By: RAMA | Updated at : 20 Jan 2023 06:03 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope Today 20th January 2023 (Image Credit: freepik)
20th January 2023 Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీరు కొన్ని కొత్త అవకాశాలతో పాటు శుభవార్త వింటారు. మీ పనిని ఎంజాయ్ మెంట్ తో కలసి చూడకండి. వ్యక్తిగత, గోప్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయవద్దు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోండి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృషభ రాశి
ఈ రోజు మీకు ఒడిదొడుకులతో నిండిన రోజు. ఆరోగ్యం కాస్త బలహీనంగా ఉన్నా పనిలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.
మిథున రాశి
ఈ రోజు మీకు మునుపటి కన్నా బావుంటుంది. కొంచెం కష్టపడితే పెద్ద లాభాలు పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోష సమయం గడుపుతారు. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
Also Read: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!
కర్కాటక రాశి
ఈ రోజు నిరుద్యోగులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మీరు తలపెట్టిన పనులకు మంచి ఫలితం పొందుతారు. ఇంటి బాధ్యతలు నెరవేర్చడంలో ఒకరికొకరు సహకరిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి
ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఒక కొత్త ఆలోచన మిమ్మల్ని ముందుకు నడిపించడానికి సహాయపడుతుంది. ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన ముందుకు వెళుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి
కన్యా రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. మీ స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. మీ పనిలో కొత్తదనం ఉంటుంది.
Also Read: కలలో ఇవి కనిపిస్తే మీ తలరాత మారబోతోందని అర్థం
తులా రాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. కొత్త ప్రణాళికలు కూడా అమలు చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఫలిస్తుంది. భార్యాభర్తలు కూడా ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు.
వృశ్చిక రాశి
ఖర్చులపై నియంత్రణ కోసం మీ బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవాలి. మీ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. ఎవరినీ బాధపెట్టే మాటలు మాట్లాడొద్దు. ఆలోచించి మాట్లాడండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. మిమ్మల్ని కలిసేందుకు స్నేహితులు రావొచ్చు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సంపదను పెంచుకునే ఏ పథకమైనా విజయవంతమవుతుంది.
మకర రాశి
ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ క్లోజ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తారు..జాగ్రత్త పడండి. కొన్ని ఇబ్బందులు తప్పవు...కానీ..వాటిని క్రమంగా అధిగమిస్తారు. మీ మంచి పనుల వల్ల సమాజంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది.
కుంభ రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు..కోర్కెలు నెరవేరుతాయి. మనసంతా సంతోషంగా ఉంటుంది.
మీన రాశి
ఈ రోజు మీరు కొన్ని కొత్త పురోగతి మార్గాలను పొందుతారు. కొంతమంది మంచి వ్యక్తులను కలవడం మీ రోజును మెరుగుపరుస్తుంది. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు. వ్యాపారాభివృద్ధి ఉంటుంది.
Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు
February 6 to 12 Weekly Horoscope 2023: ఈ వారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది, ఫిబ్రవరి 6 నుంచి 12 వారఫలాలు
Weekly Horoscope 6 to 12 February 2023: ఈ రాశులవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, లాభ-నష్టాలు సమానంగా ఉంటాయి
Lalita Jayanti 2023:మాఘ పౌర్ణమి రోజే శ్రీ లలితా జయంతి, ఈ రోజు మీరు ఆచరించాల్సిన విధులివే!
Tungnath Temple History: ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం - పరమేశ్వరుడి బాహువులు పడిన ప్రదేశం ఇది
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్ వేసుకొని భర్తతో కాపురం!