ఏప్రిల్ 7 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఇంట్లో తలనొప్పులు పెరుగుతాయి, ఆ రాశులవారికి లక్ష్మీ కటాక్షం
Rasi Phalalu Today 7th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
ఏప్రిల్ 7 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారు బరువైన వస్తువులను ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలిక అనారోగ్యం అడ్డంకిని కలిగిస్తుంది. మాటతీరు మార్చుకోండి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. వ్యాపార భాగస్వాములతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులలో లాభం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు
వృషభ రాశి
కుటుంబ సభ్యుల ఆందోళన అలాగే ఉంటుంది. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. నిలిచిపోయిన పనుల్లో వేగం ఉంటుంది.
మిధున రాశి
మీకు శత్రువులు పెరుగుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. శాశ్వత ఆస్తిని కొనడానికి, విక్రయించడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోడం మంచిది. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. సోదరుల నుంచి సహకారం లభిస్తుంది. ఆనందం ఉంటుంది. పొదుపులో పెరుగుదల ఉంటుంది.
Also Read: వృషభ రాశిలో ప్రవేశించిన శుక్రుడు, ఈ 6 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
కర్కాటక రాశి
ఈ రాశి వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఏవైనా ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీరు రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శత్రువులు ఓడిపోతారు. వివాదాలను ప్రోత్సహించవద్దు. ఏదో ఒక విషయంలో భయం ఉండవచ్చు.
సింహ రాశి
ఈ రాశివారికి ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. ఆందోళన, టెన్షన్ అలాగే ఉంటాయి. ముఖ్యమైన పనుల కోసం పరుగులు తీయాల్సి ఉంటుంది. బంధువు నుండి చెడు వార్తలు అందుతాయి. వివాదాలను ప్రోత్సహించవద్దు.చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఇతరుల నుంచి ఏమీ ఆశించవద్దు. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. చెడు సాంగత్యము వల్ల నష్టపోతారు.
Also Read: ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!
కన్య రాశి
మీరు గతంలో పడిన కష్టానికి తగిన ప్రయోజనం పొందడం ప్రారంభిస్తారు. స్నేహితులకు సహాయం చేస్తారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. ఉద్యోగంలో సంతోషంగా ఉంటారు. కొన్ని పెద్ద పనులు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సోదరుల మద్దతు లభిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈరోజు మంచి రోజు అవుతుంది.
తులా రాశి
ఈరోజు శుభవార్త అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రిస్క్ తీసుకునే ధైర్యం చేయగలరు. సంతోష సాధనాలు సమకూరుతాయి. ఇంటికి బంధువుల రాక ఉంటుంది. కుటుంబ ఈవెంట్ కోసం ఖర్చు చేస్తారు. పెట్టుబడులు కలిసొస్తాయి. వ్యాపారం చక్కగా సాగుతుంది. ఆనందం ఉంటుంది. ప్రత్యర్థులు ఓడిపోతారు.
వృశ్చిక రాశి
శారీరక నొప్పితో బాధపడతారు. వ్యాపారంలో ఊహించని లాభం వస్తుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. భాగస్వాముల మద్దతు లభిస్తుంది. లావాదేవీల విషయంలో తొందరపడకండి. అతిగా ఏ విషయాన్ని ఆలోచించవద్దు.
ధనుస్సు రాశి
ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. తొందరపాటు వల్ల నష్టపోతారు. అనుకోని ఖర్చులుంటాయి. పాత వ్యాధి తిరిగబెట్టొచ్చు జాగ్రత్త. అనవసరంగా మాట్లాడొద్దు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి. తలపెట్టిన పనులు ఆలస్యం అవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది.
మకర రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే భయం ఉంటుంది. తొందరపాటు... పనిని పాడు చేస్తుంది. బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార యాత్ర విజయవంతమవుతుంది. ఒకరి ప్రవర్తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. లాభదాయకమైన అవకాశాలు చేతికి అందుతాయి. అనుకూలత ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది.
కుంభ రాశి
కొత్త వ్యాపార ప్రణాళిక రూపొందింస్తారు.. దీని ప్రయోజనాలు భవిష్యత్ లో పొందుతారు. మతపరమైన పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగులకు శుభదినం. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది.
మీన రాశి
ఈ రాశివారు వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. తొందరపడకండి. ఆరోగ్యం చెడిపోవచ్చు. ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వొద్దు. ఇంటివారితో వాగ్వాదం జరగవచ్చు. ఆదాయం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగులు నిరసన వ్యక్తం చేయవచ్చు. కాస్త ఓపికగా వ్యవహరించండి.