అన్వేషించండి

Shani Vakri 2023: కుంభ రాశిలో శని తిరోగమనం, ఈ 4 రాశులవారికి కష్టకాలం!

Shani Vakri 2023: జూన్ 13 నుంచి కుంభ రాశిలో శని వక్రం ప్రారంభమైంది. నవగ్రహాల్లో అత్యంత పవర్ ఫుల్ అయిన శని సంచారం ప్రభావం ద్వాదశ రాశులపైనా ఉంటుంది...

Shani Vakri 2023: నవగ్రహాల్లో అత్యంత శక్తిమంతుడు శని యోగకారకుడిగా ఉంటే ఎంత మంచి జరుగుతుందో యోగకారకుడు కాకపోతే ఊహించనన్ని కష్టాలు వెంటాడుతాయి. గోచారరీత్యా శని 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతి ఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. శని ఒక్కో రాశిలో రెండున్నరేళ్ల చొప్పున సంచరిస్తాడు. నిన్నటి వరకూ కుంభంలో సంచరించిన శని ఇప్పుడు కూడా అదే రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు. నవంబరు వరకూ తిరోగమనంలోనే ఉంటాడు. కర్మదాతగా పిలిచే శని..ఆయా వ్యక్తి కర్మల ప్రకారం మంచి చెడు ఫలితాలిస్తాడు.  ఈ నాలుగైదు నెలల పాటూ కుంభంలో శని తిరోగమనం వల్ల కొన్ని రాశులవారికి సమస్యలు పెరుగుతాయి.

Also Read: మీ జాతకంలో ఈ గ్రహాలు బలంగా ఉంటే పర్వాలేదు కానీ బలహీనంగా ఉంటే జీవితం నరకమే!

కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల కర్కాటక రాశి వారికి కష్టాలు పెరుగుతాయి. ఈ రాశి వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. శని తిరోగమనం కారణంగా, మీ ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించవచ్చు. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో గందరగోళం కారణంగా మీపై  ఒత్తిడి కూడా పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేయవలసి రావచ్చు.

సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

సింహ రాశి వారికి శని తిరోగమనం వల్ల నిరాశతప్పదు. మీ మనస్సు ఉద్యోగంలో నిమగ్నమై ఉండదు, దాని కారణంగా  సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. ఈ టైమ్ లో తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కూడా నష్టాన్ని చవిచూడాల్సి రావొచ్చు. చేతికి రావాల్సిన డబ్బు నిలిచిపోతుంది. ఎలాంటి ప్రమాదకర పనులు చేయకుండా ఉండడం మంచిది. 

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

వృశ్చిక రాశి వారు వచ్చే 6 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని తిరోగమన స్థితి మీకు మంచిది కాదు. కుటుంబ విషయాలతో పాటు, మీరు వృత్తి మరియు ఆర్థిక విషయాలలో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. వ్యాపారంలో నష్టపోతారు. కుటుంబ సంబంధాలలో దూరం పెరుగుతుంది.

Also Read:  

మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

శని తిరోగమనం వల్ల మీనరాశివారికి మానసిక, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మీ ప్రవర్తనలో హుందాతనం ఉండదు. కుటుంబ జీవితంతో పాటూ కార్యాలయంలోనూ సమస్యలు తప్పవు. జీవిత భాగస్వామితో వాగ్వాదాలు, సమన్వయ లోపం వల్ల ఇంటి వాతావరణం చెడుతుంది. మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. అందుకే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Ananya Nagalla: సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
Nandyala Boy Suicide: హెయిర్ కటింగ్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య- నంద్యాల జిల్లాలో విషాదం
హెయిర్ కటింగ్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య- నంద్యాల జిల్లాలో విషాదం
Embed widget