News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

Rasi Phalalu Today 28th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మే 28 రాశిఫలాలు: సూర్యుని అనుగ్రహంతో ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. సంపద పొందుతారు. కొన్ని రాశులవారు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. 

మేష రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఎవరికైనా సహాయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. కొత్త సంబంధాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కుటుంబ బంధాలు బావుంటాయి. ఈ రోజు కార్యాలయంలో ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఎవ్వరికీ ఇవ్వొద్దు..తీసుకోవద్దు. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. మాట్లాడే బదులు వినడానికి ఎక్కువ శ్రద్ధ పెట్టండి. దీనివల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. రోజంతా ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితం అద్భుతంగా సాగుతుంది.

మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారి మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు ఉద్యోగం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపార వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. సంగీత రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. స్నేహితుల సమస్యలు పరిష్కరిస్తారు. 

Also Read: అమ్మో అమ్మవారి పాదాలకింద శివుడు, అప్పటికి కానీ ఆమె శాంతించలేదు

కర్కాటక రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. స్నేహితుడి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. మీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మీ ప్రయత్నాల నుంచి మంచి ఫలితం పొందే అవకాశం ఉంది.  మీరు పెద్ద విజయాన్ని పొందవచ్చు. దానివల్ల మీ మనసు ఆనందంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలు అమలుచేస్తారు

సింహ రాశి 
ఈ రోజు కొత్త పనులు చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. పార్టీలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులేకు మంచి రోజు అవుతుంది. కెరీర్ సంబంధిత ప్రిపరేషన్ బలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి రోజు. కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆనందం  శ్రేయస్సు ఉంటుంది. స్నేహితుడిని కలుస్తారు.

కన్యా రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో లాభాన్ని పొందేందుకు ఒకరి సహాయం తీసుకోవలసి ఉంటుంది. చర్చలకు దూరంగా ఉండాలి. మొబైల్‌లో గడిపే సమయాన్ని తగ్గించండి..తద్వారా మీ మనస్సు పనిలో నిమగ్నమై ఉంటుంది. వ్యాపార వర్గాలకు మంచి లాభం ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. ఆర్థికంగా ఈరోజు మీరు విజయం సాధిస్తారు.

Also Read: శిరస్సు లేని ఈ అమ్మవారికి పసుపు నీళ్లతో మొక్కులు తీర్చుకుంటే చాలు

తులా రాశి
ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. చదువు కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎంత కష్టమైన పనిలోనైనా ఏకాగ్రతను కాపాడుకోవాలి. ఈ రోజు మీరు కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్‌ను పొందుతారు. మీరు పిల్లల వైపు నుంచి ఆనందాన్ని పొందుతారు.  క్లిష్ట పరిస్థితుల్లో మీరు కొంతమంది వ్యక్తుల నుంచి సులభంగా సహాయం పొందుతారు. వ్యాయామానికి సమయం కేటాయించండి.

వృశ్చిక రాశి 
ఈ రోజు మీకు మంచి అవుతుంది. ఒంటరిగా ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. మీరు రూపొందించిన వ్యాపార ప్రణాళిక లాబాన్నిస్తుంది. విభిన్నమైన పనులు చేసేందుకు ఆలోచిస్తారు. కార్యాలయంలోని అధికారుల సహకారం లభిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. మీరు కొన్ని కొత్త ఆలోచనలపై కూడా పని చేస్తారు.

ధనుస్సు రాశి 
ఈరోజు మీ మనోబలం పెరుగుతుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. కెరీర్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల ముందు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. భవిష్యత్ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఈరోజు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ మాటలను నియంత్రించుకోవాలి. ఇంటా బయటా గౌరవం పొందుతారు.

మకర రాశి
ఈ రోజు ఏ పనిలోనైనా ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మిమ్మల్ని మీరు విశ్వసించండి. స్నేహితులకు అప్పులు ఇవ్వొద్దు. ముఖ్యమైన పనిలో మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. అతిథులను కలుస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ఆన్‌లైన్ వ్యాపారానికి మంచి అవకాశాలు లభిస్తాయి.

కుంభ రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. అనుకోని అతిథి రాకతో మీ కార్యక్రమాల్లో మార్పులుంటాయి. కుటుంబ సభ్యులను కలుస్తారు.  మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి పెడతారు.

మీన రాశి
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీ రోజు బిజీగా ఉంటుంది. కొత్త పనుల పట్ల మీ ఉత్సుకత పెరుగుతుంది. ఈరోజు మీరు కాస్త ఓపికగా వ్యవహరించాలి. ఈ రోజు సంతోషంగా ఉంటారు. మీ పని మరియు వ్యాపారం పట్ల విధేయతతో ఉండండి.

Published at : 28 May 2023 05:32 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today Horoscope for 28th May 28th May Astrology

ఇవి కూడా చూడండి

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

టాప్ స్టోరీస్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన