దీపం సాక్షాత్తూ భగవంతుని స్వరూపం అంటారు మన పెద్దలు. దీపం కింది భాగాన్ని బ్రహ్మగా భావిస్తారు. స్తంభాన్ని విష్ణువుగా, ప్రమిదను శివుడిగా కొలుస్తారు. దీపంలో పెట్టే ఒత్తిని లక్ష్మీ, వెలుగును సరస్వతిగా చెబుతుంటారు. కార్తీక దీపారాధన వల్ల సర్వపాపాలు హరింపబడి సద్గతి లభిస్తుందని, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. వరి, గోధుమ పిండితో చేసిన దీపాల్లో లేదా మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి పైడి వత్తులతో అసంఖ్యాకంగా దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు దామోదర మూర్తిని స్మరిస్తూ దీపాన్ని వెలిగించాలి. ఆ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మలేని స్థితిని పొందుతారని నమ్మకం. కార్తీకమాసంలో దీపారాధన చేయలేనివారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్ధశి, పౌర్ణమిరోజుల్లో దీపారాధన చేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కార్తీకమాసంలో దీపారాధన చేయలేనివారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్ధశి, పౌర్ణమి రోజుల్లో దీపారాధన చేయాలి. ద్వాదశి, చతుర్ధశి, పౌర్ణమి రోజుల్లో దీపారాధన వల్ల వైకుంఠప్రాప్తి కలుగుతుందని నమ్మకం. Images Credit: Pexels