Horoscope Today : నేటి రాశిఫలాలు (03-05-2024)
Daily Horoscope: మే 3 ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...
Daily Horoscope : మే 3 రాశిఫలాలు
మేష రాశి
మీ పని తీరు ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాన్ని పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో పని చేసే వారికి ఆదాయం రావచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు
వృషభ రాశి
కుటుంబంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికందుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
మిథున రాశి
అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఈ రాశి ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వ్యక్తులు బోనస్ పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం బావుంటుంది.
Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !
కర్కాటక రాశి
ఆర్థిక పరిస్థితి కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. ప్రేమ సంబంధాలలో అసహనానికి దూరంగా ఉండండి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండాలి. మీ ఆలోచనలను ఇతరులపై రుద్దొద్దు.
సింహ రాశి
దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. పొదుపు గురించి ఆలోచిస్తారు. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి దాచిపెట్టే పనిని చేయవద్దు.. భవిష్యత్ లో సమస్యలు ఎదుర్కోవచ్చు.
కన్యా రాశి
ఈ రోజు మీకు శుభదినం. ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. మీ దినచర్యను క్రమశిక్షణలో ఉంచుకోండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి.
తులా రాశి
ప్రత్యర్థులు దెబ్బకొట్టేందుకు పొంచి ఉన్నారు జాగ్రత్త. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మీ ప్రియమైన వారి ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.
Also Read: చికాకుగా ఉన్నప్పుడు మీ రాశి ప్రకారం ఈ పనులు చేస్తే తొందరగా రిలాక్సైపోతారు!
వృశ్చిక రాశి
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా క్షీణించవచ్చు. మీరు తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయించేందుకు ఇష్టపడతారు.
ధనుస్సు రాశి
ఓ పెద్ద నిర్ణయం తీసుకుంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో మీ గుర్తింపు పెరుగుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మద్దతు పొందుతారు
Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!
మకర రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. డబ్బు వృధా చేయవద్దు. స్నేహితులతో సరదాగా గడుపుతారు.జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండండ మంచిది. అనుభవజ్ఞుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు.
కుంభ రాశి
వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారిపై పని ఒత్తిడి తగ్గుతుంది. మీలో ఆత్మవిశ్వాసం, మనోబలం పెరుగుతుంది. మీరు సామాజిక కార్యాలలో పాల్గొంటారు
మీన రాశి
ఇంట్లో, కార్యాలయంలో పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారతాయి. ఖర్చులు తగ్గించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త. అధిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రాణాయాణం చేయండి.
Also Read: మీలో మీకు తెలియని అపరిచితుడు ఇదిగో!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.