Horoscope Today 29th October 2022: ఈ రాశివారు డబ్బుకోసం తప్పుడు మార్గంలో వెళ్లొద్దు, అక్టోబరు 29 రాశిఫలాలు
Horoscope Today 29th October 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 29th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
మీ మనస్సాక్షి ఏది సరైనదో అదే చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. స్నేహితులతో సమయం గడుపుతారు. చెడు సహవాసాన్ని వదిలివేయండి లేకపోతే చాలా నష్టపోతారు
వృషభ రాశి
ఇప్పటి వరకు కార్యాలయంలో మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తులు కూడా ఈ రోజు మీ పనిని అభినందిస్తారు. అనుకున్న పనులు పూర్తవ్వాలంటే ఒకరి సహకారం అవసరం. మీ సలహా,అభిప్రాయం ఎవ్వరూ అడగకుండా చెప్పకండి.
మిథున రాశి
మీకు రోజురోజుకీ టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లిరావడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. మీ ప్రియమైన వారికి మీ అవసరం చాలా ఉంటుంది. వినోదం కోసం ఖర్చుచేస్తారు. తండ్రి ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి ఆందోళన చెందుతారు.
Also Read: ఈ రాశులవారు సంయమనంతో ఉంటారు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహనం కోల్పోరు
కర్కాటక రాశి
మీరు ఈ రోజు ఎలాంటి కారణం లేకుండా వివాదంలో చిక్కుకోవచ్చు. మీ ఆలోచనా ధోరణి మార్చుకోవడం సముచితం. పురోగతిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి..ఓ శుభవార్త వింటారు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
సింహ రాశి
మీరు ఉద్యోగం మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే..ఒకరి సిఫార్సుతో మారడం చాలా మంచిది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో బంధాలు బలపడతాయి. సంతాన సుఖం పొందే అవకాశం ఉంది.
కన్యా రాశి
ఈ రోజు ప్రారంభంలో మనస్సంతా విచారంగా ఉంటుంది. ఒక అంశాన్ని అర్థం చేసుకోవాలనే కుతూహలం ఉంటుంది. మీ కిందివారు చేసేపనిని మెచ్చుకోండి..మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి
తులా రాశి
వివాదాస్పద విషయాల్లో మీదే పైచేయి అవుతుంది. కొత్తదనం కోసం ట్రై చేస్తారు. భవిష్యత్ కి సంబంధించి కొన్ని వ్యక్తిగత విషయాలు ఈ రోజు ప్రస్తావనకు రావొచ్చు. ఉద్యోగంలో ఉత్సాహం లోపిస్తుంది.
Also Read: నాగుల చవితి పుట్టలో పాలుపోసే ముహూర్తం వివరాలు, పుట్ట దగ్గర చేయాల్సిన ప్రార్థన!
వృశ్చిక రాశి
పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ పని పట్ల నిజాయితీగా ఉండండి. మీరు కోరుకున్న సమాధానం రాకపోతే నిరాశచెందకండి. మొండిగా ఉండాలనే ఆలోచన పక్కనపెడితే సంతోషం మీసొంతం
ధనుస్సు రాశి
ఈ రాశివారు ఈ రోజు ప్రతికూల ఆలోచనతో నిరాశ చెందుతారు. మీపై నియంత్రణ కోల్పోకుండా ఉండండి. మిత్రులతో విభేదాలు రావొచ్చు. పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది..జాగ్రత్త. ఉద్యోగులు పనిపై దృష్టి సారించాలి, వ్యాపారులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
మకర రాశి
మీరు మీ వృత్తి పట్ల ప్రస్తుతానికి సంతోషంగా ఉండరు కానీ కాలక్రమేణా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి.జీవిత భాగస్వామి ప్రవర్తన మనోధైర్యాన్ని పెంచుతుంది. అప్పులు చేసే పరిస్థితి రావొచ్చు.. మీ ఆర్థిక స్థితిని బట్టి అప్పులు చేయడం మంచిది.
కుంభ రాశి
సహాయం చేసేందుకు ఈ రాశివారు ముందుంటారు. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తారు. రాజకీయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
మీన రాశి
ఇంటి పనులతో బిజీగా ఉంటారు. విద్యార్థులు ఫలితాల గురించి ఆందోళన చెందుతారు. అతిథులు రావచ్చు. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. డబ్బు సంపాదించాలనే తపనతో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉండండి.