ఈ రాశులవారికి ఈ వారం అంతగా కలసిరాదు
(25 Sept- 01 Oct)



సెప్టెంబరు ఆఖరి వారం ఈ ఆరు రాశులవారు ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి



సింహ రాశి
ఈ రాశివారు ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. బంధువులను కలుస్తారు. విద్యార్థులకు ఇది మంచి సమయం..పోటీ తత్వాన్ని అర్థం చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.



కన్యా రాశి
ఇప్పటి వరకూ మీకు ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా వివాదంలో చిక్కుకున్నా...ఈ వారం మీకు ఉపశమనం లభిస్తుంది. ఖర్చులు తగ్గించాలి, కుటుంబానికి సంబంధించిన పాత జ్ఞాపకాలు మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు



తులా రాశి
తులారాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకోవాలి. ఈ వారం చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార సంబంధిత విషయాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దు.



ధనుస్సు
ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీ సామర్థ్యాన్ని మించి వాగ్దానాలు చేయడం మంచిది కాదు. అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. కష్టానికి తగిన ఫలితం అందుకోలేరు కానీ అనుకూల ఫలితాలు పొందుతారు.



మకరం
ఈ రాశివారు ఈ వారం తెలివిగా ఖర్చు చేయాలి. డబ్బు, విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త వద్దు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి



మీన రాశి
ఈ వారం మీ ఆరోగ్యం చాలా సాధారణంగా ఉంటుంది. ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. జీవితంలో డబ్బు ప్రాధాన్యతను మరింత తెలుసుకుంటారు. భవిష్యత్ లో ప్రతి పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.



Images Credit: Pixabay