అన్వేషించండి

జూన్ 20 రాశిఫలాలు: ఆహారంపై అశ్రద్ధ ప్రభావం ఈ రాశులవారి ఆరోగ్యంపై చూపిస్తుంది!

Horoscope Prediction 20th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope Predictions in Telugu

మేష రాశి

ఈ రోజు అదనపు బాధ్యతలు తీసుకోవద్దు. కార్యాలయంలో మీరు చెప్పే విషయాలను సహోద్యోగులు చెడు భావనతో తీసుకునే అవకాశం ఉంది.  ఓపికతో, విచక్షణతో పనిచేయడం చాలా ముఖ్యం. ఉద్యోగులు, వ్యాపారులు కొత్త ఆలోచనలు చేయవద్దు..చేయాల్సిన పనిపట్ల నిర్లక్ష్యం వద్దు. కుటుంబ విషయాలలో బయటి వ్యక్తుల జోక్యాన్ని సహించవద్దు. 
 
వృషభ రాశి

ఈ రోజు వ్యాపారం స్థిరంగా సాగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్తికావాల్సిన కొన్ని పనులు రాజకీయ జోక్యంవల్ల నిలిచిపోతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.   

మిథున రాశి

ఈ రోజు మీరు నూతన ఒప్పందాన్ని చేసుకోవచ్చు. స్నేహితులు, సన్నిహితులు తప్పుచేస్తే క్షమించి ప్రేమగా వివరించేందుకు ప్రయత్నించండి. మీ జీవనశైలి మెరుగుపడుతుంది.  కుటుంబ సభ్యులపట్ల అభిమానం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలుంటాయి.

Also Read: ద్వాదశ (12) ఆదిత్యులకు ద్వాదశ ఆసనాలు - సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆనందం!

కర్కాటక రాశి

ఈ రోజు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని రకాల మార్పుల గురించి ఆలోచిస్తారు. ప్రేమ సంబంధాల విషయంలో కుటుంబ వైఖరి సహకరిస్తుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్య ప్రభావం ఆరోగ్యంపై చూపిస్తుంది.  ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు తమ ప్రయత్నాలను వేగవంతం చేయవలసి ఉంటుంది.
 
సింహ రాశి 

ఉద్యోగం, కుటుంబంలో సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం అవుతాయి.కుటుంబానికి సమయం కేటాయించండి. వ్యసనాలకి డబ్బు భారీగా ఖర్చుచేస్తారు. గతంలో చేసిన కొన్ని తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన సమయం ఇది.  

కన్యా రాశి

ఈ రోజు మీ జీవిత భాగస్వామి సలహాతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో  క్రమేణా పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!
 
తులా రాశి

ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. ఈ రోజు కొత్తగా చేసే ఏ పని అయినా సానుకూల ఫలితాలనిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు సంబంధించిన చర్చలుంటాయి. మీకు నచ్చని వ్యక్తులను కలవాల్సి వస్తుంది. మీ లక్ష్యాలవిషయంలో అప్రమత్తంగా ఉండాలి. 
 
వృశ్చిక రాశి

నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది...మంచి ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగుల పనితీరుకి కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మీ ప్రియమైనవారినుంచి బహుమతులు లభిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ స్నేహితులు అనుకున్నవారే మిమ్మల్ని మోసం చేస్తారు. 

ధనస్సు రాశి

ఈ  రోజు సమయాన్ని వృథా చేయకండి. మీరు పాత సమస్యల గురించి కొత్త ఆందోళనలు పెట్టుకోవద్దు.  ఆర్థిక సంబంధిత విషయాల్లో నిరాశ చెందుతారు. వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది. కార్యాలయంలో ప్రత్యర్థులు మీపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు కానీ మీ తెలివితేటలతో వారికి చెక్ పెడతారు.

మకర రాశి

ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. కార్యాలయంలో మీ సలహాకు విలువ పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. చేపట్టిన కొత్త ప్రాజెక్టుల కోసం కొంచెం కష్టపడినా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వాహనాన్ని వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుంభ రాశి

ఈ రాశి ఉద్యోగులు ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తారు. మీ వర్కింగ్ స్టైల్ మారుతుంది. పాత ఆలోచనలు పక్కనపెట్టి నూతన ఆలోచనలు అనుసరిస్తారు. గ్రహస్థానం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టే నూతన పెట్టుబడులు భవిష్యత్ లో కలిసొస్తాయి.  అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది

మీన రాశి 

ఈ రోజు ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వారు తమ యాజమాన్యంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.  సమావేశాలతో బిజీగా ఉంటారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా కోపాన్ని నియంత్రించుకోవాలి. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న చట్టపరమైన విషయాలు ఇంకొంతకాలం సాగుతాయి. 

Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
Embed widget