Horoscope Today 14th March 2022: ఈ రోజు మీ జీవితం అందమైన మలుపు తిరుగుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

మార్చి 14 సోమవారం రాశిఫలాలు

మేషం
మీకు శుభసమయం నడుస్తోంది. పొదుపు చేయండి. భవిష్యత్తులో మీరు ఎదురయ్యే సమస్యలకి స్నేహితల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగులకు మంచి రోజు. శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. 

వృషభం
ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ సంతోషం పెరుగుతుంది. డబ్బు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీరు తలపెట్టిన పనులు పూర్తిస్థాయిలో చేయలేరు. కార్యాలయంలో సిబ్బంది నుంచి సహకారం అందుతుంది. జీవిత భాగస్వామితో  వివాదాలుంటాయి జాగ్రత్త.

మిథునం
మీరు ఈ రోజు రిలాక్సవుతారు. వ్యాపారులకు అధ్భుతమైన లాభాలుంటాయి. వ్యాపారాన్నిమరింత విస్తరిస్తారు. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా ఉండే సమయం. మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగుతుంది. పనిలో మునిగిపోతే మీ కోపావేశాలు, టెంపర్లు, పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు,ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

కర్కాటకం
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ స్నేహితులు మీకు సపోర్ట్ గా ఉంటారు.  జాగ్రత్తగా మాట్లాడండి.  వినోదయాత్రకు వెళ్ళే అవకాశముంది. ఉద్యోగం మారాలనుకున్న వారికి ఇదే మంచి సమయం. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. చాలా బిజీగా ఉంటారు.  విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. 

సింహం
మీలో సృజనాత్మకతకు మంచి రోజు. మీ టాలెంట్ ని సరిగ్గా వాడుకుంటే చాలా సక్సెస్ అవుతారు. వినోదయాత్రకు వెళ్ళే అవకాశముంది. మీ జీవిక భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఏదైనా పాత సమస్యలుంటే ఈ రోజు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు, విద్యార్థులకు శుభసమం. మీ వైవాహిక జీవితం బావుంటుంది. 

కన్య
వ్యాపారులు జాగ్రత్తగా ఉండకపోతే నష్టాలు ఎదుర్కోక తప్పదు. అడుగువేసేముందు ఆచితూచి వ్యవహరించాలి. అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజిది. తొలి చూపులోనే ప్రేమలో పడతారు. సహోద్యోగులతో మంచి సఖ్యత ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.

తులా
ఒక స్నేహితుల ప్రవర్తన వల్ల  ఇబ్బంది పడతారు. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుంచి సహాయం పొందుతారు. దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఈ రోజంతా ఆహ్లాదంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు. 

వృశ్చికం
ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం. ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో రిలాక్స్ అవుతారు. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

ధనస్సు
గత వెంచర్ల నుంచి వచ్చిన విజయం మీకు మీపట్ల నమ్మకాన్ని పెంచుతుంది. చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్నవారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత ఉంటుంది. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి ఓర్పుగా ఉండండి.  ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల మిత్రులుగా మారనున్నారు. 

మకరం
అనారోగ్య సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఇంటర్యూకి వెళ్లేందుకు మంచిరోజు. మీరు తలపెట్టిన పనులన్నింటికీ మీ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. 

కుంభం
మీరు గతంలోని సంఘటనలను తల్చుకుంటారు. అనారోగ్యం కారణంగా ఇబ్బందిపడతారు. ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. మీరు ఇచ్చిన వాగ్ధానాలు నిలుపుకోలేరు. మీ ప్రియమైన వారికి కోపం తెప్పించే పనులు చేయొద్దు. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సరైన సమయం కాదు. 

మీనం
మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. మీ విజయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. జీవిత భాగస్వామితో గొడవ పడొద్దు. 

Published at : 14 Mar 2022 05:59 AM (IST) Tags: Horoscope Today Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 14th March 2022

సంబంధిత కథనాలు

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Russia Ukraine War :  ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !

Complaint On Avanti Srinivas :