అన్వేషించండి

జూన్ 22 రాశిఫలాలు - ఈ రాశివారు మాటతీరు, ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు

Rasi Phalalu Today June 22nd : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

జూన్ 22 రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశివారు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వివాహ సంబంధాలపై దృష్టి సారిస్తారు. వాదనలు వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రవర్తనలో మార్పు ఉంటుంది ఏ విషయాన్నికూడా సీరియస్ గా తీసుకోరు. ఉత్సాహంగా ఉంటారు . వృత్తి నిపుణులు బాగా రాణిస్తారు. స్వార్థం, సంకుచిత మనస్తత్వాన్ని విడిచిపెట్టండి. పెద్దల నుంచి సలహాలు స్వీకరించండి. భవనాలు, వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తారు. భౌతిక విషయాలపై దృష్టి ఉంటుంది. పరిస్థితులు బాగానే ఉంటాయి.

వృషభ రాశి  

ఈ రాశివారికి ఈ రోజు అవసరమైన సమాచారం అందుతుంది.  సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపార వ్యవహారాలను వేగంగా పూర్తి చేస్తారు. స్వల్ప దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఔన్నత్యాన్ని పెంచుకుంటారు. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి.  పెద్దలతో సహవాసంచేస్తారు. ఇంటర్వ్యూలో మంచి ఫలితం సాధిస్తారు.  ఇతరుల సహాయంతో పనులలో విజయం సాధిస్తారు. మనసుకు బలం చేకూరుతుంది. వృత్తి వ్యాపారాలలో చురుకుగా ఉంటారు. వాదనలు చర్చకు దూరంగా ఉంటారు. 

మిథున రాశి  

కుటుంబంలో పండగ వాతావరణం ఉంటుంది. ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందకండి. మీ ప్రసంగంతో అందర్ని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొత్త సంబంధాలు బలపడతాయి. ముఖ్యమైన ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత విషయాలు పరిష్కారమవుతాయి. గౌరవం పెరుగుతుంది. రక్త సంబంధీకులతో బంధం మరింత బలపడుతుంది. మీరు పలు  రంగాలలో ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు. సేవింగ్స్ బ్యాంకింగ్ పనుల పట్ల ఆసక్తి కనబరుస్తారు. సంకోచం,బిడియం తొలగిపోతుంది. 

Also Read: యోగాకి మాత్రమే కాదు సంగీతం,నాట్యం సహా ప్రతి విద్యకూ పరమేశ్వరుడే ఆద్యుడు!

కర్కాటక రాశి 

మీరు సృజనాత్మకత వైపు అడుగులేస్తారు. మోడరన్ విషయాలపట్ల ,కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. మీపై మీరు ఎక్కువ శ్రద్ధ  కనబరుస్తారు. ప్రియమైనవారితో సంతోషంగా ఉంటారు.  ధైర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యమైన పనులు నిర్వహిస్తారు. సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. శుభప్రతిపాదనలు అందుతాయి. సానుకూలత ఉంటుంది. భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది. ప్రసంగంతో,  ప్రవర్తనతో అందర్నీ ఆకర్షిస్తారు. ముఖ్యమైన విషయాలను ముందుకు తీసుకువెళతారు. గౌరవం పెరుగుతుంది. 

సింహ రాశి  

ముఖ్యమైన సమాచారం అందుతుంది. న్యాయపరమైన విషయాల్లో సహనం ప్రదర్శిస్తారు. సుదూర దేశానికి వెళ్లే అవకాశం ఉంది. అందరి గౌరవాన్ని నిలబెడతారు. స్మార్ట్ వర్క్ పెరుగుతుంది. అప్పుల బారినుంచి తప్పించుకుంటారు. సంబంధాలు మెరుగుపడతాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు.  ప్రణాళికా వ్యయం పెరుగుతుంది. బయటి విషయాలలో చురుకుదనం ఉంటుంది. వ్యవస్థను గౌరవిస్తారు. కార్య  విస్తరణ ప్రణాళికలు ఊపందుకుంటాయి. లావాదేవీల్లో స్పష్టత ఉంటుంది. దుండగులకు దూరంగా ఉండండి. 

కన్యా రాశి  

వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో చురుకుదనం ప్రదర్శిస్తారు. అన్నిటా విజయం సాధిస్తారు. వ్యాపార ప్రణాళికలు అభివృద్ధి చెందుతాయి. అధికారులతో సమావేశం కానున్నారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. పోటీలలో విజయం సాధిస్తారు. విలువైన, ఆకర్షణీయమైన ఆఫర్లు పొందుతారు.  వర్కుప్లేస్ లో ఎక్కువ సమయం గడుపుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈ కారణంగా పని వేగం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలలో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరుస్తారు.
   
తులారాశి 

పాలనా వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపారంలో నమ్మకంగా పని చేస్తారు. అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు.నూతన ఆర్థిక వనరులు ఏర్పడతాయి. ముఖ్యమైన ప్రతిపాదనలు అందుతాయి. పోటీలకి ప్రాధాన్యత ఇస్తారు. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. పనుల్లో వేగం పెంచుతారు. అందరి సహకారాన్ని, నమ్మకాన్ని పొందుతారు. అనుకున్న విధంగా సకాలంలో  పనులు నిర్వహిస్తారు. సీనియర్ల సలహాలు పాటిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీటింగ్‌లో ఉల్లాసంగా ఉంటారు.

Also Read:  జూన్ 21 రాశిఫలాలు, ఈ రాశివారికి మనసులో ఆందోళన ఉన్నా బయటకు ఆనందంగా కనిపిస్తారు

వృశ్చిక రాశి 

ఈ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది. అవకాశాలు వాటంతట అవే వస్తాయి. సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారు. ప్రణాళికల్లో వేగం పెంచుతారు. సమావేశాల్లో చర్చలలో విజయం సాధిస్తారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. వృత్తి నిపుణులు మెరుగ్గా రాణిస్తారు. పూర్వీకుల విషయాలలో ఆసక్తిగా ఉంటారు. అందరి మద్దతు లభిస్తుంది. ఉన్నత విద్యా కార్యకలాపాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. పెండింగ్‌లో ఉన్న కార్య క్రమాలు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాల శాతం బాగానే ఉంటుంది. అన్ని విషయాల్లో చురుకుదనం చూపిస్తారు. సంపాదన పెరుగుతుంది.

ధనుస్సు రాశి 

క్రమశిక్షణ పెంచుకోండి. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో సహనం పాటించండి.  నిజాయితీకి ప్రాధాన్యత ఇస్తారు. అపరిచితుల నుంచి దూరం పాటిస్తారు. భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది. పెద్దల సహవాసం కోసం ఆరాట పడతారు. కుటుంబ సభ్యుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక పరిణామాల వల్ల ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. పరస్పర సహకారంతో పని చేయండి.

మకర రాశి  

పార్టనర్‌షిప్‌తో పని చేయడం వల్ల వ్యాపారం మెరుగుపడుతుంది. పారిశ్రామిక ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. సంపదలో వృద్ధి ఉంటుంది. కొన్ని సమస్యాత్మక సంబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. లక్ష్యాలపై దృష్టి పెడతారు.స్నేహ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. అవసరమైన పనులలో పట్టుదలగా ఉంటారు.  వివాహితులకు అనుకూలమైన సమయం. మీ నాయకత్వానికి బలం చేకూరుతుంది. 

కుంభ రాశి 

ప్రతిపక్షాలు, శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి.  జాగ్రత్తగా ముందుకు సాగండి. లావాదేవీల్లో స్పష్టత పెరుగుతుంది. రుణ లావాదేవీలకు దూరంగా ఉండండి. చేసే పనిలో వేగం  ఉంటుంది. పనిలో దురాశకు, ప్రలోభాలకు లొంగకండి. పాలసీ రూల్స్‌లో అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది. బడ్జెట్ ప్రకారమే ముందుకు సాగుతారు. మెరుగైన దిన చర్యని అవలంభిస్తుంటారు. వ్యవస్థపై దృష్టి సారిస్తారు. 

మీన రాశి 

ఈ రాశివారు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. కెరీర్లో ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు. పెద్దల పట్ల విధేయత చూపుతారు.  పని వేగంపెరుగుతుంది.  ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీ వలన  అందరూ ప్రభావితం అవుతారు. వ్యక్తిగత విషయాల్లో బాగా రాణిస్తారు. క్రమశిక్షణ పాటిస్తారు. పెద్దల మాట వింటారు. పని మెరుగ్గా ఉంటుంది. బాధ్యత తీసుకుంటారు. కళా నైపుణ్యాలలో మెరుగ్గా ఉంటారు. కొత్త కొత్త  ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Mowgli First Day Collection : రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Embed widget