News
News
X

Horoscope Today 24th October 2022: ఈ రోజు ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి, అక్టోబరు 24 రాశిఫలాలు

Horoscope Today 24th October: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
 

Horoscope Today 24th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఆదాయం-వ్యయానికి సంబంధించి బడ్జెట్ తయారు చేసుకోవడం మంచిది. ఎవరికైనా అప్పిచ్చిన వ్యాపారులు తిరిగి పొందుతారు. వేరేవారి విషయంలో అస్సలు ఇన్వాల్వ్ కావొద్దు. నిరుద్యోగులకు ఇది మంచి సమయం. ఓ శుభవార్త వింటారు

వృషభ రాశి
ఈ రోజు మీకు శక్తివంతమైన రోజు. మీ స్నేహితుల సహాయంతో ఓ సమస్యను పరిష్కరిస్తారు. మీ ప్రణాళికలు వేగవంతం అవుతాయి. పనికిరాని విషయం గురించి ఆందోళన చెందుతారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వారి శత్రువులు వారి ప్రతిష్టను పాడు చేయడానికి ప్రయత్నిస్తారు.

మిథున రాశి
ఈ రోజు మీకు ఆర్థికంగా కలిసొచ్చే రోజు. పెద్దల నుంచి ఆస్తి కలిసొస్తుంది. బెట్టింగ్ లో డబ్బు పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు..మీ విలువైన వస్తువులను సంరక్షించుకోండి.  మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. తల్లిదండ్రుల నుంచి ప్రయోజనం పొందుతారు.

News Reels

Also Read: దివాలీ ప్రత్యేక కథనాలన్నీ ఇక్కడ చూడొచ్చు

కర్కాటక రాశి
ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఏదైనా కొత్త పన చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళితే తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకోండి. దినచర్యలో మార్పుల కారణంగా మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేరు. పొట్టకు సంబంధించిన కొన్ని ఇబ్బందులుంటాయి. అవివాహిత వ్యక్తులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. మీ స్నేహితులు, సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. 

సింహ రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఓ శుభవార్త వింటారు. మీ తెలివితేటలతో  శత్రువులపై పై చేయి సాధిస్తారు. రాజకీయాల్లో పనిచేసే వారు ఏ వైపు అడుగేయాలో తెలుసుకుంటారు. విద్యార్థుల  ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలను చర్చల ద్వారా ముగించాల్సి ఉంటుంది.

కన్యా రాశి
ఈ రోజు ఆర్థిక పరంగా మీకు బలమైన రోజు..కొత్తగా వ్యాపారం చేసేవారికి అనుకూల సమయం. మీ మాటలతో కుటు౦బ సభ్యులు స౦తోష౦గా ఉ౦టారు...వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సి ఉ౦టు౦ది. చిన్న పిల్లల కోసం బహుమతిని తీసుకొస్తారు. కుటుంబంలో ప్రభావవంతమైన వ్యక్తిని మీరు స్వాగతిస్తారు. విద్యలో ఎదురవుతున్న సమస్యల గురించి మీరు గురువులతో మాట్లాడుతారు. 

Also Read: దీపాలతో లక్ష్మీదేవికి పలికే ఆహ్వానమే దీపావళి, ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయొద్దు!

తులా రాశి
ఈ రోజు మీకు ఖర్చులతో నిండి ఉంటుంది. విదేశాలలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి కొంత మంచి సమాచారాన్ని వింటారు. పిల్లల చదువుకు సంబంధించి దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవలసి వస్తే, చాలా జాగ్రత్తగా ఆలోచించండి..లేదంటే దాన్ని తీర్చడం చాలా కష్టం. మీరు వివిధ వనరులను యాక్సెస్ చేయడం ద్వారా మీ పెట్టుబడిని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక విషయాలలో మీరు సౌకర్యవంతంగా ఉంటారు.

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు చాలా ఆలోచనాత్మకంగా పని చేయాల్సిన రోజు. ఈ రోజు కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే చాలా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యాపారులు ప్లానింగ్ బిజినెస్ లో చురుకుగా ఉంటారు. ఈ రోజు మీరు ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు కాబోతోంది. మీరు మీ మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు.

ధనుస్సు రాశి
ఈ రోజు మీ స్థానం, ప్రతిష్ట పెరుగుతుంది. మీరు పనిలో ఎవరినీ నమ్మాల్సిన అవసరం లేదు లేదంటే మోసపోతారు. మీరు ఎదుర్కొనే సమస్యను కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు. మీ బాధ్యతలను నెరవేర్చడంలో మీరు ముందుంటారు. ఈ రోజు మీరు మీ వ్యక్తిగత విషయాలలో కొన్నింటిలో తెలివిగా ఉండాలి..ఎవ్వరితోనూ పోట్లాడవద్దు. 

మకర రాశి
మకర రాశివారికి ఉన్నత శిఖరాలను అధిరోహించే రోజిది. మీరు వినోద కార్యక్రమాల్లో కొంత సమయం గడుపుతారు. కుటుంబంలోని సీనియర్ సభ్యులతో కూరుచొని కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు. సోదరభావాన్ని పెంపొందించడం పరస్పర సంఘర్షణకు ముగింపు పలుకుతుంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. తప్పుడు వ్యక్తులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. వ్యాపారంలో మీ ప్రణాళికలపై దృష్టి పెట్టండి. 

కుంభ రాశి
ఈ రోజు మీరు ఒక విషయాన్ని ఓపికగా పరిష్కరించుకునే రోజు. కుటుంబ సభ్యుల దగ్గర సహనాన్ని కొనసాగించాలి. మీ మాటతీరుపై సంయమనం పాటిస్తేనే సంబంధాలు నిలుపుకోగలుగుతారు. స్నేహితుల మద్దతుతో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. 

మీన రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉత్తమ పని కనబరుస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మంచి లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మీరు కొన్ని కొత్త ప్రయత్నాలను ఫాలో అవొచ్చు. సామాజిక సేవ ద్వారా మీరు గౌరవం పొందుతుంది.  మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. కొన్ని రాజకీయ చర్చల గురించి చర్చించడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది.

Published at : 24 Oct 2022 05:12 AM (IST) Tags: Horoscope Today astrological predictions for October 24th October 2022 horoscope today's horoscope 24th October 2022 24th October 2022 Rashifal

సంబంధిత కథనాలు

Horoscope Today 3rd  December 2022:  ఈ రాశివారు ధీమా వీడకపోతే  వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Horoscope Today 3rd December 2022: ఈ రాశివారు ధీమా వీడకపోతే వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Love Horoscope Today 2nd December 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Love Horoscope Today 2nd December 2022:  ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Horoscope Today 2nd December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd  December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా