Horoscope Today 27th October 2022: ఈ రాశివారు చర్చలకు దూరంగా ఉండడం మంచిది, అక్టోబరు 27 రాశిఫలాలు
Horoscope Today 27th October: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 27th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీ బాధ్యతలు పెరుగుతాయి. ఇది భవిష్యత్తులో మీ పురోగతికి ఉపయోగపడుతుంది. కొంతమంది రహస్య శత్రువులు మీకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తారు..అప్రమత్తంగా ఉండండి. మీరు కాస్త తెలివిగా వ్యవహరిస్తే పరిస్థితులు చక్కబడతాయి. ఉద్యోగులు, వ్యాపారుకు బాగానే ఉంటుంది.
వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు శత్రువుల కారణంగా ఓడిపోతారు. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. కుటుంబంలో మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి.
మిధున రాశి
గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాన్నిస్తాయి. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారం బాగాసాగుతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు
కర్కాటక రాశి
గంటలతరబడి చర్చలకు దిగొద్దు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలకు ఈ రోజు ఫుల్ స్టాప్ పడుతుంది. మీపై కోపం ప్రదర్శించేవారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఉద్యోగులు బిజీబిజీగా ఉంటారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!
సింహ రాశి
ఈ రాశివారి ఇంట్లో వివాదాలు పెరుగుతాయి. ఇంటి సభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలు చర్చల ద్వారా పరిష్కరించేందుకు ట్రై చేయాలి. కుటుంబసభ్యుల్లో అనారోగ్యంతో ఉన్నవారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
కన్యా రాశి
ఈ రాశి వ్యాపారులు వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..లేదంటే భాగస్వాముల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. పరిస్థితిలు మీకు అంతగా అనుకూలంగా ఉండవు. స్నేహితులతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు మరింత కష్టపడాలి
తులా రాశి
ఈ రాశి విద్యార్థులకు చదువు విషయంలో కొంత చికాకుగా ఉంటుంది. ఏ పని చేయాలో, ఏ పని పోస్ట్ పోన్ చేయాలో అనే ఆలోచనలోనే రోజంతా గడిపేస్తారు. కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.
వృశ్చిక రాశి
కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి సమయం. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఈ రోజు ముందుకు సాగుతాయి. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే ఆలోచన చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నా టార్గెట్ రీచ్ అవుతారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
ధనుస్సు రాశి
ఈ రాశివారు జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒకరిపై ఒకరు నమ్మకం కలిగి ఉండాలి..లేదంటే మూడో వ్యక్తి కారణంగా మీ మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏ విషయాన్ని దాచవద్దు. ఉన్నతాధికారుల నమ్మకాన్ని ఉద్యోగులు వమ్ముచేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
Also Read: పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!
మకర రాశి
నూతను పెట్టుబడులకు ఇది మంచి సమయం. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా బాగానే కలిసొస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అప్పులు ఇచ్చిన మొత్తం వసూలవుతుంది. ఈ రోజు వ్యాపారవేత్తలు తమ కస్టమర్ల నుంచి ప్రశంసలు పొందుతారు.
కుంభ రాశి
ఈ రోజు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి లేదంటే బడ్జెట్‌కు ఆటంకం కలుగుతుంది. ఓ ప్లాన్ ప్రకారం ఖర్చు చేయడం మంచిది. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు ఓసారి ఆలోచించండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులు చదువుపై దృష్టిసారించాలి
మీన రాశి
ఈ రోజు మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఏ పనీ చేయలేని ఫీలింగ్ కలిగి ఉంటే పెండింగ్ పనులున్నీ ఈ రోజు పూర్తిచేయగలుగుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. సమయాన్ని ఫాలో అవండి.