Horoscope Today 17th March 2022: ఈ రాశివారు శత్రువుల బలహీనత నుంచి ప్రయోజనం పొందుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
మార్చి 17 గురువారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు సమయం పడుతుంది. వైవాహిక జీవితం చాలా శృంగారభరితంగా సాగుతుంది. అధికారులు మీ మాటలు, సలహాలు వింటారు. సామాజిక రంగంలో మీకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమికులకు మంచిరోజు.
వృషభం
మీ రోజు సాధారణంగా ఉంటుంది. వేరేవారి మాటల్లోకి తలదూర్చడం వల్ల మీకు హాని జరుగుతుంది. ఎదుటివారు చెప్పే మాటలకు ప్రభావితం కావొద్దు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు కొత్త పథకాలలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.
మిథునం
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కష్టానికి తగిన ఫలితం సాధిస్తారు. బాధల నుంచి ఉపశమనం పొందుతారు. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. ప్రేమికులకు మంచి సమయం దొరుకుతుంది.
కర్కాటకం
ఈ రోజు మీరు ఒక పెద్ద బాధ్యతను పూర్తి చేయగలుగుతారు. తొందరగా అలసిపోతారు. ఈరోజు ఎక్కువ పని ఉంటుంది. మీ దినచర్యను మెరుగుపరచుకోవాలి. కార్యాలయంలో క్రమశిక్షణతో ఉండండి. ఒకరిని ఎగతాళి చేయడం మానుకోండి. ప్రేమ జంట మధ్య మనస్పర్థలు ఏర్పడవచ్చు.
Also Read: ఒక్కరాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం, అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు
సింహం
వ్యాపారంలో లాభాలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షలో ప్రతిభ కనబరుస్తారు. మీ ఆలోచనలను మార్చుకోండి. మీ జీవనశైలిని మెరుగుపరుచుకోండి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. కార్యాలయంలో వ్యతిరేకులు చురుకుగా ఉంటారు. మీరు మీ ప్రతిష్ట గురించి ఆందోళన చెందుతారు. స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది.
కన్య
కొత్త ఉద్యోగం కోసం వెతికేవారికి శుభసమయం. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులకు చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమికులు తమ భాగస్వామిపై కోపాన్ని ప్రదర్శించకూడదు. ప్రయాణంలో మీకు తెలియని వ్యక్తుల నుంచి సహాయం పొందుతారు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి.
తుల
ఏ పెద్ద సమస్య వచ్చినా తొలగిపోయి మనసు ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. సామాజిక స్థితి బలంగా ఉండే అవకాశం ఉంది. మీరు కొత్త పని కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీ స్నేహితులతో కలిసి షికారు వెళ్తారు.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు మంచి సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమికులు ఒకరి సాంగత్యాన్ని ఇష్టపడతారు. కలిసి పనిచేసే వారితో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు.
Also Read:పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే
ధనుస్సు
ఈరోజు మీ ప్రత్యర్థులు మీ బలహీనతని సద్వినియోగం చేసుకుంటారు. ఇతర దేశాల్లో నివసించే వారికి మంచి రోజు. కోపంతో ఒకరిపై నోరు పారేసుకోవద్దు. ఆఫీసులో సహోద్యోగితో గొడవలు పడే అవకాశం ఉంది. దైవారాధనపై శ్రద్ధ పెరుగుతుంది. ప్రేమ జీవితంలో టెన్షన్ ఉంటుంది.
మకరం
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది. ఇంటికి వచ్చిన బంధువుల మాటల వల్ల బాధపడతారు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉంటాయి. మీరు కడుపు నొప్పితో బాధపడతారు. షుగర్ పేషెంట్ల ఆహారాన్ని నియంత్రించండి. అవసరం అయినవారికి సహాయం చేయండి.
కుంభం
రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు లాభపడతారు. వ్యాపారంలో పెద్ద ఆఫర్లు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఈరోజంతా సానుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఖర్చులు నియంత్రించండి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
మీనం
మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు. పనికిరాని పనులకోసం సమయాన్ని వృథా చేసుకోకండి. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరగొచ్చు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.