Horoscope Today 5th October 2022: ఈ దసరా ఈ రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతుంది, అక్టోబరు 5 రాశిఫలాలు
Horoscope Today 5th October :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
ఏబీపీ దేశం వ్యూయర్స్ కి ముందుగా దసరా శుభాకాంక్షలు..మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధిరస్తు.....
Horoscope Today 5th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు ఈ రాశివారిపై శ్రీరాముడి అనుగ్రహం ఉంటుంది. ఈ రోజు అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఉద్యోగులకు నిన్నటి వరకూ ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం బాగాసాగుతుంది.
వృషభ రాశి
దసరా రోజు మీ సంతోషం రెట్టింపవుతుంది. ఈ రోజున మీరు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొన్ని శుభవార్తలను పొందుతారు. ఈ రోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.
మిథున రాశి
ఈ రోజంతా మనసు ఆనందంగా ఉంటుంది. ఇంటి సభ్యులతో సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది.
కర్కాటక రాశి
మీ మనసును మాటని అదుపులో ఉంచుకోండి. వాస్తవాన్ని అర్థం చేసుకుని మసలుకోండి. మీ సామర్థ్యం, ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగండి. ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్వార్థపరులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
Also Read: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!
సింహ రాశి
దసరా పండుగ మీ కెరీర్‌ని అద్భుతంగా మారుస్తుంది. ఉద్యోగుల వృద్ధికి అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. విద్యార్థులు, వ్యాపారులకు బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పువస్తుంది
కన్యా రాశి
ఆకస్మికంగా కొన్ని సంతోషకరమైన వార్తలు అందుతాయి. పాస్‌పోర్ట్ లేదా వీసాలో సమస్యలను అధిగమించవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. భవిష్యత్ లో మీ విజయానికి ఇవి ఉపయోగపడతాయి.
తులా రాశి
వ్యాపార పరంగా ఈ రోజు మీకు మంచి రోజు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి చెందిన మాస్ మీడియా, ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు. ఈరోజు కెరీర్‌కు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. రకరకాల ఆలోచనల నుంచి బయటకు వచ్చి మీ లక్ష్యంపై దృష్టి సారించండి.
ధనుస్సు రాశి
ఈ రోజు ధనస్సు రాశివారిపై శ్రీరాముడి అనుగ్రహం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కొంతమంది మీ అమాయక స్వభావాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి
దసరా పండుగ మీ జీవితంలో మంచి మార్పు తీసుకొస్తుంది. ఈ రోజు మీరు మతపరమైన కార్యక్రమాలపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. కుటుంబంతో సరదాగా గడిపే అవకాశం ఉంది. ఎక్కడికైనా ప్రయాణించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
Also Read: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!
కుంభ రాశి
ఈ రాశివారికి దసరా రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికపరంగా నష్టాలు ఉండొచ్చు. నూతన పెట్టుబడుల విషయంలో అస్సలు తొందర పడొద్దు. మూలధనాన్ని తెలివిగా ఉపయోగించాలి. ఈ రోజు మీరు తలపెట్టిన పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు.
మీన రాశి
ఈ రాశి విద్యార్థులకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీరు కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. మాటతీరు మార్చుకునేందుకు ప్రయత్నించండి.