News
News
వీడియోలు ఆటలు
X

ఏప్రిల్ 24 రాశిఫలాలు - ఈ రాశులవారు శారీరకంగా,మానసికంగా అలసిపోతారు

Rasi Phalalu Today 24th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

ఏప్రిల్ 24 రాశిఫలాలు

మేష రాశి

ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  బయట ఫుడ్ కి దూరంగా ఉండడం మంచిది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దూకుడుగా వ్యవహరించవద్దు. మీ మాటతీరుపై సంయమనం పాటించండి. కుటుంబం, స్నేహితులతో మంచి సమయం గడుపుతారు.

వృషభ రాశి

కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. అందం, ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. కార్యాలయంలో సీనియర్లతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మధ్యాహ్నం తర్వాత మీరు సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. కొత్త స్నేహంతో మనసు ఆనందంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఏ పనిలోనూ తొందరపడకండి.

మిథున రాశి

 వ్యాపారులకు ఈ రోజు చాలా బాగా గడిచిపోతుంది.  అవసరమైన చర్చల్లో బిజీగా ఉంటారు. పని భారం పెరగడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.  మిత్రులతో ఆహ్లాదకరమైన సమావేశం అవుతుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తొలగిపోతాయి.

Also Read: ఏప్రిల్ ఆఖరి వారం 7 రాశులవారికి అద్భుతం - 5 రాశులవారికి కొంత నిరుత్సాహం!

కర్కాటక రాశి

మీరు ఈరోజు శారీరకంగా అలసిపోతారు మానసికంగా ఆందోళన చెందుతారు. అధిక కోపం కారణంగా, ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు అంతలోనే సర్దుకుపోతరు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండొచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో భాగస్వామి లేదా అధికారితో అర్థవంతమైన చర్చ ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాల కారణంగా పెట్టుబడుల గురించి చర్చించవచ్చు. కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం సమయం బాగుంటుంది.

సింహ రాశి

వ్యాపార రంగంలో ఉండేవారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని బాగా బ్యాలెన్స్ చేస్తారు. పనిభారం పెరగడం వల్ల ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. స్నేహితుడిని కలవడం వల్ల రోజంతా ఆనందంగా గడిచిపోతుంది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. సామాజిక సేవలో పాల్గొనాలనే కోరిక నెరవేరుతుంది.

కన్యా రాశి

ఈ రోజు మీరు ఏదైనా విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు. జ్యోతిష్యం లేదా ఆధ్యాత్మిక విషయాలపై మీ దృష్టి మళ్లుతుంది. ఎవరితోనూ వివాదాలు రాకుండా ఈరోజు తెలివిగా మాట్లాడండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మీరు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. చిన్న లాభంకోసం భారీ పెట్టుబడులు పెట్టొద్దు.

తులా రాశి

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటారు.ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. మధ్యాహ్నం తర్వాత స్నేహితులు,  బంధువులతో విహారయాత్రకు వెళతారు. కోపాన్ని తగ్గించుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనికి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు రోజు సాధారణంగా ఉంటుంది.

Also Read: మేషరాశిలో బుధుడు తిరోగమనం, 4 రాశులవారికి ఊహించనంత మంచి జరుగుతుంది!

వృశ్చిక రాశి 

ఈ రాశి ఉద్యోగులు ఆర్థికంగా లాభపడతారు. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. పనిలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు,  రహస్య శత్రువులు వారి ప్రణాళికలలో విజయవంతం కాలేరు. మిత్రులను కలుస్తారు. ఈరోజు కుటుంబ అవసరాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఇంటి మరమ్మతు కోసం ఖర్చు చేయవచ్చు.

ధనుస్సు రాశి 

ఈ రోజు ప్రారంభం అద్భుతంగా ఉంటుంది.మధ్యాహ్నం తర్వాత మనసులో ఏదో ఆందోళన ఉంటుంది. ఆర్థిక లాభం కోసం  ఓ సమావేశానికి హాజరు కావచ్చు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనవసర ప్రసంగాన్ని నియంత్రించండి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు కొత్త పనులు ప్రారంభించకండి. మీరు కార్యాలయంలో మీ పనిపై మాత్రమే దృష్టి పెడితే కచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు మంచి రోజు. వైవాహిక జీవితం బావుంటుంది

మకర రాశి

ఈ రోజు మీరు చాలా అశాంతిగా ఉంటారు. కచ్చితమైన నిర్ణయం తీసుకోలేరు అది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ రోజు అదృష్టం పెద్దగా కలసిరాదు... దీని కారణంగా మీరు చాలా నిరాశకు గురవుతారు. పిల్లల గురించి ఆందోళన చెందుతారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు. శారీరకంగా అనారోగ్యంగా ఉండొచ్చు. శత్రువులతో వాగ్వాదానికి దిగకపోవడం శ్రేయస్కరం. 

కుంభ రాశి

ఈ రోజు మీరు మానసికంగా అశాంతితో ఉంటారు. ఆర్థిక విషయాలలో గందరగోళానికి గురవుతారు. తల్లి నుంచి ప్రేమను అనుభవిస్తారు. స్త్రీలు సౌందర్య సాధనాలు, బట్టలు లేదా ఆభరణాల కొనుగోలు కోసం డబ్బు ఖర్చుచేస్తారు.  విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. స్వభావంలో కోపం ఉండవచ్చు.పని సకాలంలో పూర్తి చేయకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు.

మీన రాశి

అనుకున్న పనిలో విజయం సాధించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు ఉత్తమమైన రోజు. ఈ రోజు మీ ఆలోచనలలో స్థిరత్వం ఉంటుంది...దీని కారణంగా మీరు ఏ పనినైనా చక్కగా పరిష్కరించగలుగుతారు. కళాకారులు తమ కళలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో మరింత సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. స్నేహితులతో ఒక చిన్న పర్యటనకు వెళతారు. శత్రువులపై విజయం ఉంటుంది.

Published at : 24 Apr 2023 05:31 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today 20th APril Horoscope 22nd April Astrology Horoscope for 24th April

సంబంధిత కథనాలు

Ashwini Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!

Ashwini Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!

జూన్ 8 రాశిఫలాలు: హోదా, గౌరవం తగ్గించే పనులకు ఈ రాశివారు దూరంగా ఉండాలి

జూన్ 8 రాశిఫలాలు:  హోదా, గౌరవం తగ్గించే పనులకు ఈ రాశివారు దూరంగా ఉండాలి

Mysterious Bijli Mahadev : పిడుగుపాటుకి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కుంటుంది, అదే అక్కడి విశిష్టత!

Mysterious Bijli Mahadev  : పిడుగుపాటుకి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కుంటుంది, అదే అక్కడి విశిష్టత!

Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!

మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!