అన్వేషించండి

మే 23 రాశిఫలాలు, ఈ రాశివారు జీవితానికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు

Rasi Phalalu Today 23rd May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మే 23 రాశిఫలాలు

మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రోజు ఈ రాశి వ్యాపారులకు పెద్ద ఆర్డర్ వస్తుంది. జీవితానికి సబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక సేవలో ఉండే వ్యక్తులకు గౌరవం పెరుగుతుంది. మీ ప్రవర్తనను తగిన గుర్తింపు లభిస్తుంది.  ఉద్యోగులకు మంచి సమయం. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆరోగ్యం, ఆదాయం బాగానే ఉంటుంది.

వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)

ఈ రాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఇష్టమైన కోర్సులలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులు పనితీరుకి అధికారులతో ప్రశంసలు అందుకుంటారు.  న్యాయవాద వృత్తిలో ఉండేవారికి మంచిరోజు. ప్రారంభించిన పనులను పూర్తిచేయగలుగుతారు. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. 

మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఈ రోజు మీకు అద్బుతమైన రోజు అవుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి సమాజంలో  గౌరవం పెరుగుతుంది. కొత్త ఉద్యోగంలో చేరిన వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. స్త్రీలు ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యులనుంచి అన్ని విధాలా సహాయం అందుతుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఉత్సాహ పడతారు. ఈ రోజు కొన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

Also Read: ఈ వస్తువులు మీ చేతిలోంచి జారిపడితే అశుభం

కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. క్రీడాకారులు ఉత్సాహంగా ఉంటారు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కొత్త ప్రణాళికలు అమలు చేయాలనే ఉత్సాహంతో ఉంటారు. కుటుంబంతో సమయం కేటాయిస్తారు. 

సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

ఈ రోజు మీ జీవితంలో కొత్త మార్పు రాబోతోంది. ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో పెంపు ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలను పొందుతారు. విద్యార్థులు ఈరోజు కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఉత్సాహం చూపుతారు. నిరుద్యోగులు ఈ రోజు శుభవార్త వింటారు. మహిళలకు సంతోషకరమైన రోజు. జీవిత భాగస్వామి మీ మాటలకు ప్రాధాన్యత ఇస్తారు. సన్నిహితులతో కొనసాగుతున్న విభేదాలు ఈరోజుతో ముగియనున్నాయి.

కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఈ రోజు మీకు ఒత్తిడి లేకుండా గడిచిపోతుంది. కార్యాలయంలో మీ పనితీరు మీపై విశ్వాసాన్ని పెంచుతుంది. మోడలింగ్ రంగానికి చెందిన వ్యక్తులకు మంచి సమయం. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ కెరీర్‌లో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలను పొందుతారు. ఎవరికైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు.  మతపరమైన వ్యవహారాలకు ఖర్చుచేస్తారు. సమాజంలో మంచి ఇమేజ్ పొందుతారు. 

Also Read: ఈ వారం ఈ రాశులవారు ఆదాయాన్ని మెరుగుపర్చుకునే ప్రయత్నాల్లో ఉంటారు

తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రోజు మీరు కొత్త కోర్సులో చేరేందుకు ప్లాన్ చేసుకుంటారు. పనిలో మీ లక్ష్యాలు సాధించడంలో విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. మీరు చేసే పనికి - కుటుంబ జీవితానికి మధ్య సమతుల్యతను కాపాడుకుంటారు. కొత్త పనులు ప్రారంభించి ముందుకు సాగుతారు. ఈ రాశి ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. 

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రాశివారు కార్యాలయంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.  అకస్మాత్తుగా మీకు ప్రియమైన బంధువు మీ ఇంటికి చేరుకుంటారు. విద్యార్థులకు మంచి రోజు. వ్యాపారంలో లాభాలొస్తాయి. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన చిక్కులు తొలగిపోతాయి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. టెన్షన్ తగ్గించుకోండి. 

ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రోజు ఈ రాశివారు అనుకోని ప్రయాణం చేసే అవకాశం ఉంది. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి.  పాత స్నేహితుడిని కలుస్తారు, పాత జ్ఞాపకాలు ఈరోజు రిఫ్రెష్ అవుతాయి. ఉపాధ్యాయులకు ఈ రోజు బావుంటుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఆస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. అనవసర మాటలతో సమయం వృధా చేయవద్దు. రోజంతా సంతోషంగా ఉంటారు.

మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులు పనిపై దృష్టి సారించాలి. చిన్నపాటి వ్యాయామంపై శ్రద్ధ పెట్టాలి. కంటి సమస్యతో బాధపడతారు. అనుకోని ఇబ్బందులు తొలగిపోయి కొంత ప్రశాంతంగా ఉంటారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు.

కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

ఈ రోజు మీకు గొప్ప రోజు కానుంది. సన్నిహిత మిత్రునికి సహాయం చేస్తారు. విదేశాల్లో ఉన్న మీ స్నేహితుడు మిమ్మల్ని కలవడానికి రావొచ్చు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెడతారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో పెద్దల ప్రేమను పొందుతారు.  మీ కుటుంబ సభ్యులు మీకు సర్ ప్రైజ్ పార్టీ ఇస్తారు. ఆనందం పెరుగుతుంది. 

మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రోజు మీకు అద్భుతంగా ప్రారంభమవుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. నిర్మాణ పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏదైనా పెద్ద ప్రణాళికలో విజయం సాధిస్తారు. పెద్దల ప్రేమ, ఆశీస్సులు మీకు లభిస్తాయి. మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget