News
News
X

Horoscope Today 26th October 2022: ఈ రాశివారి ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండాలి, అక్టోబరు 26 రాశిఫలాలు

Horoscope Today 26th October: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
 

Horoscope Today 26th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులు కొత్త ప్రణాళికలు అమలు చేయొచ్చు. పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. సోదరీమణుల విషయంలో వివాదం జరగొచ్చు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి
మనస్సు అస్థిరత కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. మంచి వ్యక్తుల సాంగత్యం మీకు లభిస్తుంది

మిథున రాశి
ఈ రాశివారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులకు భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు..మీరు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.

News Reels

Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!

కర్కాటక రాశి 
ఉద్యోగులకు ఈ రోజు శుభసమయం. కుటుంబంలో ఓ శుభకార్యం నిర్వహించేందుకు సిద్ధమవుతారు. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. దంత సంబంధిత ఇబ్బందులు ఉండొచ్చు. తండ్రితో ఒక ముఖ్యమైన విషయం చర్చిస్తారు.

సింహ రాశి 
ఈ రాశివారికి ఈ రోజు పెండింగ్ పనులు పూర్తవుతాయి. ప్రత్యేకంగా ఎవరినైనా కలిసే అవకాశం ఉంది. మీ పని పట్ల అంకితభావంతో ఉండండి. నిర్లక్ష్యం వహించవద్దు. జీవిత భాగస్వామి సహాయంతో పనులు పూర్తి చేస్తారు. రోజంతా సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఖర్చులు తగ్గించండి.

కన్యా రాశి
అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పిల్లల పురోగతి వల్ల సంతోషంగా ఉంటారు. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థుల కారణంగా నష్టపోతారు. విద్యార్థులు ఉన్నత చదువులకోసం, ఉద్యోగులు పదోన్నతి కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.

Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!

తులా రాశి
ఈ రాశివారికి కోపం ఎక్కువగా ఉంటుంది.  కొన్ని లాభదాయకమైన అవకాశం కోసం వెతుకులాటలో ఉంటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహ ప్రతిపాదనలు విజయవంతమవుతాయి. సోదరీమణుల మద్దతు లభిస్తుంది.

వృశ్చిక రాశి 
మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొత్త బాధ్యతతో మీ దృక్పథం మారనుంది. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలుంటాయి. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.

ధనుస్సు రాశి
ఆర్మీ పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు  ఈరోజు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడతారు. ఆర్థిక ప్రయోజనాలుంటాయి.

మకర రాశి 
ఈ రోజు మీ పరిచయాల కారణంగా ప్రయోజనం పొందుతారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడతారు. 

కుంభ రాశి
ప్రయాణం చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన ప్రయోజనం పొందుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తనతో కిందిస్థాయి అధికారుల మనసు గెలుచుకుంటారు. గృహ వివాదాల కారణంగా ఉద్రిక్తత ఉంటుంది.

మీన రాశి 
తొందరపాటు కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మానుకుంటే మంచిది. నిలిచిపోయిన పనిలో ఆకస్మిక కదలికలు ఉండొచ్చు. మీ ఆనందం కోసం ఖర్చులు పెడతారు. పాతలావాదేవీలు పరిష్కారమవుతాయి. కోపం తగ్గించుకోండి.

Published at : 26 Oct 2022 05:12 AM (IST) Tags: Horoscope Today astrological predictions for October 26th October 2022 horoscope today's horoscope 26th October 2022 26th October 2022 Rashifal

సంబంధిత కథనాలు

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Horoscope Today 5th December 2022: ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

Horoscope Today 5th  December 2022:  ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

Geetha Jayanthi2022: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

Geetha Jayanthi2022: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

Geetha Jayanthi2022: ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022:  ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి

Geetha Jayanthi2022:  ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే  మార్గదర్శి

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!