అన్వేషించండి

Horoscope 4th February 2024: ఈ రాశివారు ఆస్తి కొనుగోలు చేసేందుకు ఇదే మంచి టైమ్, ఫిబ్రవరి 4 రాశిఫలాలు

Horoscope 3rd February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 4th February 2024  - ఫిబ్రవరి 4 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఓ గుడ్ న్యూస్ వింటారు. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.  కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అవసరమైన సమయంలో స్నేహితుల నుంచి సహకారం పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. ఇంటికి అతిధుల రాక వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీరు కొత్త ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఆర్థిక విషయాలలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటుంది. విద్యార్థులు విద్యా పనుల్లో చిన్నచిన్న ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదో తెలియని భయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. 

Also Read: ఈ ఏడు వ్యసనాల్లో ఒక్కటున్నా చాలు ఇక అంతే!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటాయి. కెరీర్‌లో మంచి విజయాన్ని పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. చేపట్టిన పనుల్లో ఆంటకాలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కోసం నిధులు సేకరించడం సులభం అవుతుంది. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

సింహ రాశి (Leo Horoscope Today)

మీ లక్ష్యాలను సాధించేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తూ ఉండండి. కొంతమందికి ఈ రోజు పని విషయంలో ఎక్కువ హడావిడి ఉంటుంది. మీరు కుటుంబం , స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఈ రోజు స్నేహితుని సహాయంతో ఆర్థిక లాభం పొందుతారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వృత్తి జీవితంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

వృత్తి జీవితంలో పని సవాళ్లు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.   భూమి నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.

Also Read: కుజుడి ప్రభావంతో 40 రోజుల పాటూ ఈ రాశులవారికి మానసిక ఆందోళన, సమస్యలు!

తులా రాశి (Libra Horoscope Today) 

విద్యార్థులు పోటీ పరీక్షలలో అఖండ విజయం సాధిస్తారు. కొంతమంది ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.  రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. మీ భాగస్వామి పట్ల శ్రద్ధ వహించండి. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.  కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వృత్తి జీవితంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్యాలయంలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఇది మీ పనితీరును ప్రభావితం చేయవచ్చు. ఈ రోజు మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రాశివారి జీవితంలో చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అఖండ విజయం సాధిస్తారు. అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇంటికి అతిధుల రాక వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది

Also Read: మకరంలోకి కుజుడు - ఈ 5 రాశులవారికి మంచిరోజులొచ్చినట్టే!

మకర రాశి (Capricorn Horoscope Today) 

కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ రోజు విజయవంతమవుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు అందుతాయి.కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. 

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

వృత్తి జీవితంలో పని సవాళ్లు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. భాగస్వామితో విభేదాల సంకేతాలు ఉన్నాయి. ఈరోజు చాలా ఆలోచించి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి.

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈరోజు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. వృత్తి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి కొత్త విజయాలు సాధిస్తారు. ఊహించని మార్పులకు సిద్ధంగా ఉండండి. వ్యాపారులు ఈ రోజు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ వహించాలి. 

Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!

గమనిక:  ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Shani Vakri 2026: శని వక్రగమనం - కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
శని వక్రగమనం: కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget