అన్వేషించండి

జూన్ 15 రాశిఫలాలు, ఈ రాశులవారికి ధనలాభంతో పాటూ ఆకస్మిక ఖర్చు కూడా ఉంటుంది!

Rasi Phalalu Today June 15th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Horoscope Today 15th June 2023: జూన్ 15 మీ రాశిఫలితాలు

మేష రాశి
ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది.కుటుంబ సభ్యులు, సన్నిహితులతోప్రత్యేక కార్యక్రమాల్లో  పాల్గొంటారు. ఉత్సాహంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అత్యుత్సాహం తో నష్టాలు తెచ్చుకోకండి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ధన లాభం    ఆహారం విషయంలో శ్రద్ద తీసుకోండి . 

వృషభ రాశి 
ఈరోజు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కావున సంయమనం పాటించి వివాదాయాలకు దూరంగా ఉండండి. అనారోగ్య కారణాల వల్ల మీరు నిరాశకు లోనవుతారు. కుటుంబంలో విభేదాలు కారణంగా మీరు అపరాధ భావంతో ఉంటారు. కష్టానికి తగిన ఫలితం లభించక పోవడంతో నిరాశకు గురవుతారు. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. ఏదో టెన్షన్ ఉంటుంది. 

మిథున రాశి
ఈరోజు వ్యాపార రంగంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. స్నేహితుల వలన ప్రయోజనంపొందుతారు. డబ్బు కూడా ఖర్చు చేస్తారు. అందమైన ప్రదేశాల పర్యటనకు వెళ్తారు. రోజంతా ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు అనుకూలమైన రోజు. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని అనుభవిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 

కర్కాటక రాశి 
కుటుంబ సభ్యులపై ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు మీరు మీ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. నూతన గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. ప్రభుత్వ పనుల వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. 

Also Read: కుంభ రాశిలో శని తిరోగమనం, ఈ 4 రాశులవారికి కష్టకాలం!

సింహ రాశి 
ఈరోజు మీ మనసుకు స్వాంతన ఉండదు. ఎదుటివారి అసంతృప్తిని భరించవలసి వస్తుంది. కుటుంబ పనుల్లో నిమగ్నమై ఉంటారు. వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ,వ్యాపారస్తులకు సకాలం లో  పనులు నెరవేరవు. ఆధ్యాత్మిక యాత్ర చేస్తారు. ప్రత్యేక పనులపై బయటకు వెళ్తారు. డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అప్పులు తీసుకోవద్దు. 

కన్యా  రాశి
ఈరోజు ఓర్పు సహనం అవసరం. కోపం వల్ల నష్టంవాటిల్లి మీ ప్రవర్తనకు మీరు పశ్చాత్తాపపడవచ్చు. ఈరోజు దంపతుల మధ్య గొడవలు. పొంచి ఉన్న శత్రువులతో ముప్పు..మీరు అప్రమత్తంగా ఉండండి. ఈరోజు కొత్త పనులను ఇంకొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. నది, చెరువు వంటి ప్రదేశాలకు దూరంగా ఉండండి. విపరీతమైన ఖర్చు ఉంటుంది. మీ ఖర్చులను నియంత్రించుకోండి.

తులా రాశి 
ఈ రోజంతా సరదాగా గడుపుతారు. ఏదో పని మీద బయటకు వెళతారు. స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. ప్రియమైన వ్యక్తితో సాన్నిహిత్యం మీకు ఆనందాన్ని ఇస్తుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు.  ఇంట బయటా  గౌరవాన్ని పొందుతారు.  మీరు మీ జీవిత భాగస్వామి సాన్నిహిత్యం  పొందుతారు. ప్రతి ఒక్కరి  ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు. 

వృశ్చిక రాశి 
ఈరోజు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు  తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. శత్రువులు ఎన్ని కుట్రలు చేసిన ఫలించవు. మాతృవర్గం నుంచి ప్రయోజనాలు పొందుతారు. ధనలాభం ఉంటుంది. ఆకస్మికంగా ఖర్చు ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులను కలుస్తారు. 

ధనుస్సు రాశి 
ఈ రోజు ఆరోగ్య విషయం లో ఆందోళన ఉంటుంది. ఉదర సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. అనుకున్న పనులు సకాలంలో జరగకపోవటం వలన  నిరాశకు గురవుతారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.  కళ,  సాహిత్యంపై ఆసక్తి కలుగుతుంది. మీ ప్రియమైన వ్యక్తిని కలుసుకుని గొప్ప అనుభూతిని పొందుతారు. మీరు చర్చలుకు, వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసర చర్చల్లో సమయాన్ని వృథా చేయకండి.

Also Read: మీ జాతకంలో ఈ గ్రహాలు బలంగా ఉంటే పర్వాలేదు కానీ బలహీనంగా ఉంటే జీవితం నరకమే!

మకర రాశి
మీ రోజు కష్టాలతో సాగుతుంది. మనసు కలత చెందుతుంది. శరీరంలో ఓపిక, శక్తి  లోపిస్తాయి . వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీల వ్యవహారాల్లో స్వతహాగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పనుల్లో నష్టం రావచ్చు. రుణ బాధలు మొదలవుతాయి. 

కుంభ రాశి 
ఈరోజు, ఆందోళన తొలగిపోవడం వల్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. బంధుమిత్రులను కలుసుకుని సంతోషిస్తారు. దంపతులు రోజంతా ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఉద్యోగంలో మీ సమస్యలు పెరగవచ్చు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొద్దు.

మీన రాశి
ఈరోజు వివాదాలకు అవకాశం ఉంటుంది. ఖర్చులను కూడా నియంత్రించుకోండి. డబ్బు సంబంధిత లావాదేవీలలో జాగ్రత్త అవసరం. మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆహారం,పానీయాలలో సంయమనం పాటించండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకొండి . మీరు బయటకు వెళ్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Jammu And Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం  
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం  
Oil Pulling Benefits : ఆయిల్ పుల్లింగ్ రోజూ చేస్తే కలిగే లాభాలివే.. అందానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటోన్న నిపుణులు
ఆయిల్ పుల్లింగ్ రోజూ చేస్తే కలిగే లాభాలివే.. అందానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటోన్న నిపుణులు
Embed widget