Horoscope Today 24th December 2022: ఈ రాశివారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు, డిసెంబరు 24 రాశిఫలాలు
Rasi Phalalu Today 24th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Horoscope Today 24th December 2022: ఈ రాశివారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు, డిసెంబరు 24 రాశిఫలాలు Horoscope Today 24th December 2022 Rasi Phalalu Astrological Prediction for Scorpio , Gemini and Other Zodiac Signs Horoscope Today 24th December 2022: ఈ రాశివారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు, డిసెంబరు 24 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/23/9c9684e44b630c6774ba329e35dfd80d1671797006144217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Today 24th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మేషరాశివారికి ఉద్యోగం మారాలనే ఆలోచన వస్తుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపం తగ్గించుకోండి..ఓపికగా పనిచేయండి. రిస్క్ తీసుకోవద్దు.
వృషభ రాశి
వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ప్రాజెక్ట్ కోసం కొత్త భాగస్వాములను వెతుకుతారు. ఇంట్లో ఉన్న సభ్యులు ఓ విషయంలో ఆందోళన చెందుతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. రానిబాకీలు తిరిగి పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి
మిథున రాశి
మిథున రాశి వారు తరచూ కొత్త ప్రణాళికలు వేస్తారు కానీ కొన్ని కారణాల వల్ల వాటిని అమలుచేయలేకపోతారు. ఈ రాశివారికి తండ్రితో మంచి అనుబంధం ఉంటుంది. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. మీలో ఉన్న భయం, ఆందోళన చికాకు తగ్గే అవకాశం ఉంది.
Also Read: న్యూ ఇయర్ వచ్చేస్తోంది, కొత్త క్యాలెండర్ వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశగా పెట్టాలంటే!
కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి శనివారం ముఖ్యమైన రోజు. కొత్తవారితో జాగ్ర్తతగా ఉండండి. ఏదైనా దైవ ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపిస్తారు. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. రాజకీయంగా మద్దతు లభిస్తుంది. వివాదానికి దూరంగా ఉండాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి.
సింహ రాశి
ఈ రాశివారికి రోజు ప్రారంభంలో సోమరితనం ఆవహిస్తుంది. మంచి వ్యక్తులను కలుస్తారు. వాహనాలు, యంత్రాలు నుంచి ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త. ఈ రోజు మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. అతి విశ్వాసం హానికరం అని తెలుసుకోండి
కన్యా రాశి
ఈ రాశికి చెందినవారు ఎవ్వరి దగ్గరా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఈ రాశివారు తమ మాటలను అదుపులో ఉంచుకోవాలి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇల్లు మారడం వల్ల ప్రయోజనం ఉంటుంది
Also Read: 2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు
తులా రాశి
ఈ రాశి వారు కెరీర్ విషయంలో అంత నిజాయితీగా ఉండరు. పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆస్తి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రయోజనం పొందుతారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అలసట ఇబ్బందిని కలిగిస్తుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు కొంత ఉపశమనంగా ఫీలవుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు.ఈరోజు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. చిరు ధాన్యాలపై పెట్టుబడి శుభప్రదం అవుతుంది. అకస్మాత్తుగా నష్టం వచ్చే అవకాశం ఉంది వ్యాపారులు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు మనోధైర్యంతో కెరీర్లో ముందుకు సాగుతారు. తల్లిదండ్రుల అనారోగ్యం బాధపెడుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడవలసి రావచ్చు.
మకర రాశి
ఈ రోజు కార్యాలయంలో అధికారులతో వివాదాలు తలెత్తవచ్చు. మీ పొరపాటు వల్ల పని పూర్తి కాకుండానే చెడిపోవచ్చు. చర్చల తర్వాత చేసే పనులు నెరవేరుతాయి. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక లాభం పొందుతారు. ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతుంది.
కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారు పెద్దల మాట విని నిర్ణయం తీసుకోవాలి. పాత ఇబ్బందుల నుంచి బయటపడతారు. పాత స్నేహితుడు-బంధువులను ఈ రోజు కలుస్తారు. స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకోవచ్చు.మీ ఆత్మగౌరవం పెరుగుతుంది.
మీన రాశి
ఈ రాశి వారు ఎవ్వరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు..కార్యాలయంలో ఉద్యోగులు తమ హక్కులను దుర్వినియోగం చేయొద్దు. వ్యాపార ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. మీ తెలివితక్కువతనం వల్ల హాని జరిగే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)