కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటివరకు - ముఖ్యమైన రోజులేంటి!



సాధారణంగా దీపావళి పండుగ చేసుకున్న రాత్రి తెల్లవారినప్పటి నుంచీ కార్తీకమాసం ప్రారంభం అవుతుంటుంది. కానీ ఈ ఏడాది దీపావళి మర్నాడు కాకుండా రెండో రోజు నుంచి కార్తీకమాసం మొదలవుతోంది.



సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే నెల ప్రారంభానికి సూచన. ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మమూహూర్తంలోనే కదా. మంగళవారం సాయంత్రం సూర్యస్తమయ సమయంలో మొదలైంది పాడ్యమి తిథి. అందుకే అక్టోబరు 26 బుధవారం నుంచి కార్తీకమాసం మొదలు



శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఈ ఏడాది అక్టోబరు 26 నుంచి నవంబరు 23 వరకూ



అక్టోబరు 26 బుధవారం కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి
అక్టోబరు 27 గురువారం యమవిదియ - భగినీహస్త భోజనం



అక్టోబరు 29 శనివారం నాగుల చవితి
అక్టోబరు 31 కార్తీకమాసం మొదటి సోమవారం



నవంబరు 1 మంగళవారం కార్తావీర్యజయంతి
నవంబరు 3 గురువారం యాజ్ఞవల్క జయంతి



నవంబరు 4 శుక్రవారం మతత్రయ ఏకాదశి
నవంబరు 5 శనివారం క్షీరాబ్ది ద్వాదశి



నవంబరు 6 ఆదివారం వైకుంఠ చతుర్థశి
నవంబరు 7 సోమవారం - కార్తీకమాసం రెండో సోమవారం, జ్వాలా తోరణం



నవంబరు 8 మంగళవారం - కార్తీకపూర్ణిమ ( చంద్రగ్రహణం)
నవంబరు 11 శుక్రవారం - సంకటహర చతుర్థి



నవంబరు 14 కార్తీకమాసం మూడో సోమవారం
నవంబరు 20 ఆదివారం మతత్రయ ఏకాదశి



నవంబరు 22 మంగళవారం మాస శివరాత్రి ( కార్తీకమాసం ఆఖరి రోజు)
నవంబరు 24 గురువారం పోలిస్వర్గం
(Images Credit: Google)