also Read: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!
కర్కాటక రాశి
బహుమతులు అందుకుంటారు. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సామాజిక సేవలో పాల్గొంటారు. వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. అదృష్టం కలిసొస్తుంది. మీకు తోచిన పని చేయండి ఇతరులపై ఆధారపడొద్దు. ఆనందంగా ఉంటారు.
సింహం
ఈరోజు ఇంటికి బంధువులు రావచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోత్సాహకరమైన సమాచారాన్ని పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడం తప్పనిసరి. రాజకీయ అడ్డంకులు తొలగిపోవడం వల్ల లాభపడతారు. వ్యాపారం బాగానే సాగుతుంది. సంతోషంగా ఉంటారు.
కన్య
విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబంలో విభేదాలు పెరగవచ్చు. ఇతరుల భావాలకు విలువ ఇవ్వండి. అంచనాలు ఆలస్యం అవుతాయి. టెన్షన్ పెరుగుతుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. కార్యాలయంలో ఎవరితోనైనా విభేదాలు ఉండొచ్చు.
Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..
తులారాశి
కొంచెం శ్రమతో విజయం సాధిస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉపాధి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కలిసొచ్చే సమయం.గౌరవంతో పాటూ పనిభారం ఎక్కువగా ఉంటుంది. దుర్మార్గులు స్నేహపూర్వకంగా వ్యవహరించడంతో కాస్త ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారం బాగా జరుగుతుంది.
వృశ్చికరాశి
మొదలుపెట్టిన పని పూర్తవుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. సీనియర్ల మార్గదర్శకంతో లాభాలు పెరుగుతాయి. అలసట ఉంటుంది. బిజీగా ఉన్నామంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఇంటా బయటా ఆనందం ఉంటుంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
ధనుస్సు
నిరుద్యోగులకు శుభసమయం. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆస్తి ఒప్పందాలు జరగొచ్చు. వ్యాపారం బాగానే ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది. స్నేహితులు, బంధువులతో సయోధ్య ఉంటుంది. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి.
Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!
మకరం
ప్రయాణం విజయవంతంగా సాగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. తెలియని అడ్డంకులను అధిగమిస్తారు. సీనియర్లు సహకరిస్తారు. ఉద్యోగంలో అంతా కలిసొచ్చే కాలమే. సోమరితనం పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి సంతోషం, సహకారం ఉంటుంది. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.
కుంభం
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. బాధ్యత పెరుగుతుంది. వాహనాలు, యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించండి. పనిలో జాప్యం జరుగుతుంది. అనవసర స్పీచ్ లు ఇవ్వొద్దు. వివాదాస్పద పరిస్థితులకు దూరంగా ఉండండి. వ్యాపారం బాగానే ఉంటుంది. పాత వ్యాధులు మళ్లీ బాధపెట్టొచ్చు.
మీనం
దర్శనం కోసం మతపరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించవచ్చు. ఆదాయ వనరులు పెరుగుతాయి. బాగా అలసట చెందుతారు. వ్యాపారం బాగానే ఉంటుంది. ఇంటా బయటా ఆనందం ఉంటుంది. ఆశించిన పని పూర్తవుతుంది.
Also Read:భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్
Also Read:పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?
Also Read:సినిమాకే కాదు ఓటీటీకి కూడా సేమ్ ఫార్ములా అంటున్న విక్టరీ వెంకటేష్
Also Read: నాలుగేళ్ల తర్వాత మళ్లీ హాలీవుడ్‌లోకి దీపిక..ఈసారి హీరోయిన్‌గా మాత్రమే కాదండోయ్..