మేష రాశి ఈ వారం ఈ రాశివారి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. చేయాలనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. పూర్వీకుల ఆస్తి, భూమి, ఆస్తి, పాలసీ ఇలా ఏదో ఒక రూపంలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.
వృషభ రాశి ఈ వారం మీరు అనుకోని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పని భారం తగ్గుతుంది. సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్ లో మరో అడుగు ముందుకేసేందుకు వినియోగించుకోవాలి. ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు.
మిథున రాశి ఈ వారం మొత్తం మీరు బిజీ బిజీగా ఉంటారు. అవసరమైన దానికన్నా ఎక్కువ పని లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఈ వారం ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు.
కర్కాటక రాశి ఈ వారం మీ రాశికి చాలా మంచిది. మీ కుటుంబ సంక్షేమం కోసం, మీకు ప్రయోజనం చేకూర్చే కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఈ సమయంలో, మీ పెద్దల సలహాలు భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
వృశ్చిక రాశి ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..అనుకోని ప్రయోజనాలు పొందుతారు. ఈసారి మీరు వ్యాపారంలో మీ సొంత వ్యక్తుల నుంచి ద్రోహాన్ని ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులు తమ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
కుంభ రాశి ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అన్ని పనులను సమర్థతతో పూర్తి చేయడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తారు. సమయాన్ని వృధా చేయకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మీ నిర్ణయాలు మీరు తీసుకోవడమే మంచిది. ఇంటికి అతిథి రాక సంతోషాన్ని నింపుతుంది.