News
News
X

Horoscope Today 21st October 2022: ఈ రాశివారి జీవితంలోకి కొత్త అతిథి ప్రవేశించే అవకాశం, అక్టోబరు 21 రాశిఫలాలు

Horoscope Today 21th October: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope Today 21st October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మీ ధైర్యసాహసాలు, శక్తి పెరుగుతుంది. అవివాహితుల జీవితంలోకి ఒక కొత్త అతిథి  ప్రవేశించే అవకాశం ఉంది.  మీ ఆలోచనలో సానుకూలతను కొనసాగించాలి. కుటుంబ విషయాలు బయటకు మాట్లాడొద్దు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

వృషభ రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహాయంతో మీరు ఒక కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏ పనీ చేయాలని అనిపించదు..ఆ పని కోసం పట్టుబట్టి చేయాల్సిన అవసరమూ లేదు. మీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు మాత్రం స్పందించాల్సి ఉంటుంది. 

మిథున రాశి
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు అవుతుంది. సౌకర్యాలు పొందడంలో సంతోషంగా ఉంటారు. మీ స్నేహితుడు ఒక రకమైన సహాయం కోసం మిమ్మల్ని అడగవచ్చు. విద్యార్థులకు మానసిక భారం తగ్గుతుంది.  మీ కుటుంబ సభ్యులలో ఒకరు రాజీపడటానికి మీ ఇంటికి రావచ్చు. మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబంలో సభ్యుల గురించి చెడుగా భావించవద్దు. 

News Reels

కర్కాటకరాశి
ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అంతగా కలసిరాదు. ప్రణాళిక లేకుండా ముందడుగు వేస్తే నష్టపోతారు. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏవైనా కేసులు కోర్టులో జరుగుతున్నట్లయితే వాటి నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ఆన్ లైన్ లో పనిచేసే వ్యక్తులు పెద్ద ఆర్డర్ పొందడంతో సంతోషంగా ఉంటారు. మీ ఇంటి నిర్వహణ, పరిశుభ్రతపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. 

Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!

సింహ రాశి
ఈ రోజు మీరు సృజనాత్మక పనులతో కనెక్ట్ అయ్యే రోజు. మీ జీవితభాగస్వామి కోసం మీరు  కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. పిల్లల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు కొన్నింటిని పూర్తిచేయకపోతే మరింత ఇరుక్కుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది

కన్యా రాశి
ఈ రోజు మీరు దాతృత్వ పనిలో గడుపుతారు..మంచి పేరుసంపాదిస్తారు.  ఏదైనా చట్టపరమైన పని చేసేటప్పుడు దాని పాలసీ నియమాలను పూర్తిగా పాటించాలి లేదంటే శిక్ష అనుభవించకతప్పదు. ఉద్యోగులకు మంచి రోజు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. 

తులా రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. కుటుంబంలోసమస్యలు పరిష్కరించుకుంటారు. మీ మునుపటి పొరపాట్లలో ఏవైనా మీకు ఒక సమస్యగా మారవచ్చు. సంపాదనపై  పూర్తిగా దృష్టి సారించాలి. ఎవ్వరికీ ఎలాంటి వాగ్ధానం చేయొద్దు. 

వృశ్చిక రాశి
ఈ రోజు మీ ప్రభావం, కీర్తి పెరుగుతుంది. పనిప్రాంతంలో మీ స్థానం పెరుగుతుంది. వ్యాపార కార్యకలాపాలు చాలా వ్యత్యాసాన్ని కలిగిస్తాయి.కుటుంబ సభ్యులనుంచి సంతోషకరమైన వార్త వింటారు. ఉద్యోగులకు మంచిరోజు.తల్లిదండ్రులు మీపై కొన్ని బాధ్యతలను ఉంచవచ్చు.

ధనుస్సు రాశి
ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. ఏ పని చేసినా అదృష్టం మీ వెంటే ఉంటుంది..సక్సెస్ అవుతారు. మీ ప్రణాళికలు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారికి శుభసమయం. 

Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!

మకర రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆహారాన్ని నియంత్రిస్తూనే సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మీ జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. కుటుంబంలో ఓ శుభకార్యం నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులుండవు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకోండి.

కుంభ రాశి
ఈ రోజు మీకు ఒక మోస్తరు ఫలవంతమైన రోజు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మునుపటి కన్నా ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందితే మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి మీరు పార్ట్ టైమ్ ఉద్యోగం  చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు శుభసమయం.

మీన రాశి
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. అనుభవజ్ఞుడైన వ్యక్తిని అడగడం ద్వారా మాత్రమే మీరు డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది, లేకపోతే మీకు తరువాత సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగం చేసే వ్యక్తులు  మంచి గుర్తింపు పొందుతారు.  మీ సహోద్యోగుల  నమ్మకాన్ని గెలుచుకోవడం ద్వారా మీరు మీ క్లిష్టమైన పనుల్లో దేనినైనా సులభతరం చేయగలరు. సంపాదన చూసుకుని ఖర్చు చేయడం మంచిది.

Published at : 21 Oct 2022 05:18 AM (IST) Tags: Horoscope Today astrological predictions for October today's horoscope 21st October 2022 21st October 2022 horoscope 21st October 2022 Rashifal

సంబంధిత కథనాలు

Signs Of Death: మరణం సమీపించే ముందు సంకేతాలివే, స్వయంగా శివుడు పార్వతికి చెప్పినవి!

Signs Of Death: మరణం సమీపించే ముందు సంకేతాలివే, స్వయంగా శివుడు పార్వతికి చెప్పినవి!

Love Horoscope Today 26th November 2022: ఈ రాశివారు పాత ప్రేమికులను ఆకస్మికంగా కలుస్తారు!

Love Horoscope Today 26th November 2022:  ఈ రాశివారు పాత ప్రేమికులను ఆకస్మికంగా కలుస్తారు!

Daily Horoscope Today 26th November 2022: ఈ నాలుగు రాశులవారిపై శని అనుగ్రహం ఉంటుంది, నవంబరు 26 రాశిఫలాలు

Daily Horoscope Today 26th November 2022: ఈ నాలుగు రాశులవారిపై శని అనుగ్రహం ఉంటుంది, నవంబరు 26 రాశిఫలాలు

Spirituality: హవన భస్మాన్ని నీటిలో వదులుతున్నారా? ఎంత నష్ట పోతున్నారో తెలుసా?

Spirituality:  హవన భస్మాన్ని నీటిలో వదులుతున్నారా? ఎంత నష్ట పోతున్నారో తెలుసా?

Spirituality: మానవ శరీర నిర్మాణానికి - 14 లోకాలకు ఉన్న సంబంధం ఇదే

Spirituality: మానవ శరీర నిర్మాణానికి - 14 లోకాలకు ఉన్న సంబంధం ఇదే

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి