Image Credit: Pixabay
Astrological prediction for September 26th, 2023
మేష రాశి
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. స్థిరాస్తుల కొనుగోలుకి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
ఏదో తెలియని భయం వెంటాడుతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది.
వృషభ రాశి
మీరు ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మీకు ఇష్టమైన ఆహారాన్ని మీరు ఆనందిస్తారు. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. పెట్టుబడులు కలిసొస్తాయి.
ప్రయాణానికి ప్రణాళికలు వేసుకుంటారు.
మిథున రాశి
పెరుగుతున్న ఖర్చుల కారణంగా టెన్షన్ ఉంటుంది. మీరు విచారకరమైన వార్తలు అందుకుంటారు, సహనంతో ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. పాత వ్యాధి తిరిగి రావచ్చు. వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు.
Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం
కర్కాటక రాశి
ఏదో తెలియని భయం ఉంటుంది. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. లాభం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పెట్టుబడులు కలిసొస్తాయి.వ్యాపారులు, ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
సింహ రాశి
ఈ రాశివారు గుడ్ న్యూస్ వింటారు. ధైర్యం పెరుగుతుంది. రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించగలుగుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. పిల్లల కారణంగా ఏదో ఆందోళన ఉంటుంది. అనుకోని అతిథులు ఇంటికి వస్తారు. చెడు వ్యక్తుల నుంచి దూరం పాటించండి.
కన్యా రాశి
కొత్త పనిని ప్రారంభించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నూతన వస్త్రాలు, ఆభరణాల కోసం ఖర్చు పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపార యాత్ర విజయవంతమవుతుంది. ఆర్థికాభివృద్ధిలో సంతృప్తి ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యత పెరగవచ్చు. ఉత్సాహంగా పని చేస్తారు.
తులా రాశి
పెద్ద ఖర్చులు ఎదురవుతాయి. అప్పులు తీసుకునే పరిస్థితి రావచ్చు. ఎవరితోనైనా వివాదం పనిలో ఆటంకం కలిగిస్తుంది. ప్రయాణాలలో జాప్యం ఉండవచ్చు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. శత్రువులు పెరుగుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పనిపై దృష్టి పెట్టండి.
వృశ్చిక రాశి
తప్పుడు పనులు చేయవద్దు. సంఘర్షణను నివారించండి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బు వచ్చే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ప్రారంభించండి. స్నేహితుల కారణంగా మంచి జరుగుతుంది. కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు
ధనుస్సు రాశి
వ్యాపార భాగస్వాముల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణం విజయవంతమవుతుంది. అనారోగ్య సూచనలున్నాయి. అశాంతి ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!
మకర రాశి
ఈ రాశివారికి పని ఒత్తిడి పెరుగుతుంది. వాహనాలు, యంత్రాలు వినియోగించేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. పనుల్లో వేగం మందగిస్తుంది. ఆందోళన పెరుగుతుంది. షేర్లలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. కాస్త ఓపికగా వ్యవహరించాలి.
కుంభ రాశి
ఈ రాశివారు పురోగతికి అవకాశం పొందుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. రాజకీయ వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. ఉన్నత అధికారులు ఉద్యోగంలో సంతోషంగా ఉంటారు. అపరిచితుల మాటలకు మోసపోకండి. ఆర్థిక నష్టం ఉండవచ్చు.
మీన రాశి
ఈ రాశివారికి అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. మీ ఉద్యోగంలో ఉన్నతాధికారులతో మాటలు పడే అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబంలో విభేదాలు రావచ్చు. డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. నూతన పెట్టుబడులు పెట్టొద్దు.
Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!
Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!
Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!
Horoscope Today December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..
Christmas 2023: క్రిస్మస్ వేడుకలు డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>