మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది
Rasi Phalalu Today 28th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మార్చి 28 మంగళవారం రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశికి చెందిన యోగా, ఆధ్యాత్మిక రంగాల వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగులు మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే అదనపు ప్రయత్నాలు చేయాలి. తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి కానీ మీరు మీ అవగాహనతో కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగిస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆలోచించే, అర్థం చేసుకునే మీ శక్తి బలంగా ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. అన్నపానీయాలపై శ్రద్ధ వహించండి. కుటుంబ వాతావరణం బావుంటుంది.
మిథున రాశి
ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బును ఈ రోజు మీరు పొందుతారు. ఈ రాశి వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. మీ జీవితంలో ఆనందంగా ఉండే క్షణాలొచ్చాయి. మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు చాలా ఈవెంట్‌గా ఉంటుంది. ఆదాయంలో అక్రమాలు కొన్ని సమస్యలను కలిగిస్తాయి. జీవితంలో వేగంగా పురోగతి సాధించడానికి మీరు మీ కుటుంబం, స్నేహితుల సహాయం తీసుకోవలసి ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అని చెప్పొచ్చు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులు టార్గెట్లు పూర్తిచేస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ప్రేమ జీవితంలో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు
కన్యా రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం బావుంటుంది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. శత్రువులు ఎంత షార్ప్ గా ఉన్నా మీకు హానిచేయడంలో విఫలం అవుతారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడం మంచిది
తులా రాశి
ఈ రోజు మీరు, మీ ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త పడండి. ఉద్యోగులు, వ్యాపారులు పనిపై శ్రద్ధ వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో వివాస్పద పరిస్థితులు రావొచ్చు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీరు కొత్త పథకాలపై పని చేయాలని ఆలోచిస్తారు..కొన్నింటిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలో సక్సెస్ అవుతారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచిరోజు. ప్రేమ జీవితంలో సమస్యలు పెరుగుతాయి.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారు విద్యారంగంలో గొప్ప విజయాలు పొందుతారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. తోబుట్టువులు మీ పనిలో సహకరిస్తారు. ఉద్యోగులు వ్యాపారులకు శుభసమయం.
Also Read: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
మకర రాశి
ఈ రోజు మీకు నిదానంగా గడుస్తుంది..ఏదో ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది. ఏకాగ్రత తగ్గడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ప్రత్యర్థుల కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందిపడతారు. ఆర్థికపరమైన అడ్డంకులు ఎదురవుతాయి.
కుంభ రాశి
ఈ రోజు మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనవసర విషయాలను తలకి ఎక్కించుకోవద్దు. ఉద్యోగులు పనిపట్ల నిర్లక్ష్యం వద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి.
మీన రాశి
ఈ రోజు మీ జీవితంలో కొన్ని కొత్త జ్ఞాపకాలు యాడ్ అవుతాయి. కార్యాలయంలో అందరితో మంచి సామరస్యాన్ని మెంటైన్ చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. అనుకున్న పనులు అడ్డంకులు ఎదురైనా పూర్తిచేస్తారు. అనవసర విషయాలకు కోపం వద్దు.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.