అన్వేషించండి

మే 27 రాశిఫలాలు, ఈ రోజు రాశులవారు మంచి గుర్తింపు పొందుతారు!

Rasi Phalalu Today 27th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మే 27 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు ఈ రాశివారికి అంతా మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీకు ఇష్టమైన వారిపై శ్రద్ధ చూపుతారు. ఓపికగా ఉండండి ఆవేశపడొద్దు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. అనుభవజ్ఞుల సలహాలు,సూచనలు  పరిగణలోకి తీసుకోండి. నూతన వస్తుంది ప్రాప్తి. వాహన సౌఖ్యం ఉంది.  ఆప్తులను  నిర్లక్ష్యం చేయవద్దు. పెద్దలపట్ల గౌరవం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. రోజంతా ఆనందంగా ఉంటారు. 

వృషభ రాశి

అవసరమైన పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. బేరసారాలు అనుకూలంగా జరుగుతాయి. కాంట్రాక్టులలో జాప్యం జరిగినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. సాంగిక,సామాజిక  రంగాలలో ఏర్పడిన పరిచయాలు వలన మేలు జరుగుతుంది.అందరితో  కలివిడిగా కలిసి మెలసి ఉంటారు. విలువైన సమాచారం అందుతుంది. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కార్యక్రమాల్లో  పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారం బాగానే ఉంటుంది. విద్యార్థులు చదువులో మెరుగ్గా రాణిస్తారు. మంచి ప్రవర్తన తో ఆకట్టుకునేలా ఉంటారు.

మిథున రాశి

సమాజం లో మీ పేరు ప్రతిష్ట లు పెరుగుతాయి.కుటుంబంలోఅందరికీ మీపై విశ్వాసం పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనితీరును  కొంచెం మార్చుకుంటే విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు మధ్య  ఆనందం, సామరస్యం ఉంటుంది. అతిధుల రాకపోకలు కొనసాగుతాయి. అందరినీ గౌరవిస్తారు. ఆర్థిక బలం పెరుగుతుంది. పాత పరిచయాలు మరింత బలోపేతం అవుతాయి. ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో అద్భుతాలు చేస్తారు.

Also Read: 'శంఖం' సంపదకు ప్రతీకగా ఎందుకు చెబుతారు, దీన్ని ఎలా పూజించాలి!

కర్కాటక రాశి

ఈ రోజు ఈరాశి వారు సానుకూలంగా  ఉంటారు. మంచి ఫలితాలతో ఉత్సాహంగా ఉంటారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ మాట, ప్రవర్తనతో  అందర్నీ ఆకట్టుకుంటారు. మీ ప్రణాళికలు విజయం వైపు దారితీస్తాయి.అతిథుల రాకపోకలుంటాయి. మీ వ్యక్తిత్వంతో  ఉన్నంతంగా వెలిగిపోతారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు మీకు  అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలకు కార్యరూపం  ఇవ్వండి.ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. ఇతరుల  సహాయ సహకారాలు లభిస్తాయి.  

సింహరాశి

మీమాంస లేకుండా అడుగు ముందుకు వేయండి. న్యాయపరమైన విషయాల్లో పొరపాట్లను నివారించండి. అవగాహనతో  మసలుకోండి. పెద్దల సహకారం ఉంటుంది. అత్యుత్సాహం ప్రదర్శించకండి.  రాజకీయ రంగంలో ఉన్నవాళ్లు ప్రతిపక్షాలతో జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులకు తలవంచి  సర్దుకుపోండి. బంధు, మిత్రుల మద్దతు ఉంటుంది. పనులపై స్పష్టత వస్తుంది. ఖర్చులపై నియంత్రణ ఉంటుంది.  నియమాలను అనుసరించండి. ఈ రోజు మొత్తం సాధారణంగా గడుస్తుంది. కుటుంబ సమస్యలు దూరమవుతాయి.

కన్యా  రాశి

ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విజయాలు చేకూరుతాయి. పోటిల్లో పాల్గొనే వారు విజయం సాధిస్తారు. ఆర్థికంగా  ఇతరులకు సహాయ పడతారు.అనుకున్న పనులు నెరవేరటం వలన ఉత్సాహంగా ఉంటారు.  కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు.  లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు మంచి లాభాల తో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

Also Read: శని బాధలు తొలిగిపోవాలంటే శనివారం రోజు ఇలా చేయండి!

తులారాశి

పెద్దల సహాయ సహకారాల వలన విజయాలు  పొందుతారు. మంచి ప్రణాళిక  వలన పనులను ముందుకు తీసుకువెళతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో అందరి సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. మీ వలన అధికారులు సంతోషిస్తారు.మీ ప్రణాళిక లును అమలుపరచండి. ఆర్థిక కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. చట్ట వ్యతిరేక పనులు కు దూరంగా ఉండండి.

వృశ్చిక రాశి

అదృష్టం మీ వెంటే ఉంటుంది. లక్ష్యాన్ని సాధించడం సులభం అవుతుంది. కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుంటారు. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి.ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఉంటుంది. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తారు. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. 

ధనుస్సు రాశి

పనిభారం ఎక్కువగా ఉంటుంది.  కాస్త తెలివిగా వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపవద్దు. దినచర్య, ఆహారంలో క్రమశిక్షణతో ఉండండి. కష్టానికి తగిన ఫలితం  ఉండదు.  కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అనుకోని సంఘటనలు జరగవచ్చు. సన్నిహితుల సహకారం ఉంటుంది. ఓపికతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి. రిస్క్ తీసుకోకండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

మకర రాశి

వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. మిత్రులు సహకారం  వలన విజయాన్ని పొందుతారు. మానసిక సంబంధాలు దృఢంగా ఉంటాయి. అవసరమైన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. వ్యక్తిగత సమస్యలను పరిష్కరిస్తారు. అవసరమైన సందర్భాల్లో వేగంగా స్పందిస్తారు. కెరీర్ సంబంధిత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.

కుంభ రాశి

కష్టపడితే ఫలితం ఉంటుంది. బాధ్యతలు నిర్వర్తిస్తారు. చేసే పనులలో స్పష్టత పెరుగుతుంది. కొత్త వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు.  కోపం అదుపులో పెట్టుకోండి. పనిపై దృష్టి పెట్టండి. ఫలితాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితులతో సామాజిక సంబంధాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అడగకుండా మీ అభిప్రాయం చెప్పకండి. ప్రత్యర్థులు మీ కన్నా రెండు అడుగులు ముందే ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది.

మీన రాశి
ఈ రాశి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. అందరూ మీ అభిప్రాయానికి మద్దతు ఇస్తారు. పనితీరు మెరుగు పరుచుకుంటారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget